ప్రముఖ రచయిత్రి శోభాడే కి మరోసారి భంగపాటు తప్పలేదు. ఇటీవల రియో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు, పతకాలపై వ్యాఖ్యానించి విమర్శల పాలైన ఈమె మరోసారి ట్విట్టర్ జనాల ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నుద్దేశించి చేసిన ట్విట్ పై పలువురు మండిపడుతున్నారు.