niit
-
యువతకు ఉచిత శిక్షణ..3,474 మందికి ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎన్ఐఐటీ), ఏంజెల్‌వన్ సంయుక్త భాగస్వామ్యంలో 3,474 మంది యువతకు ఉపాధి కల్పించినట్లు ప్రకటన విడుదల చేశారు. ఈ రెండు సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమంలో భాగంగా బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (బీపీఓ), బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వంటి రంగాల్లో నైపుణ్యాలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం ప్రతిభ చూపిన వారికి ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.భారత్‌లో టెక్నాలజీపరంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. కానీ యువతలో అందుకు తగిన నైపుణ్యాలు మెరుగవడం లేదు. దాంతో సాంకేతిక రంగాల్లో ఉద్యోగాలు సాధించడం పెద్ద సవాలుగా మారుతుంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన ‘ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024’ ప్రకారం..యువతకు కొలువులు దక్కకపోవడానికి ప్రధానం కారణం సరైన విద్య, నైపుణ్యాలు లేకపోవడమేనని తేలింది. ఈ అంతరాన్ని తగ్గించేందుకు ఎన్ఐఐటీ, ఏంజెల్‌వన్ బ్రోకింగ్ సంస్థ సంయుక్తంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది.ఇదీ చదవండి: వేడి టీ పడి ఒళ్లంతా గాయాలు.. రూ.12.5 కోట్ల దావాఈ కార్యక్రమంలో పాల్గొన్న 18-28 ఏళ్ల మధ్య వయసు గల యువతకు ఉచితంగా ఆన్లైన్ కోర్సులను నేర్పిస్తున్నారు. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్) ద్వారా శిక్షణా మాడ్యూళ్లను అందిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ కోసం పురుషులతో పోలిస్తే 58% మంది మహిళలే అధికంగా తమ వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మొత్తం అభ్యర్థుల్లో 71% మంది (3,474 మంది లబ్ధిదారులు) క్వెస్ కార్ప్, సీ-టెక్, ఫిన్‌డ్రైవ్ సర్వీసెస్, హెచ్డీబీ ఫైనాన్షియల్, డీబీఎస్ మింటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థల్లో ఉద్యోగం పొందినట్లు ఎన్ఐఐటీ, ఏంజెల్ వన్ ప్రకటన విడుదల చేశాయి. మహారాష్ట్ర, గుజరాత్, దిల్లీ, కర్ణాటక వంటి వివిధ రాష్ట్రాల్లోని యువత ఈ కార్యక్రమంలో భాగమయ్యారని తెలిపాయి. 3,750 మందికి నైపుణ్యాలు అందించి వారికి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా ఈ కార్యక్రమం రూపొందించినట్లు పేర్కొన్నాయి. -
ఎన్ఐఐటీ రూ.237 కోట్ల షేర్ల బైబ్యాక్
న్యూఢిల్లీ: ఎన్ఐఐటీ లిమిటెడ్ కంపెనీ రూ.237 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు ఆ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం లభించింది. ఈ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా మొత్తం 98.75 లక్షల ఈక్విటీ షేర్లను ఒక్కోటి రూ.240 ధరకు రూ.237 కోట్లకు మించకుండా కంపెనీ కొనుగోలు చేయనున్నది. టెండర్ ఆఫర్ మార్గంలో షేర్లను బైబ్యాక్ చేస్తామని, ఈ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉందని కంపెనీ తెలిపింది. గురువారం బీఎస్ఈలో ఎన్ఐఐటీ లిమిటెడ్ షేర్ రూ.200 వద్ద ముగిసింది. ఇటీవలే టీసీఎస్, విప్రో కంపెనీలు కూడా షేర్ల బైబ్యాక్ ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 18న మొదలై వచ్చే నెల 1న ముగిసే టీసీఎస్ కంపెనీ షేర్ల బైబ్యాక్ విలువ రూ.16,000 కోట్లు, ఇక రూ.9,550 కోట్ల విప్రో కంపెనీ షేర్ల బైబ్యాక్ ఈ నెల 29న మొదలై జనవరి 11న ముగుస్తుంది. -
నిట్ వద్ద ఆందోళన
తాడేపల్లిగూడెం రూరల్ : జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్)లో ర్యాగింగ్‌కు పాల్పడి క్రమశిక్షణ చర్యలకు గురైన బాధిత విద్యార్థులు, సహచర విద్యార్థులు సంయుక్తంగా మంగళవారం పెదతాడేపల్లిలోని ఏపీ నిట్ తాత్కాలిక ప్రాంగణంలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా 2వ తేదీన జరిగిన సంఘటన ర్యాగింగ్ కాదంటూ... ర్యాగింగ్‌కు గురైనట్టు పేర్కొంటున్న విద్యార్థి ఫిర్యాదు ఉపసంహరించుకున్నా బాధిత విద్యార్థులను డిబార్ చేయడం, హాస్టల్లో ఉండనివ్వకపోవడం వంటి సంఘటనలు, ర్యాగింగ్ చట్టం కింద విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నట్టు తల్లిదండ్రులకు సమాచారం వెళ్లడంతో ఈ ఆందోళన చేపట్టారు. బాధిత విద్యార్థులకు ద్వితీయ, తృతీయ సంవత్సరం సహచర విద్యార్థులు మద్దతు పలకడంతో సుమారు 300 మంది వరకు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. ఉదయం 9.45 గంటల నుంచి తరగతులను బహిష్కరించి నిట్ పరిపాలనా భవనం ఎదుట ఆందోళనకు దిగారు. సాయంత్రం వరకు ఆందోళన కొనసాగింది. విద్యార్థులతో చర్చలు నిట్ రెసిడెంట్ కో–ఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఇతర అధ్యాపక సిబ్బంది విద్యార్థులను సముదాయించే ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో తాడేపల్లిగూడెం రూరల్ ఎస్సై బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిట్ అధికారులు మరోసారి విద్యార్థులతో భేటీ అయ్యారు. విద్యార్థులు తమ డిమాండ్లను లిఖితపూర్వకంగా అందజేశారు. క్రమశిక్షణ చర్యల్లో మదింపు, విద్యార్థులకు న్యాయం చేసేలా వరంగల్ నిట్ ఉన్నతాధికారులతో మాట్లాడతామని భరోసా ఇవ్వడంతో పాటు ప్రత్యక్షంగా వారి విజ్ఞప్తిని ఢిల్లీలోని ఎంహెచ్ఆర్డీకి ఈ మేరకు మెయిల్ చేశారు. వి ద్యార్థులు ఆందోళన విరమించారు. ఒకానొక సమయంలో సమస్య పరి ష్కారం కాని పక్షంలో ఆత్మహత్యలకు సైతం సిద్ధమంటూ విద్యార్థులు హెచ్చరించారు. దీంతో ఓ సమయంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఎట్టకేలకు చర్చలు ఫలించడంతో నిట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఐటీ ఉద్యోగులకు నైపుణ్యం పెరగాలి
ఎన్ఐఐటీ సీఈవో రాహుల్ పట్వర్ధన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచ ఐటీ రంగం అనూహ్య మార్పులకు లోనవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉన్న 39 లక్షల పైచిలుకు ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలు తప్పనిసరి అని ఎన్ఐఐటీ సీఈవో రాహుల్ పట్వర్ధన్ గురువారమిక్కడ మీడియాతో అన్నారు. వచ్చే ఐదేళ్లలో వీరంతా శిక్షణ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. బిగ్ డేటా, డేటా సైన్స్, వర్చువల్ రియాలిటీ, ఐవోటీ, రోబోటిక్స్ వంటి నూతన అంశాలన్నిటిలోనూ నైపుణ్యం ఉండాలని తెలిపారు. ‘ప్రస్తుత జనాభాలో 50 శాతం మంది 25 ఏళ్లలోపువారే. అంటే 67 కోట్ల మందికి రానున్న 20 ఏళ్లలో ఉద్యోగాలు అవసరమవుతాయి. ఆరోగ్య రంగంలో వస్తున్న టెక్నాలజీ పుణ్యమాని మనిషి సగటు జీవన కాలం అధికమవుతోంది. ఈ లెక్కన పదవీ విరమణ వయసు పెరుగుతోంది. మరోవైపు ఐటీ రంగంలో ఉద్యోగాల కోత పడుతోంది. పరిశ్రమ అవసరానికి తగ్గట్టుగా మల్టీ టాస్క్ పనులు చేయగలిగే సత్తా ఉన్నవారికే భవిష్యత్తులో ఉద్యోగాలు ఉంటాయి’ అని వెల్లడించారు. ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్మెంట్లు పెద్దగా ఉండకపోవచ్చని అన్నారు. ఐటీ కంపెనీల ఉద్యోగులకు ఎన్ఐఐటీ ద్వారా శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. డిజి నెక్టŠస్ పేరుతో 12 రకాల కోర్సులను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపారు. -
దేశవ్యాప్త ర్యాంకింగ్‌లో వరంగల్ నిట్‌కు నాలుగో స్థానం
కాజీపేట అర్బన్ : దేశవ్యాప్త నిట్ల ర్యాంకింగ్‌లో వరంగల్ నిట్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్జవదేకర్ సోమవారం ఢిల్లీలో ప్రకటించారు. 1959లో అక్టోబర్ 10న అప్పటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నె్రçహూ ప్రారంభించిన ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లో మొట్టమొదటిది వరంగల్ ఆర్ఈసీ. సాంకేతిక విద్యకు కేంద్రంగా మారిన ఆర్ఈసీ 2002లో జాతీ యస్థాయిలో గుర్తింపు పొంది జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నిట్)గా రూపాంతరం చెందింది. ప్రస్తుతం నూతన ఆవిష్కరణలు, క్యాంపస్ ఇంటర్వూలు, అత్యుత్తమ విద్యకు కేంద్రంగా నిలుస్తోంది. వరంగల్ నిట్‌లో çసుమారు మూడు వేలకు పైగా రెసిడెన్షియల్ విద్యార్థులతో పాటు 269మంది పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్లు విద్యనభ్యసిస్తున్నారు. అత్యుత్తమ విద్యతో క్యాంపస్ సెలక్షన్స్‌లో మొదటి స్థానంలో నిలుస్తోంది. నిట్‌కు చెందిన ఓ విద్యార్థి ఇటీవల నెలకు రూ.80 లక్షల జీతంతో ఎంపిక కావడం విశేషం. నంబర్‌వన్ స్థానానికి కృషి చేస్తాం : వైఎన్.రెడ్డి, నిట్ రిజిస్ట్రార్ దేశవ్యాప్తంగా 31 నిట్‌లలో వరంగల్ నిట్ నాల్గవ స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో మొదటి స్థానానికి కృషి చేస్తాం. -
బ్యాంకింగ్.. సాఫ్ట్వేర్ రంగాల్లో అపార అవకాశాలు
ఒంగోలు: స్థానిక నిట్ సెంటర్లో ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ప్రారంభించడం శుభపరిణామమని వ్యక్తిత్వ వికాస నిపుణుడు నల్లూరి రాఘవరావు అన్నారు. ఇటీవల నిట్ నిర్వహించిన ఇంటర్వ్యూల్లో జిల్లానుంచి ఎన్నికైన అభ్యర్థులకు మంగళవారం ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల అధిపతులు ఆఫర్ లెటర్ అందించారు. ప్రస్తుతం బ్యాంకింగ్, సాఫ్ట్వేర్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. నిట్ సెంటర్ అధినేత రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో 29 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. పేస్ నుంచి 8 మంది, క్విస్ నుంచి 5, ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ 4, రైజ్ 3, ఎస్ఎస్ఎన్ 3, సెయింట్ ఆన్స్ 2, కిట్స్ నుంచి ఒకరు , వీవీఎస్ఆర్ నుంచి ఒకరు, శ్రీహర్షిణి నుంచి ఇద్దరు, బీఏకేఆర్ నుంచి ఒకరు ఎంపికయ్యారన్నారు. క్విస్, పేస్, ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీల అధినేతలు నిడమానూరి నాగేశ్వరరావు, మద్దిశెట్టి శ్రీధర్, కంచర్ల రామయ్య, నిట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ వి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నిట్ ఇక శిక్షణాలయం కూడా...
-ఇంజనీరింగ్ అధ్యాపకులకు శిక్షణ -ఏటా నాలుగు వేల మందికి -ఐదు రాష్ట్రాల అధ్యాపకులకు ఇక్కడే వరంగల్ : ప్రతిష్టాత్మక వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) మరో గుర్తింపు పొందింది. ఇంజనీరింగ్ బోధనను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్య నాణ్యతా ప్రమాణలు పెంచేందుకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ అకాడమిక్ పేరుతో దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో ఈ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా నాలుగు వేల మంది అధ్యాపకులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రసిద్ధిగాంచిన ఐబీఎం, సీడాక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు ఈ శిక్షణలో భాగస్వాములవుతున్నాయి. వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దీంట్లో ఒకటిగా ఉంది. వరంగల్‌లో నిట్‌లో తొలివిడతలో ఇప్పటికే 750 మంది అధ్యాపకులకు ఇటీవలే శిక్షణ పూర్తి చేశారు. శిక్షణ కోసం ప్రతి అధ్యాపకుడికి రూ.15 వేల ఖర్చవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఒక్కో అధ్యాపకుడి కోసం రూ.12,500 కేటాయిస్తుండగా ఐదేళ్ల శిక్షణ కోసం వరంగల్ నిట్‌కు రూ.25 కోట్ల గ్రాంట్ అందనుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నిత్యం కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది. కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటిపై ప్రైవేటు కాలేజీల అధ్యాపకులకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండడం లేదు. ప్రథమశ్రేణి నగరాలను మినహాయించి.. మిగిలిన ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ఏటా లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారు. వీరిలో 80 శాతం మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని మానవవనరుల శాఖ అధ్యయనంలో తేలింది. అకడమిక్ అంశాల్లో పట్టులేకపోవడం, మార్కెట్ అవసరాలకు తగినట్లుగా నైపుణ్యం లోపించడం వంటి కారాణాలతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ చర్యలు చేపట్టింది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లోని అధ్యాపకుల్లో బోధన నైపుణ్యం పెంచే విధంగా ప్రణాళిక రూపొందించింది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అకాడమిక్ టెక్నాలజీ (ఐసీటీ) పేరుతో అధ్యాపకులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. దీని కోసం దేశ వ్యాప్తంగా ఏడు కేంద్రాలను ఎంపిక చేసింది. దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, గోవా, అండమాన్నికోబార్లకు చెందిన అధ్యాపకులకు వరంగల్ నిట్‌లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఐదేళ్లపాటు శిక్షణ.. ఇంజనీరింగ్ కాలేజీల అధ్యాపకులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం వరంగల్ నిట్‌లో ఐదేళ్లపాటు కొనసాగుతుందని నిట్ డైరెక్టర్ ఫ్రొపెసర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాల్లో వస్తున్న మార్పులు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అనువైన బోధన పద్ధతులపై శిక్షణ ఇస్తారు. సెమినార్లు, కాన్ఫరెన్సులు, వర్క్‌షాపులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. -
దేశవ్యాప్తంగా ‘నీట్’ వర్తిస్తుంది
►లోక్‌సభలో ఎంపీ వినోద్ ప్రశ్నకు కేంద్రం స్పష్టీకరణ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూకశ్మీర్ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) ద్వారానే వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్‌సభలో శుక్రవారం టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ సంధించిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి జేపీ నడ్డా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలకు ఈ ప్రవేశ పరీక్ష వర్తిస్తుందా? వర్తిస్తే వివరాలేంటి?’’ అని వినోద్‌కుమార్ ప్రశ్నించారు. దీనికి జేపీ నడ్డా సమాధానం ఇచ్చారు. ‘‘కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో భారత వైద్య మండలి యూజీ, పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు ‘నీట్’ నిర్వహించాలని నోటిఫై చేసింది. 21.12.2010న ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 2012-13 విద్యా సంవత్సరం నుంచి ఇది వర్తిస్తుంది. ఎంసీఐ 27.02.2012న సవరించిన నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీని ప్రకారం ‘నీట్’ 2013-14 నుంచి వర్తిస్తుంది. సుప్రీంకోర్టు 18.07.2013న ‘నీట్’ అమలును నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం, ఎంసీఐ దీనిపై రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి. 11.04.2016న ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం రివ్యూ పిటిషన్‌పై విచారణకు అనుమతిస్తూ 18.07.2013 నాటి తీర్పును రీకాల్ చేసింది. అలాగే 28.04.2016న సంకల్ప్ ఛారిటబుల్ ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ... ‘నీట్’ను రెండు విడతల్లో నిర్వహించేందుకు అనుమతించింది’’ అని జేపీ నడ్డా పేర్కొన్నారు. -
‘నీట్’ చిక్కుముడులు
ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకుని వైద్య విద్యా కోర్సుల్లో చేరాలనుకున్న విద్యా ర్థులకు ఇది నిజంగా పరీక్షా కాలం. ఏడాదంతా చదువుకుని వేర్వేరు ప్రవేశ పరీక్షలు రాసిన, రాయబోతున్న లక్షలాదిమంది విద్యార్థులు జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)పై సుప్రీంకోర్టు గురు, శుక్రవారాల్లో వెలువరించిన తీర్పులతో అయో మయంలో పడ్డారు. 11నాటి తీర్పు ఫలితంగా నీట్ నిర్వహణ కోసం 2010లో జారీ అయిన నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిందని...కనుక ఈ ఏడాది నీట్ పెట్టి తీరాల్సిందేనని గురువారం అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం స్పష్టంచేసింది. మే1న నీట్ నిర్వహించాలని...అందులో పాల్గొనలేని వారికోసం జూలై 24న మరో పరీక్ష పెట్టాలని ఆ తీర్పులో తెలిపింది. ఇప్పటి కిప్పుడు పరీక్షంటే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతాయని, కనుక మే 1 జరగబోయే పరీక్ష రద్దుచేయాలన్న కేంద్రం విజ్ఞప్తిని శుక్రవారం ధర్మాసనం తోసిపుచ్చింది. రెండు పరీక్షలూ ఉండాల్సిందేనని చెప్పింది. గురువారం నాటి తీర్పులో సవరణలు అవసరమో కాదో తర్వాత నిర్ణయిస్తామన్నది. అదేం శాపమో... నీట్ మొదలైనప్పటినుంచీ అది వివాదాల్లోనే చిక్కుకుం టున్నది. తొలిసారిగా 2012లో పరీక్ష నిర్వహించినప్పుడు సైతం నీట్ రాయాలా, వద్దా అని విద్యార్ధులు సంశయంలో పడ్డారు. ఎవరికేది ఇష్టమైతే అది రాసుకోవ చ్చునని సుప్రీంకోర్టు చివరకు తేల్చిచెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. నీట్ రాజ్యాంగ విరుద్ధమంటూ 2013 జూలైలో 2-1 మెజారిటీతో వెలువడిన తీర్పుతో సమస్య తీరిందనుకున్నారు. కానీ దాన్ని వెనక్కు తీసుకుంటున్నామని జస్టిస్ దవే నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈనెల 11న తేల్చి చెప్పింది. దానికి కొనసాగింపుగానే గురువారంనాటి తీర్పు, శుక్రవారంనాటి వివరణా వెలువడ్డాయి. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రాన్నీ, రాష్ట్ర ప్రభుత్వాలనూ తప్పుబట్టాలి. తగినంత వ్యవధి లేదు గనుక ఈసారి మాత్రం నీట్ నిర్వహణ సాధ్యంకాదని తీర్పు వెలువడటానికి ముందే కేంద్రం చెప్పి ఉండాల్సింది. వేర్వేరు సెట్లలో తలమునకలై ఉన్న రాష్ట్రాలు కూడా ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఆత్రుత కనబరిచి, ఈ వ్యవహారంలో తమను కూడా పిటిషనర్లుగా చేర్చాలని ముందే కోరవలసింది. రెండు వైపులా అలా జరగలేదు. తీర్పు వెలువడ్డాక కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వచ్చే ఏడాదినుంచి మాత్రమే అది వర్తిస్తుందన్నట్టు మాట్లాడింది. సీబీఎస్ఈ నేతృత్వంలో ప్రీ మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్(పీఎంటీ) మే 1న నిర్వహిం చాలని నిర్ణయించి గత డిసెంబర్లోనే నోటిఫికేషన్ విడుదల చేశారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీతోసహా దేశంలోని కొన్ని వర్సిటీలు ఇప్పటికే అలాంటి ఎంట్రెన్స్‌లు నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ శుక్రవారం ఎంసెట్ నిర్వహించింది. తెలంగాణ వేరే కారణంతో వాయిదా వేసింది గానీ లేనట్టయితే మే 2న అక్కడ కూడా ఎంసెట్ జరిగేది. వాస్తవానికి నీట్ నిర్వహణ బాధ్యతను ఎంసీఐకి అప్పగిస్తూ ఎంసీఐ చట్టానికి తలపెట్టిన సవరణల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వల్ల మే 1న సీబీఎస్ఈ నిర్వహించే ప్రీ మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ ‘నీట్’ అవుతుంది. జూలై 24న నిర్వహించాల్సిన రెండో దఫా పరీక్షను మాత్రం ఎంసీఐ నిర్వహిస్తుంది. ఇందువల్ల ఒక విచిత్రమైన స్థితి ఏర్పడింది. మే 1న నీట్ రాయబోయే విద్యార్ధులకు డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదలైనప్పుడే ఆ పరీక్ష స్వరూపస్వభావాలూ, ప్రశ్న పత్రం నమూనా వగైరాలన్నీ తెలిశాయి. అందుకనుగుణంగానే వారు నాలుగు నెలలుగా ఆ పరీక్షకు సంసిద్ధులవుతున్నారు. జూలైలో రాయబోయేవారికి మాత్రం మరికొన్ని రోజుల తర్వాత విడుదలయ్యే నోటిఫికేషన్ తర్వాతగానీ ఆ పరీక్ష తీరుతెన్నులు తెలిసే అవకాశం లేదు. తెలిశాక వారికుండే వ్యవధి మహా అయితే రెండు నెలలు మాత్రమే. ఇప్పటికే ఆయా రాష్ట్రాల సెట్లు రాసినవారికీ, రాయబో తున్నవారికీ నీట్ అదనపు భారం. అంతేకాదు...తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు అసలు ఏ సెట్లూ లేకుండా ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తు న్నాయి. అలాంటి రాష్ట్రాల్లోని విద్యార్థులు ఇప్పటికిప్పుడు అత్యవసరంగా సెట్లకు సంసిద్ధులు కావలసివస్తుంది. అసలు రాజ్యాంగ అధికరణ 371(డీ)కింద ప్రత్యేక కేటగిరీలోకొచ్చే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూ-కశ్మీర్ రాష్ట్రాల విద్యార్థులు నీట్ పరిధిలోకి వస్తారో, రారో సుప్రీంకోర్టు తేల్చాల్సి ఉంది. నీట్ పరిధిలోకి వారూ వస్తారని పార్లమెంట్లో కేంద్రం వివరణనిచ్చినా న్యాయస్థానం నుంచి ఆ మేరకు స్పష్టత వస్తే తప్ప అది ఆఖరి మాట కాదు. ఇప్పటికే సెట్లు పూర్తయిన రాష్ట్రాలకూ, అలాంటి సెట్లే లేని రాష్ట్రాలకూ ఈసారికి మినహాయింపునివ్వాలన్న పిటిషన్లపై ఈరోజే తీర్పు వెలువరిద్దామ నుకున్నా అయిదుగురు న్యాయమూర్తులూ కలవడం సాధ్యంకాకపోవడంతో అది కాస్తా వాయిదా పడింది. ‘ముందు నీట్ జరగనీయండి... ఆ సంగతి తర్వాత చూద్దామ’ని జస్టిస్ ఏఆర్ దవే చెప్పారు. కనుక ఎంసెట్లు రాసినవారూ, రాయ బోతున్నవారూ, అసలు ఎలాంటి సెట్ల బెడదా లేనివారూ నీట్ రాయక తప్పదు. అంతేకాదు ఇప్పటికే తాము రాసిన సెట్లు బుట్టదాఖలవుతాయో, పనికొస్తాయో కూడా వారికి తెలియదు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రమాణాలు పెరగడం అవసరమే. ప్రైవేటు విద్యా సంస్థల సీట్లు కేటాయింపుల్లో అవకతవకలు చోటుచేసుకుంటున్న మాటా వాస్తవమే. మెడిసిన్ చదవగోరే విద్యార్థి అనేక టెస్ట్‌లు రాయక తప్పనిస్థితి కూడా నిజమే. కానీ ఇలా ఆదరాబాదరగా... ఇంతటి అయోమయ పరిస్థితుల్లో ఈ ఏడాదే కొత్త విధానాన్ని ప్రారంభించాలా? ఎయిమ్స్, జిప్మర్వంటి సంస్థలు నీట్ పరిధిలోకొస్తాయో, రావో...హిందీ భాషలో ప్రశ్నపత్రం రాసేవారితో సమానంగా ప్రాంతీయ భాషల్లో రాసే విద్యార్థులకు సీట్ల కేటాయింపు ఉంటుందో, ఉండదో తేల్చకుండానే నీట్ జరిగితీరాలా? సర్వోన్నత న్యాయస్థానం ఆలోచించాలి. అందరికీ సమన్యాయం చేకూరేలా చూడాలి. -
నిట్‌లో స్ప్రింగ్ స్ప్రీ-2016
-
పట్టిసీమ పథకానికి చంద్రబాబు శంకుస్థాపన
-
'భూములిచ్చిన రైతులకు ఎకరానికి అదనంగా రూ.20 వేలు'
పశ్చిమగోదావరి: పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సీఎం చంద్రబాబు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గత అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు టీడీపీకి 15 సీట్లిచ్చి పూర్తి మద్దతు పలికారని, పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో వారి రుణం తీర్చుకుంటానన్నారు. జిల్లాలో నిట్, మెరైన్ ఇంజనీరింగ్ యూనివర్శిటీలు ఏర్పాటుచేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో వచ్చే నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని కృష్ణాకు తరలిస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ను కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తామన్నారు. అంతేకాకుండా రాబోయే రెండు నెలల్లో డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం చేస్తామన్నారు. తనపై నమ్మకంతో రాజధాని ప్రాంత రైతులు 35 వేల ఎకరాల భూములు ఇవ్వడం సంతోషించదగ్గ పరిణామమన్నారు. అంతేకాకుండా పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి పంటనష్టం కింద ఎకరానికి రూ.20 వేలు అదనంగా అందజేస్తామని రైతులకు చంద్రబాబు హామీ ఇచ్చారు. -
ఆందోళనతో దద్దరిల్లిన నిట్
నిట్‌క్యాంపస్ : కాజీపేటలోని నిట్‌లో సెక్యూరిటీ గార్డులు, నాన్ టీచింగ్ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ జోక్యంతో మంగళవారం రాత్రి ముగిసింది. నిట్ స్టోర్ అసిస్టెంట్ ఎండీ.అక్బర్‌పై దాడిచేసిన ఇన్చార్జ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఖురేషి, ఉద్యోగి బాలసుబ్రహ్మణ్యంపై చర్య తీసుకోవాలని నిట్ ఉద్యోగ జేఏసీ, సెక్యూరిటీ గార్డులు సోమవారం ఆందోళన దిగిన విషయం తెలిసిందే. మంగళవారం కూడా కొనసాగిన వారి ఆందోళనకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మద్దతుగా నిలిచారు. తీవ్ర వాగ్వాదాలు, నిరసనల అనంతరం మంగళవారం రాత్రి నిట్ డెరైక్టర్‌తో ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ చర్చలు ఫలించారుు. మూడు గంటలపాటు మూడు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం దాడికి బాధులైన నిట్ ఇన్చార్జ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎఎ ఖురేషి, నిట్ ఉద్యోగి బాలసుబ్రమణ్యంను సస్పెండ్ చేస్తున్నట్లు నిట్ డైరక్టర్ టి శ్రీనివాసరావు ప్రకటించారు. దీంతో వారు ఆందోళన విరమించారు. ఫ్యాకల్టీ అసోసియేషన్ లెటర్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలు, ఎంపీలు నిట్ అకడమిక్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ నిట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ లేఖ విడుదల చేయడంపై ఎమ్మెల్యే వినయ్ మండి పడ్డారు. ఒక సెంట్రల్ ఇనిస్టిట్యూట్‌లో ఏం జరిగినా ఊరుకోవాలా అంటూ నిట్ డెరైక్టర్‌ను నిలదీశారు. ఆ ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్ : నిట్ డెరైక్టర్ శ్రీనివాసరావు నిట్ పూర్వ విద్యార్థిగా నిట్‌కు ఉన్న గుర్తింపును నిలబెట్టడం కోసం నిట్ ఇన్చార్జ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఖురేషి, నిట్ ఉద్యోగి బాలసుబ్రమణ్యంను సస్పెండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే, ఉద్యోగ సంఘాలు ఇచ్చిన డిమాండ్లపై కమిటీ రిపోర్టు వచ్చాక తగిన చర్యలు తీసుకుంటాం. పోలీసుల అదుపులో ఖురేషి నిట్‌లో ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిట్ ఇన్చార్జ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఖురేషిని కాజీపేట పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
క్లిష్టత పెరిగినా.. ఫలితాల్లో హవా
నిట్లు, ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశించడానికి.. అదే విధంగా అత్యున్నత విద్యకు వేదికలుగా నిలిచే ఐఐటీలు, ఐఎస్ఎం (ధన్‌బాద్)లో సీట్లను పొందేందుకు వీలుకల్పించే జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి జేఈఈ మెయిన్ మార్కులు కీలకం. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పరీక్ష ఫలితాలు, అడ్వాన్స్డ్ రాయడానికి కటాఫ్ మార్కులు తదితరాలపై స్పెషల్ ఫోకస్.. 13.57 లక్షలు.. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ 2014కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు. 1,22,863.. ఈ పరీక్షకు హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థుల సంఖ్య. (దాదాపు పది శాతం) 1.54 లక్షలు.. జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు. ఈసారి విద్యార్థినుల సంఖ్య కూడా పెరిగింది. మొత్తం ఉత్తీర్ణుల్లో 28,666 మంది విద్యార్థినులున్నారు. మరోసారి రాష్ట్ర విద్యార్థుల ప్రతిభ: గత రెండేళ్లుగా ఐఐటీ-జేఈఈ, జేఈఈ-మెయిన్, అడ్వాన్స్డ్ పరీక్షల్లో టాప్ మార్కులు, ర్యాంకులతో ప్రతిభ కనబరుస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, ఈ ఏడాది కూడా అదే హవా కొనసాగించారు. ఈ ఏడాది కూడా జాతీయ స్థాయిలో 355 మార్కులతో రాష్ట్రానికి చెందిన వాకచర్ల ప్రమోద్ మొదటి స్థానంలో నిలవగా.. మహమ్మద్ అక్రమ్ ఖాన్ అనే మరో విద్యార్థి 350 మార్కులతో రెండో స్థానం సొంతం చేసుకున్నారు. గత ఏడాది కూడా జేఈఈ-మెయిన్ మార్కుల విషయంలో మన రాష్ట్ర విద్యార్థులే తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇక.. మొత్తం ఫలితాలు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల శాతానికి సంబంధించి ప్రస్తుత సమాచారం ప్రకారం మొత్తం ఉత్తీర్ణుల్లో మన రాష్ట్ర విద్యార్థుల సంఖ్య 30 వేల నుంచి 35 వేల మధ్యలో ఉంటుందని అంచనా. ‘సీబీఎస్ఈ సిలబస్‌కు సరితూగేలా ఇంటర్మీడియెట్ సిలబస్‌లో మార్పులు తేవడం, కెమిస్ట్రీ ప్రశ్నలు గత ఏడాదితో పోల్చితే కాసింత సులభంగా ఉండటం, మరోవైపు విద్యార్థుల్లోనూ ప్రాక్టికల్ అప్రోచ్ పెరగడమే ఈ ఫలితాలకు కారణమని’ పోటీ పరీక్షల నిపుణులు పేర్కొన్నారు. పెరుగుతున్న మార్కులు: జేఈఈ పరీక్ష క్లిష్టత ఏటా పెరుగుతున్నప్పటికీ.. విద్యార్థులు సాధిస్తున్న మార్కుల సంఖ్య కూడా అంతే స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం. ముఖ్యంగా ఐఐటీ-జేఈఈకి బదులు.. జేఈఈ మెయిన్ - అడ్వాన్స్డ్ అనే కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన 2013తో పోల్చినా అత్యధిక మార్కుల విషయంలో వ్యత్యాసం కనిపిస్తోంది. గత ఏడాది అత్యధిక మార్కులు 345. కాగా, ఈ ఏడాది అత్యధిక మార్కులు 355. అదే విధంగా గత ఏడాది రెండో స్థానంలో 341 మార్కులు నిలవగా.. ఈ ఏడాది అవి 350కి పెరిగాయి. కటాఫ్‌లలోనూ పెరుగుదల: ఒకవైపు మార్కులు పెరుగుతున్నట్లే.. జేఈఈ-అడ్వాన్స్డ్ కు కటాఫ్ మార్కులు కూడా పెరుగుతున్నాయి. జనరల్ కేటగిరీ నుంచి అన్ని వర్గాల వరకు ఈ కటాఫ్‌లు గత ఏడాది కంటే పెరిగాయి. వివరాలు.. కేటగిరీ 2014 కటాఫ్ 2013 కటాఫ్ జనరల్ 115 113 ఓబీసీ 74 70 ఎస్సీ 53 50 ఎస్టీ 47 45 ఆప్షన్లలో దోషాలు.. అదనపు మార్కులు: ఈ ఏడాది ఫలితాల విషయంలో ప్రధానంగా గమనించాల్సిన అంశం.. ఆయా ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో లోపాల కారణంగా విద్యార్థులందరికీ అదనపు మార్కులు కేటాయించినట్లు సీబీఎస్ఈ ప్రకటించడం. ఏప్రిల్ 6న ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించిన పరీక్షలో ఒక ప్రశ్నకు; అదే విధంగా ఏప్రిల్ 19న ఆన్లైన్ విధానంలో నిర్వహించిన పరీక్షలో మూడు ప్రశ్నలకు ఆప్షన్లు సరిగా లేవని.. సీబీఎస్ఈ విడుదల చేసిన ‘కీ’ ఆధారంగా పలువురు విద్యార్థులు ఆరోపించిన నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆఫ్‌లైన్‌లో హాజరైన విద్యార్థులకు నాలుగు, ఏప్రిల్ 19న ఆన్లైన్ పరీక్షకు హాజరైన విద్యార్థులకు 12 మార్కులు అదనంగా కేటాయించినట్లు .. మెయిన్ ఫలితాల వెల్లడి సమయంలో సీబీఎస్ఈ చైర్మన్ వినీత్ జోషి ప్రకటించారు. ప్రతి మార్కు కీలకంగా నిలిచే జేఈఈలో అదనపు మార్కులు కేటాయించడం ర్యాంకుల విషయంలోనూ ప్రభావం చూపుతుంది. తొలుత 1.5 లక్షల మందికి: ప్రస్తుతం మెయిన్‌లో మార్కులు.. ఆయా కేటగిరీల్లో ప్రకటించిన కటాఫ్ ర్యాంకుల ఆధారంగా తొలుత 1.5 లక్షల మందికి జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు నమోదు చేసుకునేందుకు అర్హత లభించింది. వీరంతా 9వ తేదీ వరకు అడ్వాన్స్డ్ పరీక్షకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. అడ్వాన్స్డ్ పరీక్ష తదుపరి దశలో ఎంపిక క్రమంలో.. మూడు విధానాలను అనుసరిస్తారు. అవి.. జేఈఈ మెయిన్‌లో పొందిన మార్కులకు 60 శాతం వెయిటేజీ, ఇంటర్మీడియెట్ తత్సమాన పరీక్షల్లో పొందిన మార్కులకు 40 శాతం వెయిటేజీ కల్పిస్తూ తొలి జాబితా రూపొందిస్తారు. ఆ తర్వాత నార్మలైజేషన్ ద్వారా మెయిన్ తుది జాబితా సిద్ధం చేస్తారు. ఈ జాబితా ఆధారంగా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ప్రవేశాలు పొందొచ్చు. తర్వాత దశలో ఐఐటీలు, ఐఎస్ఎం (ధన్‌బాద్)ల్లో ప్రవేశానికి.. అడ్వాన్స్‌డ్‌లో మెరుగైన ర్యాంకు సాధించడంతోపాటు ఆయా బోర్డ్ పరీక్షల్లో టాప్ 20 పర్సెంటైల్‌లో ఉండాలి. గత ఏడాది గణాంకాలు.. ఈ ఏడాది మెయిన్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ ఏడాది కూడా టాప్-20 పర్సెంటైల్‌లో మన రాష్ట్ర విద్యార్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది టాప్-20 పర్సెంటైల్ జాబితాను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 91.8 శాతం మార్కులకే ఈ జాబితా పూర్తికాగా.. తమిళనాడు బోర్డ్ 90.9 శాతంతో, తర్వాత స్థానంలో కేరళ 85.2 శాతంతో నిలిచాయి. జేఈఈ - మెయిన్ మార్కులు.. ర్యాంకుల అంచనా: ఇంటర్మీడియెట్ తత్సమాన బోర్డ్ మార్కులు, జేఈఈ మెయిన్ మార్కులు, నార్మలైజేషన్ ఆధారంగా పర్సెంటైల్ గణించి జూలై 7న ఆలిండియా ర్యాంకులు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెయిన్‌లో పొందిన మార్కులు.. వాటికి లభించే ర్యాంకులపై అంచనా.. జేఈఈ మెయిన్ మార్కులు ర్యాంకు అంచనా 320 పైన 100 లోపు 290 - 310 100 నుంచి 200 270 - 290 200 నుంచి 550 250 - 270 550 నుంచి 1000 లోపు 240 - 250 1000 నుంచి 1500 220 - 240 1500 నుంచి 3500 210 - 220 3500 నుంచి 4000 200 - 210 4000 నుంచి 5500 190 - 200 5500 నుంచి 7000 185 - 190 7000 నుంచి 7700 180 - 185 7700 నుంచి 8000 175 - 180 8000 నుంచి 9500 170 - 175 9500 నుంచి 10000 160 - 170 10 వేల నుంచి 12 వేలు గత ఏడాది కామన్ మెరిట్ లిస్ట్‌లో మొదటి ర్యాంకుకు లభించిన మార్కులు 332. కాగా, చివరి ర్యాంకు విద్యార్థికి లభించిన మార్కులు 156. దీని ప్రకారం మెయిన్‌లో అత్యధిక మార్కులు పొందినా.. నార్మలైజేషన్ తర్వాత ర్యాంకుల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. అడ్వాన్స్డ్ మార్కుల ఆధారంగా 15 ఐఐటీలు, ఐటీ-బీహెచ్‌యూ, ఐఎస్ఎం-ధన్‌బాద్‌లలో లభించే సీట్లు - 9,885. వీటిలో అత్యధికంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 1,341 సీట్లు అందుబాటులో ఉండగా.. అత్యల్పంగా ఐఐటీ-మండి, ఇండోర్, రోపార్ క్యాంపస్‌లలో 120 చొప్పున ఉన్నాయి. జేఈఈ-మెయిన్ మార్కులతో లభించే సీట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లు - 15,500 సీట్లు పుల్ ఐటీలు - 850 ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లు - 15 వేలు అడ్వాన్స్‌డ్‌పై దృష్టి పెట్టాలి మెయిన్‌లో మార్కులు తెలిశాయి. ఇంటర్మీడియెట్ బోర్డ్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో అడ్వాన్స్‌డ్‌కు అర్హతగా నిర్ణయించిన టాప్-20 పర్సెంటైల్‌లో నిలవడం అనే విషయంలో అంచనా వచ్చి ఉంటుంది. కాబట్టి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఇక మే 25న నిర్వహించనున్న అడ్వాన్స్‌డ్‌పై దృష్టి పెట్టాలి. రెండు రోజుల వ్యవధిలో ఎంసెట్, అడ్వాన్స్డ్ పరీక్షలు జరగనున్న తరుణంలో ఈ రెండింటి సిలబస్‌ను బేరీజు వేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో రివిజన్‌కు, మాక్ టెస్ట్‌లు, ప్రాక్టీస్ టెస్ట్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి. మెయిన్ పరీక్ష సరళిని పరిశీలిస్తే ప్రాక్టీస్, పేపర్- వర్క్ అవసరమైన ప్రశ్నలు ఎక్కువగా కనిపించాయి. అడ్వాన్స్‌డ్‌లోనూ ఇవే తరహా ప్రశ్నలు కనిపించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఫిజిక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. జేఈఈ - 2014 మే 2 అర్ధరాత్రి జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి. 1,50,000 మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ మే 25, 2014 (ఆఫ్‌లైన్) 20,000 మంది విద్యార్థులకు ర్యాంక్ కేటాయిస్తారు ఇంటర్లో టాప్ 20 పర్సంటైల్‌లో ఉంటే ఐఐటీలు, ఐఎస్ఎం - ధన్బాద్లో సీటు కేటాయిస్తారు పరీక్ష రాసిన విద్యార్థులందరికీ జేఈఈ మెయిన్‌కు 60 శాతం, ఇంటర్‌కు 40 శాతం వెయిటేజీతో జూలై 7న ర్యాంక్ కేటాయిస్తారు నిట్స్, ఐఐఐటీ, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర విద్యా సంస్థల్లో సీటు కేటాయిస్తారు -
స్ప్రింగ్‌స్ప్రీ ఫ్యాషన్ షో అదుర్స్
-
‘నిట్’లో స్ప్రింగ్ స్ప్రీ జోష్
శోభిత అందాలకు మంత్రముగ్దులైన యువతరం అనూప్ రూబెన్స్ పాటతో గొంతుకలిపిన స్టూడెంట్స్ నిట్ క్యాంపస్, న్యూస్‌లైన్ : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో స్ప్రింగ్ స్ప్రీ కార్యక్రమం అందాల వనిత మిస్ ఇండియా ఎర్త శోభిత, సంగీ త కెరటం అనూప్‌రూబెన్స్ పాటలతో ప్రారంభమైంది. ప్రతి ఏటా జరిగే కల్చరల్ ఫెస్ట్‌లో భాగంగా ఈసారి స్ప్రింగ్ స్ప్రీ కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి 23 వరకు నిర్వహిస్తున్నారు. వేడుకలను ప్రారంభించేందుకు శోభిత ధూళి పాల, సంగీత దర్శకుడు అనూప్రూబెన్స్ను నిర్వాహకులు ఆహ్వానించారు. అనుకున్న సమయానికన్నా మూడు గంటల ఆలస్యంగా కార్యక్రమం ప్రారంభమైనా శోభితను చూసేందుకు నిట్ ఇంజినీరింగ్ విద్యార్థులు నిరీక్షించారు. ఫ్యాషన్‌షోలో వేసుకునే డ్రెస్స్‌తో తలపై కిరీటం పెట్టుకుని గురువారం రాత్రి 8 గంటలకు అనూప్‌రూబెన్స్‌తో కలిసి ఆమె రాగానే విద్యార్థుల ఈలలు, కేకలతో నిట్ ఆడిటోరియం మార్మోగిపోయింది. స్ప్రింగ్‌స్ప్రీ ప్రారంభం.. స్ప్రింగ్ స్ప్రీ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి మ్యూజిక్ డైరక్టర్ అనూప్‌రూబెన్స్, మిస్ ఇండియా ఎర్త శోభిత దూళిపాల, నిట్ డైరక్టర్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో నిట్ స్టూడెంట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు దినేష్‌రెడ్డి, స్ప్రింగ్ స్ప్రీ కో ఆర్డినేటర్ శరత్‌కుమార్, నిట్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ఎస్.శ్రీనివాసరావు, నిట్ఫ్యాకల్టీ అడ్వయిజర్ శ్రీనాథ్ మాట్లాడారు. శోభితను చూస్తూ మంత్రముగ్ధులైన విద్యార్థులు మిస్ఇండియా శోభిత దూళిపాల అందాలకు విద్యార్థులు మంత్రముగ్దులయ్యారు. ఆమెను ఫొటోలు తీసేందుకు కెమెరాలు పట్టుకుని పోటీపడ్డారు. ఆమె మాటలకు,చిరునవ్వుకు, చూపులకు ఈలల వేస్తూ, కేరింతలు కొట్టారు.