ప్రేమలో పడితే... | RV subbu's upcoming movie prema gima janta nai | Sakshi
Sakshi News home page

ప్రేమలో పడితే...

Published Sat, Sep 7 2013 11:05 PM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM

ప్రేమలో పడితే...

ప్రేమలో పడితే...

 ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్రను హీరోగా పరిచయం చేస్తూ శుభం క్రియేషన్స్ పతాకంపై మద్దాల భాస్కర్, దాడి బాల భాస్కర్ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమా గీమా జాన్‌తా నయ్’. ఆర్వీ సుబ్బు దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు మనవడు జూనియర్ ఎస్వీఆర్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తుండటం విశేషం.
 
  అలాగే ప్రియాంక చోప్రా మేనకోడలు బార్బీ హండ కథానాయికగా నటిస్తున్నారు. ఈ నెల రెండో వారంలో పాటలను, అక్టోబర్‌లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘వినోద ప్రధానంగా సాగే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. ప్రేమంటే పడని ఓ యువకుడు ప్రేమలో పడ్డ తర్వాత తన అభిప్రాయాన్ని ఎలా మార్చుకున్నాడు? అనేది ప్రధానాంశం.
 
  కొత్త కోణంలో ఉండే ప్రేమ కథ. ప్రేమ సన్నివేశాలు కూడా కొత్తగా ఉంటాయి. మణిశర్మ స్వరపర చిన పాటలు ప్రధాన ఆకర్షణ అవుతాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్‌రెడ్డి, జగదీష్, ఆర్ట్: కె.వి.రమణ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement