Bhojpuri Actress Amrita Pandey Dies By Suicide In Bihar, Shares Cryptic Note On WhatsApp Hours Before Death | Sakshi
Sakshi News home page

Amrita Pandey: సినీ ఇండస్ట్రీలో విషాదం.. నటి సూసైడ్!

Published Sun, Apr 28 2024 3:23 PM | Last Updated on Mon, Apr 29 2024 8:37 AM

Bhojpuri Actress Amrita Pandey Dies By Suicide In Bihar

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ భోజ్‌పురి నటి అమృతా పాండే ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం బీహార్‌లోని భాగల్‌పూర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది. ఆమె తన గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా.. అమృత పాండే ప్రస్తుతం తన భర్తతో కలిసి ముంబయిలో నివసిస్తోంది. అయితే ఇటీవల భాగల్పూర్‌లో బంధువుల వివాహానికి వెళ్లింది. ఇంతలోనే ఇలా జరిగింది. శనివారం అమృతా తన వాట్సాప్ స్టేటస్‌పై ఓ నోట్‌ను పోస్ట్ చేసింది. అది పోస్ట్‌ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే తన గదిలో విగతజీవిలా కనిపించింది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె కుటుంబ సభ్యులు తాను డిప్రెషన్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.

అమృతా పాండే కెరీర్ విషయానికొస్తే.. ఖేసరి లాల్ యాదవ్‌తో కలిసి 'దీవానాపన్' చిత్రంతో తొలిసారిగా నటించింది. ఈ భోజ్‌పురి చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా నచ్చింది. ఆ తర్వాత 2022లో ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన చంద్రమణి ఝంగ్డేను వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక వీరిద్దరు ముంబైలోనే నివాసముంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement