బ్రిటీష్ రాచరిక వ్యవస్థ నుంచి తప్పుకొని ఆర్థికంగా స్వతంత్రంగా బతకాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించిన ప్రిన్స్ హ్యారీ దంపతులు అందుకు కట్టుబడి జీవిస్తారా? అన్న సంశయం ఇప్పుడు ప్రిన్స్ విలియమ్స్ దగ్గరి నుంచి సామాన్య మానవుడి వరకు కలుగుతోంది. ఇప్పటి వరకు హ్యారీ దంపతుల కోసం ఏటా 8.3 కోట్ల రూపాయలను, వారి ప్రయాణాలకు 5.5 కోట్ల రూపాయలను, వారి వసతులకు 16.5 కోట్ల రూపాయలను ఎస్టేట్ చెల్లిస్తోంది. అంటే ఏటా వారికి 20 కోట్ల రూపాయలపైనే ఖర్చు అవుతోంది. ఇవి కాకుండా దుస్తులు, ఇతర అవసరాల కోసం చేస్తే ఖర్చులు కూడా రాచరిక వ్యవస్థ నుంచే వస్తాయి. ఇదంతా కూడా బ్రిటీష్ పౌరులు పన్నుల పేరిట రాచరిక వ్యవస్థకు చెల్లిస్తున్న సొమ్మే.
(చదవండి: ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఉండే బంగ్లా ఇదే!)
ప్రిన్స్ హ్యారీ దంపతులు ఆర్థికంగా స్వతంత్రంగా బతకడం అంటే ఈ సొమ్మును పూర్తిగా వదులు కోవాల్సి ఉంటోంది. ఆ దేశ పౌరులు ప్రిన్స్ హ్యారీ దంపతుల నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ప్రజల పన్ను డబ్బులను వదులుకోవాలని కోరుతున్నారు. ప్రిన్స్ విలియమ్స్ మాత్రం హ్యారీ దంపతులకు నచ్చచెప్పేందుకు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. రాచరిక హోదాను వదులు కోవడం వల్ల హ్యారీ తల్లి డయానా, కారు ప్రమాదంలో అకాల మరణం పాలయ్యిందని కూడా హెచ్చరిస్తున్నారు.
ఇంటి నుంచి వెళ్లిపోయి తల్లి చేసిన తప్పు చేయరాదంటూ నచ్చ చెబుతున్నారు. అన్నా వదినల కారణంగా రాచరిక కుటుంబానికి హ్యారీ దంపతులు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారుకానీ, డబ్బులు తెచ్చే హోదాకు దూరంగా ఉండాలని కాదని హ్యారీ సన్నిహితులు చెబుతున్నారు. హ్యారీ రాచరిక పదవులను వదులుకుంటున్నట్లు చెప్పారుకానీ, రాచరిక హోదాను కాదని వారంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment