ప్రేమలో పడితే...
ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్రను హీరోగా పరిచయం చేస్తూ శుభం క్రియేషన్స్ పతాకంపై మద్దాల భాస్కర్, దాడి బాల భాస్కర్ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమా గీమా జాన్తా నయ్’. ఆర్వీ సుబ్బు దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు మనవడు జూనియర్ ఎస్వీఆర్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తుండటం విశేషం.
అలాగే ప్రియాంక చోప్రా మేనకోడలు బార్బీ హండ కథానాయికగా నటిస్తున్నారు. ఈ నెల రెండో వారంలో పాటలను, అక్టోబర్‌లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘వినోద ప్రధానంగా సాగే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. ప్రేమంటే పడని ఓ యువకుడు ప్రేమలో పడ్డ తర్వాత తన అభిప్రాయాన్ని ఎలా మార్చుకున్నాడు? అనేది ప్రధానాంశం.
కొత్త కోణంలో ఉండే ప్రేమ కథ. ప్రేమ సన్నివేశాలు కూడా కొత్తగా ఉంటాయి. మణిశర్మ స్వరపర చిన పాటలు ప్రధాన ఆకర్షణ అవుతాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్‌రెడ్డి, జగదీష్, ఆర్ట్: కె.వి.రమణ.