లండన్ స్టార్టప్ ను ట్విట్టర్ కొనుగోలు | Twitter acquires Magic Pony machine learning startup | Sakshi
Sakshi News home page

లండన్ స్టార్టప్ ను ట్విట్టర్ కొనుగోలు

Published Tue, Jun 21 2016 5:22 PM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM

Twitter acquires Magic Pony machine learning startup

న్యూయార్క్ : మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్, లండన్ కు చెందిన 18నెలల స్టార్టప్ మ్యాజిక్ పోని టెక్నాలజీని కొనుగోలు చేసింది. మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను విస్తరించేందుకు ట్విట్టర్ ఈ కొనుగోలు చేపట్టింది. నిలిచిపోయిన వృద్ధిని పెంచడం కోసం ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసు సౌండ్ క్లౌడ్ లో 700లక్షల డాలర్ల పెట్టుబడులు ప్రకటించిన తర్వాతి వారంలోనే ఈ కొనుగోలును ప్రకటించడం విశేషం. మిషన్ లెర్నింగ్ సామర్థ్యాలను విస్తరించుకోవడం కోసం మ్యాజిక్ పోని కొనుగోలు సాయపడుతుందని, 2014లో ఇమేజ్ సెర్చ్ స్టార్టప్ మ్యాడ్ బిట్స్ కొనుగోలుతో ఈ విస్తరణ ప్రారంభించామని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే బ్లాగ్ లో పోస్టు చేశారు. 2015 జూన్ లో మరో మిషన్ లెర్నింగ్ స్టార్టప్ వెట్ ల్యాబ్ ను కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. మ్యాజిక్ పోని టెక్నాలజీ కొనుగోలుకు ట్విట్టర్ ఎంతమొత్తంలో చెల్లించబోతుందో పేర్కొనలేదు. అయితే బోనస్ లతో కలిపి దాదాపు 1500లక్షల డాలర్లను ట్విట్టర్ ఆ కంపెనీకి చెల్లించస్తుందని టెక్నాలజీ వెబ్ సైట్ టెక్ క్రంచ్.కామ్ తెలిపింది.

లైవ్, వీడియోల్లో తమ బలాన్ని విస్తరించేందుకు, ఉత్తేజపూర్వకమైన సృజనాత్మక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మ్యాజిక్ పోని టెక్నాలజీ ద్వారా ట్విట్టర్ కు ద్వారాలు తెరుచుకుంటాయని కంపెనీ పేర్కొంది. ప్రపంచ స్థాయి ప్రతిభతో లెర్నింగ్ టీమ్స్ బలాన్ని నిరంతరంగా పెంచడం కోసం ఇది ట్విట్టర్ కు సహకరిస్తుందని డోర్సే తెలిపారు. లోతైన లెర్నింగ్ రీసెర్చ్ అనేది తమ ప్రపంచాన్ని మెరుగుపరుస్తుందని, తమ పనిని, లెర్నింగ్స్ ను కమ్యూనిటీలతో పెంచుకోవడం కోసం తోడ్పడుతుందని డోర్సే పేర్కొన్నారు. మరోవైపు నుంచి ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ ను టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సొంతంచేసుకోబోతుందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ట్విట్టర్ ను సొంతం చేసుకునే రేసులో గూగుల్ ముందంజలో ఉందని, దాని తర్వాతి స్థానంలో ప్రపంచ మీడియా ప్లేయర్ కంకాస్ట్ పోటీపడుతుందని తెలుస్తోంది. అంతేకాక ఇంటర్నెట్ ఆధారిత సంస్థ యాహులోనైనా దీన్ని విలీనం చేయాలని ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ లు ఆ కంపెనీతో సంప్రదింపులు జరిపినట్టు రిపోర్టులు వచ్చాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement