
కొత్త దర్శకులను ప్రొత్సహించడంలో టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. మంచి కంటెంట్‌తో వస్తే చాలు.. ఒక్క సినిమాతోనే అతన్ని స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరుస్తారు. అందుకే యువ దర్శకులు ఎప్పుడూ తెలుగులో సినిమాలు చేయడానికి ఇష్టపడతారు. తాజాగా టాలీవుడ్‌కి మరో డైరెక్టర్ పరిచయం కానున్నాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దగ్గర అసోసియేట్ గా దర్శకత్వ శాఖ లో పనిచేసిన సుబ్బు మెగా ఫోన్ పట్టనున్నారు.
త్రిశూల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఏ ఎన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. స్టైలిష్ లవ్ స్టొరీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ కవుటూరి హీరోగా నటిస్తున్నారు. ఇతర నటీ నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడికానున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment