న్యూఢిల్లీ: ఎన్‌ఐఐటీ లిమిటెడ్ కంపెనీ రూ.237 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు ఆ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం లభించింది. ఈ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా మొత్తం 98.75 లక్షల ఈక్విటీ షేర్లను ఒక్కోటి రూ.240 ధరకు రూ.237 కోట్లకు మించకుండా కంపెనీ కొనుగోలు చేయనున్నది. టెండర్ ఆఫర్ మార్గంలో షేర్లను బైబ్యాక్ చేస్తామని, ఈ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉందని కంపెనీ తెలిపింది. గురువారం బీఎస్‌ఈలో ఎన్‌ఐఐటీ లిమిటెడ్ షేర్ రూ.200 వద్ద ముగిసింది. ఇటీవలే టీసీఎస్, విప్రో కంపెనీలు కూడా షేర్ల బైబ్యాక్ ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 18న మొదలై వచ్చే నెల 1న ముగిసే టీసీఎస్ కంపెనీ షేర్ల బైబ్యాక్ విలువ రూ.16,000 కోట్లు, ఇక రూ.9,550 కోట్ల విప్రో కంపెనీ షేర్ల బైబ్యాక్ ఈ నెల 29న మొదలై జనవరి 11న ముగుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment