
కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా రాహు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ.. ‘కొత్త సబ్జెక్ట్స్‌తో కొత్త డైరెక్టర్స్ తెలుగు సినిమాని రివల్యూషనైజ్ చేస్తున్నారు. ఇది కూడా అలాటి ఒక న్యూ ఏజ్ సినిమా అవుతుంది’ అన్నారు.
న్యూయార్క్ యూనివర్సిటీ ఫిలిం స్కూల్‌లో పట్టా పొందిన సుబ్బు.. రాహు సినిమాను టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌తో రూపొందించారు. ఈ సినిమా కాన్సెప్ట్, నటీ నటుల పెర్ఫార్మన్స్ ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు చిత్ర నిర్మాతలు. ఏవీఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు లక్కరాజు సంగీతమందిస్తున్నారు. చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment