
సాక్షి, ముంబై: ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్‌కి మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ సహా తొలగించబడిన మాజీ ఎగ్జిక్యూటివ్‌లు భారీ ఝలక్ ఇచ్చారు. 10 లక్షల డాలర్లు పరిహారం చెల్లించాలంటూ మస్క్ నేతృత్వంలోని ట్విటర్ పై దావా వేశారు.అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ వ్యాజ్యాలు, ప్రభుత్వ విచారణలకు సంబంధించిన చట్టపరమైన ఖర్చులను చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. (15 నిమిషాల్లో రూ. 400 కోట్లు సంపాదించిన రేఖా ఝున్‌ఝున్‌వాలా)
భారత సంతతికి చెందిన ట్విటర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్, మాజీ లీగల్ హెడ్ విజయ గద్దె, మాజీ సీఎఫ్‌వో సెగల్ ముగ్గురూ చట్టపరంగా తమకు రావాల్సిన చెల్లింపులు చేయాలంటూ కోర్టుకెక్కారు. ఈ మేరకు అమెరికాలోని డెలావేర్ ఛాన్సరీ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీని ప్రకారం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ పలు ధపాల విచారణలో భాగంగా తామె వెచ్చించిన లీగల్ ఫీజులకు గాను ట్విటటర్ తమకు ఒక మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉందని ముగ్గురూ ఆరోపించారు. (వామ్మో! ఇళ్లకి హైదరాబాద్‌లో ఇంత డిమాండా? కళ్లు చెదిరే సేల్స్)
కాగా గత ఏడాది అక్టోబర్‌లో మస్క్ ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లను కొనుగోలు చేశాడు. ఆ తరువాత భారీ ఖర్చు తగ్గించే చర్చల్లో భాగంగా పలుక కీలక మార్పులను చేపట్టిన మస్క్ ప్రధానం అప్పటి సీఈవో పరాగ్ అగర్వాల్, గద్దె,సెగల్‌కు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. (Vinod Rai Gupta Net Worth: వయసు 78, రూ. 32 వేలకోట్ల సంపద, ఆమె బిజినెస్ ఏంటి?)
Comments
Please login to add a commentAdd a comment