మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్వీటర్ 336 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ప్రస్తుతం కంపెనీ లో మొత్తం 4,100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
శాన్‌ఫ్రాన్సిస్కో: మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్వీటర్ 336 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ప్రస్తుతం కంపెనీ లో మొత్తం 4,100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో తొలగిస్తున్న ఉద్యోగులు 8%గా ఉన్నారు. కంపెనీ వ్యయాలను తగ్గించే దిశగా ట్వీటర్ సీఈవో జాక్ డార్సే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ట్వీటర్ నిధుల కొరతతో సతమతమౌతోంది. ట్వీటర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాక్ డార్సే ఇటీవలనే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.
వ్యయాలను తగ్గించుకోవడం వల్ల లాభాలు పెరగొచ్చు కానీ అదే సమయంలో ఉద్యోగుల్లో అభద్రతా భావం ఏర్పడటం, కం పెనీ భవిష్యత్తు వంటి తదితర అంశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.