‘బచ్చల మల్లి’ మూవీ క్యారెక్టర్ బేస్డ్ కథ. ఇందులో తండ్రికి సంబంధించిన భావోద్వేగ అంశాలు ప్రధానంగా ఉంటాయి. కరోనా టైమ్‌లో నా తల్లిని కోల్పోయాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక పొరపాటు జరుగుతూ ఉంటుంది. జీవితంలో వెనక్కి వెళ్లి సరిదిద్దుకోలేని తప్పులు మూర్ఖత్వంతో చేయొద్దనే విషయాన్ని చాలా నిజాయతీగా చెప్పాను’’ అని డైరెక్టర్ సుబ్బు మంగాదేవి అన్నారు. ‘అల్లరి’ నరేశ్, అమృతా అయ్యర్ జంటగా నటించిన చిత్రం ‘బచ్చల మల్లి’. ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు.
ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా సుబ్బు మంగాదేవి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘రాజేష్ దండాగారికి నేను చెప్పిన ‘బచ్చల మల్లి’ కథ నచ్చడంతో, నరేశ్‌గారికి చెప్పమన్నారు. కథ విన్న నరేశ్‌గారు వెంటనే సినిమా చేద్దామన్నారు. ‘పుష్ప 1’లో అల్లు అర్జున్‌గారిది కూలీ పాత్ర. ఇందులో బచ్చల మల్లి అనే ట్రాక్టర్ డ్రైవర్‌గా చేశారు నరేశ్‌గారు.
అలా ఆయన గెటప్ విషయంలో ΄ోలిక తప్ప కథ విషయంలో కాదు. ‘బచ్చల మల్లి’ కథని ఎమోషనల్‌గా చెప్పాలనుకున్నాం. ఇందులో మంచి ప్రేమకథ ఉంది. నేను 1990లలో ఊర్లో పెరిగాను. అప్పటి మనుషులు ఎలా ప్రవర్తించేవారో నాకు తెలుసు. అందుకే 1990 నేపథ్యంలో ఈ కథ చెప్పాలనుకున్నాను. బచ్చల మల్లి పాత్రకి నరేశ్‌గారు పూర్తి న్యాయం చేశారు. నా తర్వాతిప్రాజెక్ట్స్ కోసం కొన్ని స్టోరీ లైన్స్ ఉన్నాయి. ‘బచ్చల మల్లి’ రిలీజ్ తర్వాత వాటిపై దృష్టి పెడతాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment