దేశవ్యాప్త ర్యాంకింగ్‌లో వరంగల్ నిట్‌కు నాలుగో స్థానం
దేశవ్యాప్త ర్యాంకింగ్‌లో వరంగల్ నిట్‌కు నాలుగో స్థానం
Published Tue, Apr 4 2017 7:36 AM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM
కాజీపేట అర్బన్ : దేశవ్యాప్త నిట్‌ల ర్యాంకింగ్‌లో వరంగల్ నిట్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్‌జవదేకర్ సోమవారం ఢిల్లీలో ప్రకటించారు. 1959లో అక్టోబర్ 10న అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నె్రçహూ ప్రారంభించిన ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లో మొట్టమొదటిది వరంగల్ ఆర్‌ఈసీ. సాంకేతిక విద్యకు కేంద్రంగా మారిన ఆర్‌ఈసీ 2002లో జాతీ యస్థాయిలో గుర్తింపు పొంది జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నిట్)గా రూపాంతరం చెందింది.
ప్రస్తుతం నూతన ఆవిష్కరణలు, క్యాంపస్ ఇంటర్వూలు, అత్యుత్తమ విద్యకు కేంద్రంగా నిలుస్తోంది. వరంగల్ నిట్‌లో çసుమారు మూడు వేలకు పైగా రెసిడెన్షియల్ విద్యార్థులతో పాటు 269మంది పీహెచ్‌డీ రీసెర్చ్ స్కాలర్లు విద్యనభ్యసిస్తున్నారు. అత్యుత్తమ విద్యతో క్యాంపస్ సెలక్షన్స్‌లో మొదటి స్థానంలో నిలుస్తోంది. నిట్‌కు చెందిన ఓ విద్యార్థి ఇటీవల నెలకు రూ.80 లక్షల జీతంతో ఎంపిక కావడం విశేషం.
నంబర్‌వన్ స్థానానికి కృషి చేస్తాం :
వైఎన్.రెడ్డి, నిట్ రిజిస్ట్రార్
దేశవ్యాప్తంగా 31 నిట్‌లలో వరంగల్ నిట్ నాల్గవ స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో మొదటి స్థానానికి కృషి చేస్తాం.
Advertisement
Advertisement