సాక్షి, హైదరాబాద్ : సరిగ్గా 28 ఏళ్ల క్రితం తెలుగు సినీ చరిత్రలో కొత్త ట్రెండ్‌ను సృష్టించిన 'శివ' కాంబినేషన్ మరోసారి రిపీట్ అయింది. నాగార్జున హీరోగా, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో 'కంపెనీ' పేరిట తెరకెక్కిస్తున్న చిత్రం ముహూర్తపు షాట్‌ను సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో వర్మ తల్లి సూర్యావతి క్లాప్ కొట్టి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, 'శివ' చిత్రం సమయంలో నాగార్జున తనపై నమ్మకం ఉంచి ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో, ఇప్పుడూ అదే విధమైన స్వేచ్ఛను తనకిచ్చారని తెలిపాడు. ఈ కథను తాను నాగ్ కు చెప్పిన తరువాత, ఎంతో ఎగ్జయిట్ అయ్యారని, తాను అంతే స్థాయిలో సినిమాను తీయనున్నట్లు పేర్కొన్నాడు. తాను నాగార్జునను ఎక్కువగా నమ్ముతానని, కథ విన్న తరువాత నాగ్ రియాక్షన్ చూసినపుడు ఈ సినిమాపై నాకు ఎంతో నమ్మకం పెరిగిందని వర్మ చెప్పుకొచ్చాడు.
‘గత కొంతకాలంగా రాంగోపాల్ వర్మకు మైండ్ దొబ్బింది, జ్యూస్ అయిపోయింది అంటున్నారు. అందులో మైండ్ దొబ్బిందన్న మాట నిజం. కానీ, జ్యూస్ అయిపోయిందా? లేదా? అన్నది ఈ సినిమా తరువాత తెలుస్తుంది.’ అన్నారు. అన్నపూర్ణ స్టూడియో అంటే తనకు సెంటిమెంట్ అని, డిసెంబర్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందన్నారు.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment