తల్లిదండ్రులైన హ్యారీ దంపతులు.. బుజ్జాయి పేరేమిటంటే! | Prince Harry Meghan Name New Baby Girl | Sakshi
Sakshi News home page

రాకుమారి వచ్చేసింది.. వెల్‌కమ్‌ టూ లిల్లీ డయాన

Jun 7 2021 11:51 AM | Updated on Jun 7 2021 2:37 PM

Prince Harry Meghan Name New Baby Girl - Sakshi

కొడుకు ఆర్చితో ప్రిన్స్‌- హ్యారీ మేఘన్‌ దంపతులు

కాలిఫోర్నియా: రాచరికాన్ని వదులుకుని సామాన్య జీవితం గడుపుతున్న ప్రిన్స్‌ హ్యారీస్‌, మేఘన్‌ మార్కెల్‌ దంపతులు ఆనందడోలికల్లో తేలిపోతున్నారు. చుట్టుముట్టిన కష్టాల నడుమ వారింట్లో బోసి నవ్వులు విరబూశాయి. మేఘన్‌-హ్యారీ దంపతులు ముద్దులొలికే పసిపాపకి తల్లిదండ్రులయ్యారు . జూన్‌ 4న కాలిఫోర్నియాలోని శాంట బార్బరా కాటేజ్‌ హాస్పటిల్‌లో మేఘన్‌ మార్కెట్‌ ప్రసవించింది. అప్పుడు హ్యరీ కూడా అక్కడే ఉన్నారు. 

వారి పేర్ల కలయికతో
హ్యారీ, మేఘన్‌ జీవితాల్లోకి వచ్చిన చిన్నారికి లిల్లీ డయానా అని పేరు పెట్టుకున్నారు. ఈ పేరు వెనక పెద్ద కథే ఉంది. ప్రస్తుతం బ్రిటిష్‌ రాజకుటుంబ మహారాణి ఎలిజబెత్‌ చిన్నప్పటి ముద్దుపేరు లిల్లీబెట్‌. అలాగే రాచరికపు ఆంక్షలను ఎదిరించి చనిపోయిన తన హ్యారీ తల్లి పేరు డయానా. వీరిద్దరి గౌరవార్థం తన కూతురికి లిల్లీబెట్‌ డయాన మౌంట్‌బాటెన్‌ విండ్సర్‌ గా పేరు పెట్టారు. హ్యారీ- మేఘన్‌లకు ఇంతకు ముందు ఆర్చీ అనే కొడుకు 2019లో జన్మించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement