చిరంజీవికి 60 ఏళ్లా? నాకు నచ్చలేదు: వర్మ | Chiranjeevigaru I hate it that u became 60 yrs old says verma | Sakshi
Sakshi News home page

చిరంజీవికి 60 ఏళ్లా? నాకు నచ్చలేదు: వర్మ

Published Sat, Aug 22 2015 8:24 AM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

చిరంజీవికి 60 ఏళ్లా? నాకు నచ్చలేదు: వర్మ

చిరంజీవికి 60 ఏళ్లా? నాకు నచ్చలేదు: వర్మ

హైదరాబాద్: మోగాస్టార్ చిరంజీవి శనివారంతో 60 ఏళ్లలోకి ప్రవేశించనున్నారు. ఈ వేడుకని ఘనంగా జరపాలని చిరంజీవి సన్నిహితులు భావించారు.  ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పలు ఆసక్తికర విషయాలను ట్విట్ చేశారు. 'చిరంజీవి గారూ మీకు అప్పుడే 60 ఏళ్లు రావడం నాకు నచ్చలేదు..దీన్ని ప్రచారం చేసి ఆర్భాటంగా 60 ఏళ్లు వచ్చాయని అందరికి చెప్పడం అంతకన్నా నచ్చలేదు.. అభిమానులకు మీరు ఎప్పుడు 26 ఏళ్ల యువకుడే' అంటూ ట్విట్ చేశారు.  


 చిరంజీవిని ఉద్దేశించి కాదు కానీ.. మామూలుగా షష్టిపూర్తి అనేది కుటుంబ పెద్ద అనే బాధ్యతల నుంచి తప్పించడానికి సన్నిహితులు చేసే ఒక కార్యక్రమం అని అన్నారు. నేను మొదటిసారిగా చిరంజీవిని చూసినప్పుడు అయన వయస్సు 26 ఏళ్లు అని తెలిపారు. ఎప్పటికీ మీరు 26 ఏళ్ల యువకుడులానే ఉండాలి..మీరు షష్టిపూర్తి జరుపుకోవడానికి ఒప్పుకోవడం అభిమానులను చాలా బాధించిందన్నారు. 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement