Flipkart Customer Orders iPhone 13 But Receives iPhone 14, Twitterati Make FUN - Sakshi
Sakshi News home page

ఐఫోన్‌ 13 ఆర్డర్‌ చేస్తే..జాక్‌ పాట్‌! ఆపిల్‌కు దిమ్మదిరిగే కౌంటర్లు 

Published Fri, Oct 7 2022 4:48 PM | Last Updated on Fri, Oct 7 2022 6:17 PM

Flipkart customer orders iPhone 13 but receives iPhone 14 Twitterati make FUN - Sakshi

సాక్షి,ముంబై: ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే  విలువైన వస్తువుకు బదులు చీప్‌గా సబ్బులు, ఇతర పనికిరాని వస్తువులు, ఒక్కోసారి రాళ్లు వచ్చిన సంఘటనలు గతంలో చాలా చూశాం.  దీనికి సంబంధించి ఫ్లిప్‌కార్ట్  గతంలో విస్తృతంగా ట్రోల్ అయింది కూడా.  అలాగే  ఇటీవలి సేల్‌లో  కస్టమర్‌లకు చివరి నిమిషాల్లో ఆర్డర్‌లను రద్దు చేసిందంటూ ఫ్లిప్‌కార్ట్ విమర్శలు వెల్లువెత్తాయి. 

అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఒక ఆసక్తికరమైన  ఉదంతం చోటు చేసుకుంది. ఒక వినియోగ దారుడు ఐఫోన్‌13ని ఆర్డర్‌ చేస్తే.. దీనికి బదులుగా లేటెస్ట్‌ వెర్షన్‌ ఐఫోన్‌ 14 అందుకోవడం  చర్చకు దారి తీసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ట్విటర్ యూజర్ అశ్విన్ హెడ్జ్ ట్వీట్ చేశారు. అయితే దీనికి  నెటిజన్లు రియాక్షన్‌ మాత్రం అల్టిమేట్‌.   ఐఫోన్‌ 13, 14 అయినా ఒకటేగా పెద్దగా తేడా ఏముంది అంటూ  వ్యంగ్యంగా కమెంట్‌ చేస్తున్నారు.  దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేసిన నెటిజన్లు..రెండూ ఒకటేగా..ఆపిల్‌కే అయోమయంగా ఉంది. అయినా వాళ్ల తప్పేముంది.. నిజానికి రెండూ ఒకటేగా అంటూ సెటైర్లతో తమ కసి అంతా తీర్చుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement