ట్విట్టర్ కు కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు లిండా యక్కరినో. ఈ మేరకు ఆమె తన లింక్డ్ఇన్ అకౌంట్లో తన బయో గురించిన వివరాలను అప్డేట్ చేసి ట్విట్టర్ సీఈవో అని రాశారు.
అధికారికంగా బాధ్యతలు స్వీకరించి...
ప్రఖ్యాత సోషల్ మీడియా వేదికైన ట్విట్టర్ కు సీఈవోగా లిండా యక్కరినోను నియమిస్తూ ఎలోన్ మస్క్ మే నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆమె అధికారికంగా ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని తెలియపరుస్తూ లిండా తన లింక్డ్ ఇన్ బయో వివరాల్లో ట్విట్టర్ సీఈవో అని పొందుపరిచారు.
ఆమెపై పూర్తి నమ్మకముంది... ఎలోన్ మస్క్
లిండా యక్కరినో గతంలో ఎన్బీసీ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. ఎన్బీసీలో ఆమె ప్రకటనల విభాగానికి శాఖాధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. ట్విట్టర్ సీఈవోగా ఆమె పేరును ప్రకటించినప్పుడు ఎలోన్ మస్క్ దూరదృష్టి నన్ను ఎంతగానో ప్రభావితం చేసిందని, ఆయనతో కలిసి ట్విట్టర్ను మరింత ముందుకు తీసుసుకువెళ్ళే ప్రయత్నం చేస్తానని తెలిపారు లిండా. అదే సమయంలో లిండా సామర్థ్యంపై పూర్తి నమ్మకముందని ట్విట్టర్ ప్రకటనల మార్కెట్లో ఆమె కొత్త ఒరవడి సృష్టించగలరని ఎలోన్ మస్క్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆమెతో పాటు ఎన్బీసీ యూనివర్సల్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన జో బెనారోక్ ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ గా బాధ్యతలు స్వీకరించారు.
ఇది కూడా చదవండి: "గొప్ప నాయకుడివి"... ప్రధాని మోదీ ప్రశంస
Comments
Please login to add a commentAdd a comment