క్రికెటర్‌తో నటి ప్రేమాయణం గాల్లోనే.... | Parineeti Denies dating Rumours with Hardik Pandya | Sakshi
Sakshi News home page

క్రికెటర్‌తో నటి ప్రేమాయణం గాల్లోనే....

Published Mon, Sep 4 2017 2:15 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

క్రికెటర్‌తో నటి ప్రేమాయణం గాల్లోనే.... - Sakshi

క్రికెటర్‌తో నటి ప్రేమాయణం గాల్లోనే....

సాక్షి, ముంబై:  ఓ షర్మిలా ఠాగూర్‌-మన్సూర్‌ అలీ పటౌడీ, ఓ సంగీత బిజ్‌లానీ-అజారుద్దీన్‌, ఓ అనుష్క-విరాట్ కోహ్లీ.. ఇలా బాలీవుడ్‌ ప్యార్‌లో బోల్డయిన క్రికెటర్లు బోలెడంత మంది. ప్రేమ కథల్లో తేలినవి కొన్నయితే.. తెలీకుండా పోయినవి మరికొన్ని. ఇప్పుడు మరో యంగ్ బ్యూటీ కూడా క్రికెటర్‌తో ప్రేమాయాణం నడిపిస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
 
బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా-క్రికెటర్‌ హర్థిక్ పాండ్యాల మధ్య ఏదో నడుస్తుందంటూ కొన్ని రోజులుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు కారణం వారి మధ్య రీసెంట్ గా జరిగిన ట్విట్టర్ సంభాషణే. అసలేం జరిగిందంటే... ఓ సైకిల్ ఫోటోను పోస్ట్ చేసిన పరిణితి.. అమేజింగ్ పార్టనర్‌తో ఫర్‌ఫెక్ట్ ప్రయాణం కోరుకుంటున్నట్లు... ఓ సందేశం ఉంచింది. దీనికి వెంటనే స్పందించిన క్రికెటర్‌ హర్ధిక్ బహుశా ఇది బాలీవుడ్‌ క్రికెట్ లింకులో రెండోదేమో అంటూ ఓ రిప్లై ఇచ్చాడు. దానికి పరిణితి తానేం సమాధానం చెప్పలేనంటూ దాటవేసింది. అంతే అప్పటి నుంచి అసలు వ్యవహారం మొదలైంది. 
 
వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, ప్రేమాయణం నడుస్తుందంటూ బాలీవుడ్ మీడియా కథనాలు రాసేసింది. ఇక వ్యవహారం బాగా ముదిరిపోవటంతో పరిణితి ఓ ట్విట్టర్ వీడియోలో తన సందేశం ఉంచింది. జియోమీ కొత్త ఫోన్‌ 5ఎక్స్‌ ప్రచారంలో భాగంగానే తాను పార్టనర్‌ ట్వీట్‌ చేసినట్లు క్లారిటీ ఇచ్చుకుంది. అయితే అలాంటప్పుడు హర్దిక్ ‘క్రికెట్‌-బాలీవుడ్‘ అంటూ ట్వీట్‌ ఎందుకు చేశాడంటూ మరికొందరు ఆ అనుమానాలను అలాగే కొనసాగిస్తుంటే.. ఇంకొందరేమో ఆ యాడ్ లో బహుశా ఇద్దరూ కలిసి నటిస్తారేమోనని చెబుతున్నారు. ఆ సంగతి ఏమోగానీ ప్రస్తుతం గోల్‌ మాల్‌ 4 చిత్రంలో పరిణితి నటిస్తోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement