
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ట్వీట్ చేసినా సరే అది సంచలనంగా మారుతుంది. అనుహ్య పరిణామాల నడుమ మస్క్ ట్విటర్ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ట్వీటర్ సంస్థలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు మస్క్.
మరో వైపు తన నిర్ణయాలకు సంబంధించి ట్విటర్ పోలింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు వాటిలో కొన్నింటిని ఈ పోలింగ్ ద్వారానే తీసుకోవడం గమనార్హం. తాజాగా ఎలాన్ మస్క్ మరో సంచలన ట్వీట్ చేయగా అది వైరల్‌గా మారి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ట్విటర్ నుంచి తప్పుకోమంటారా?
ఎలాన్ మస్క్ ఇటీవల ఈ పేరు వార్తల్లో విపరీతంగా వినపడుతోంది. ట్విటర్ సీఈఓగా బాధ్యతలు చేప్పటినప్పటి నుంచి అందులో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ సంస్థ భవిష్యత్తుపై నీలనీడలు కమ్ముకుంటున్నాయి. ఇదిలా ఉండగాఈ ఏడాదిలో ఏకంగా 107 బిలియన్ డాలర్లు అంటే రూ.8.84 లక్షల కోట్లను కోల్పోయి ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయారు మస్క్.
ఇన్నీ అనుహ్య సమస్యలతో సతమవుతున్న మస్క్ తాజాగా మరో ట్వీట్‌తో నెటిజన్ల ముందుకు వచ్చారు. అందులో .. తాను ట్విటర్ చీఫ్‌గా కొనసాగాలా వద్దా అని పోలింగ్ పెట్టారు. వచ్చే ఫలితాలు ఏవైనా తాను కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఈ పోలింగ్‌లో దాదాపు 58 శాతం మంది మస్క్ చీఫ్‌గా తప్పుకోవాలని ఓటు వేశారు. దీనిపై స్పందిస్తూ కొందరు నెటిజన్లు అయ్యా ఎలాన్ మస్క్ చేసిన అరాచకాలు చాలు ఇక దయ చెయ్ అని కామెంట్ చేయగా, మరొక నెటిజన్ ట్వీటర్‌తో ఆటలాడకు తొందరగా తప్పుకోవాలని కామెంట్ చేశాడు. అయితే ఈ ఫలితాన్ని మస్క్ దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Should I step down as head of Twitter? I will abide by the results of this poll.
— Elon Musk (@elonmusk) December 18, 2022
చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే!