లండన్ బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ రాజ దంపతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ రాయల్స్ హోదా నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ బ్రిటన్ రాణి ఎలిజబెత్‌కు ఓ లేఖ రాశారు. సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామనీ, తాము నార్త్ అమెరికాకు వెళ్లి ఆర్థికంగా స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నామని తెలిపారు. ఈ మేరకు హ్యారీ భార్య మేఘన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. విరామం కోసం ఆరు వారాల పాటు కెనడా వెళ్లి తిరిగి వచ్చిన జంటఈ ప్రకటన చేయడం విశేషం
డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ సస్సెక్స్ ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ నిర్ణయంపై సోషల్‌మీడియాలో దుమారం రేగింది. ఎవరితో సంప్రదించకుండా, ఆకస్మికంగా నిర్ణయం తీసుకున్నారనీ, తద్వారా బ్రిటిష్ రాజ కుటుంబంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని ట్విటర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాఖ్యానించారు. గతరాత్రి వారిద్దరూ న్యూక్లియర్ బాంబు పేల్చారని మరొకరు కమెంట్ చేశారు. వారు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆశిస్తున్నాను. అయినా...వారు భరించగలరా ట్వీట్లు, హాస్యోక్తులు, వ్యంగ్యచిత్రాల వరద పారుతోంది. మరోవైపు ఇది రాచకుటుంబానికి చెందినవ్యవహారమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు.
కాగా గతేడాది బ్రిటీష్ రాచకుటుంబంలో ఏర్పడిన విభేదాలే దీనికి కారణమని అభిప్రాయం ప్రధానంగా వినిపిస్తోంది. ప్రిన్స్ హ్యారీ దంపతులు రాచకుటుంబంలో పెద్దలను ఎవర్నీ సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ పేర్కొంది. ఈ పరిణామంపట్ల క్వీన్ఎలిజబెత్, ప్రిన్స్ చార్లెస్ నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. హ్యారీ ప్రకటనపై స్పందించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్-2..ఇది చాలా కఠినతరమైన సమస్యన్నారు. స్వతంత్రంగా జీవించాలనే వారి కోరికను అర్ధం చేసుకున్నానని..కానీ దీనిపై నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment