బ్యాంకింగ్‌.. సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో అపార అవకాశాలు | NIIT management speaks over placements in banking and software sector | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్‌.. సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో అపార అవకాశాలు

Published Thu, Oct 13 2016 12:28 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

బ్యాంకింగ్‌.. సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో అపార అవకాశాలు

బ్యాంకింగ్‌.. సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో అపార అవకాశాలు

ఒంగోలు: స్థానిక నిట్‌ సెంటర్‌లో ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ప్రారంభించడం శుభపరిణామమని వ్యక్తిత్వ వికాస నిపుణుడు నల్లూరి రాఘవరావు అన్నారు. ఇటీవల నిట్‌ నిర్వహించిన ఇంటర్వ్యూల్లో జిల్లానుంచి ఎన్నికైన అభ్యర్థులకు మంగళవారం ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల అధిపతులు ఆఫర్‌ లెటర్‌ అందించారు. ప్రస్తుతం బ్యాంకింగ్, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

నిట్‌ సెంటర్‌ అధినేత రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో 29 మంది విద్యార్థులు  ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. పేస్‌ నుంచి 8 మంది, క్విస్‌ నుంచి 5, ప్రకాశం ఇంజనీరింగ్‌ కాలేజీ 4, రైజ్‌  3, ఎస్‌ఎస్‌ఎన్‌ 3, సెయింట్‌ ఆన్స్‌  2, కిట్స్‌ నుంచి ఒకరు , వీవీఎస్‌ఆర్‌ నుంచి ఒకరు, శ్రీహర్షిణి నుంచి ఇద్దరు, బీఏకేఆర్‌ నుంచి ఒకరు ఎంపికయ్యారన్నారు.  క్విస్, పేస్, ప్రకాశం ఇంజనీరింగ్‌ కాలేజీల అధినేతలు నిడమానూరి నాగేశ్వరరావు, మద్దిశెట్టి శ్రీధర్, కంచర్ల రామయ్య, నిట్‌ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ వి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement