పవన్‌ను ప్రస్తావిస్తూ శ్రీరెడ్డిపై వర్మ ట్వీట్‌ | RGV Tweets On Sri Reddy Quoting Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ను ప్రస్తావిస్తూ శ్రీరెడ్డిపై వర్మ ట్వీట్‌

Published Sun, Apr 8 2018 2:53 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

RGV Tweets On Sri Reddy Quoting Pawan Kalyan - Sakshi

ముంబై: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా)లో సభ్యత్వాన్ని డిమాండ్‌ చేస్తూ అర్ధనగ్న నిరసనకు దిగి సంచలనం రేపిన నటి శ్రీరెడ్డిని ఉద్దేశించి దర్శకుడు రాంగోపాల్‌వర్మ చేసిన ట్వీట్‌ వైరల్‌ అయింది. నిన్న(శనివారం) హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌ కార్యాలయం ఎదుట శ్రీరెడ్డి చేపట్టిన నిరసన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ‘‘శ్రీరెడ్డి ఇప్పుడొక నేషనల్‌ సెలబ్రిటీ. ముంబైలో పవన్‌ కల్యాణ్‌ అంటే ఎవరో కూడా తెలియని జనాలు సైతం శ్రీరెడ్డి గురించే మాట్లాడుకుంటున్నారు’ అని వర్మ పేర్కొన్నారు.

ఇటు శ్రీరెడ్డి నిరసనపై మా అసోషియేషన్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఎట్టి పరిస్థితుల్లో శ్రీరెడ్డికి సభ్యత్వం ఇచ్చేది లేదని, మా సభ్యులపై ఆరోపణలు చేయడం సరికాదని, ఈ విషయంలో లీగల్‌ చర్యలకు సైతం వెనుకాడబోమని మా అధ్య​క్షుడు శివాజీ రాజా ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. తన డిమాండ్‌ నెరవేరే వరకూ నిరసన విరమించబోనని నటి శ్రీరెడ్డి ఇదివరకే ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement