buyback of shares
-
అక్టోబర్ నుంచి ఆరు మార్పులు అమలు
ఆదాయపు పన్ను చట్టానికి సంబంధించి అక్టోబర్ 1 నుంచి ప్రధానంగా ఆరు మార్పులు అమల్లోకి వచ్చాయి. వివాద్ సే విశ్వాస్ పథకం ప్రారంభం, పాన్-ఆధార్, టీడీఎస్..వంటి నిబంధనల్లో మార్పలు తీసుకొచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అవి ఏంటో తెలుసుకుందాం.1. వివాద్ సే విశ్వాస్ పథకంప్రత్యక్ష పన్ను మదింపులో హెచ్చుతగ్గులు సహజం. ఈ పథకం ప్రకారం మనం లెక్కించిన దానికన్నా పన్ను భారం పెరిగితే మనం అప్పీలుకు వెళ్లవచ్చు. అలాగే డిపార్టుమెంటు వారు కూడా అప్పీలు చేసుకోవచ్చు. అప్పీలుకు వెళ్లడం అంటే వివాదమే. ఈ వివాదాలు ఒక కొలిక్కి వచ్చేసరికి సమయం ఎంతో వృధా అవుతుంది. కాలయాపనతో పాటు మనశ్శాంతి లేకపోవటం, అశాంతి, అనారోగ్యం మొదలైనవి ఏర్పడతాయి. అటువంటి వివాదాల జోలికి పోకుండా పన్ను భారాన్ని వీలున్నంత వరకు తగ్గించి కట్టేలా చేసే స్కీమ్ ఇది. ఇది 2024 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. వివాదాలు పోయి ఒకరిపై ఒకరు విశ్వాసాన్ని పొందడమే దీని పరమావధి.2. ఆదార్ నంబర్ తప్పనిసరిపాన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్ నంబరుకు బదులుగా గతంలో ఆధార్ కార్డు నమోదు ఐడీని నింపమనేవారు. కానీ ఇక నుంచి ఆ తంతు కొనసాగదు. కచ్చితంగా పాన్ దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ నంబర్ వేయాల్సిందే. ఆధార్ నంబరు వేయకపోవడం వల్ల పాన్ విషయంలో దుర్వినియోగం అవుతోంది. పాన్, ఆధార్ కార్డు అనుసంధానం సరిగ్గా జరగడం లేదు. ఈ మార్పుతో జాప్యాన్ని, దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు.3. ఎస్టీటీ పెంపుస్టాక్మార్కెట్ ట్రేడింగ్ విషయంలో ఫ్యూచర్స్, ఆప్షన్స్‌కి సంబంధించి ఎస్టీటీ ఛార్జీని పెంచారు. ఇక నుంచి ఫ్యూచర్స్ విషయంలో ఈ రేటు 0.02%గా ఉంటుంది. అలాగే ఆప్షన్స్‌కి ఎస్టీటీ రేటు 0.01%గా ఉంటుంది. ఇవి ఈ మార్కెట్ వృద్ధికి తగ్గట్లుగా ఉంటాయని, రేట్ల క్రమబద్ధీకరణ జరుగుతుందని అంచనా.ఇదీ చదవండి: 70 ఏళ్లు నిండిన వారికి ఉచిత బీమా!4. ఫ్లోటింగ్ టీడీఎస్ రేటుఇది చిన్న మదుపర్లకు ఇబ్బంది కలగకుండా అంటే, బాండ్ల మీద సమకూరే వడ్డీ సంవత్సరానికి రూ.10,000 దాటితే వర్తిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బాండ్ల మీద 10 శాతం ఫ్లోటింగ్ రేటు అమలు చేస్తారు.5. బైబ్యాక్ షేర్లపై పన్నుఇక నుంచి మదుపర్లపై కాకుండా కంపెనీలకు పన్ను విధిస్తారు. ఎలాగైతే డివిడెండ్ల విషయంలో కంపెనీలను పన్ను పరిధిలోకి తీసుకొచ్చారో అలాగే దీన్ని కూడా ప్రతిపాదించారు.6. టీడీఎస్ రేట్ల సవరణకొన్ని టీడీఎస్ రేట్లను సవరించారు. సెక్షన్ 194D కింద బీమా కమీషన్ చెల్లింపులపై టీడీఎస్ రేటు 5% నుంచి 2%కు తగ్గించారు. జీవిత బీమా చెల్లింపులపై టీడీఎస్ రేటు 5% నుంచి 2% కు చేర్చారు. లాటరీ టికెట్ కమీషన్లపై ఈ రేటును 2% కి తగ్గించారు. -
మరింత పారదర్శకంగా బైబ్యాక్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షేర్ల బైబ్యాక్ విధానాన్ని క్రమబద్ధీకరించేందుకు నడుం బిగించింది. ఇందుకు తాజా ప్రతిపాదనలతో చర్చా పత్రాన్ని విడుదల చేసింది. తద్వారా బైబ్యాక్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా, సమర్థవంతంగా, వాటాదారులకు మద్దతిచ్చే బాటలో చేపట్టే చర్యలకు తెరతీసింది. వీటి ప్రకారం గరిష్ట పరిమితిలో కోతతోపాటు, బైబ్యాక్ పూర్తిచేసే గడువును భారీగా తగ్గించనుంది. బైబ్యాక్‌లో షేర్ల కొనుగోలు వివరాలపై స్పష్టత కోసం స్టాక్ ఎక్సే్ఛంజీలలో ప్రత్యేక విండోను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఓపెన్ మార్కెట్ ద్వారా కంపెనీ చెల్లించిన మూలధనంలో 15 శాతానికి మించకుండా ఫ్రీ రిజర్వుల ద్వారా బైబ్యాక్‌ను చేపట్టేందుకు వీలుంది. వచ్చే ఏప్రిల్ నుంచి 10 శాతానికి కుదిస్తోంది. ఆపై ఏడాది 5 శాతానికి, తదుపరి పరిమితిని పూర్తిగా ఎత్తివేయనుంది. ఇక టెండర్ మార్గంలో బైబ్యాక్‌కు ప్రస్తుతమున్న 25 శాతం పరిమితిని 40 శాతానికి పెంచనుంది. ప్రస్తుతం బైబ్యాక్ పూర్తికి ఆరు నెలల గడువు లభిస్తోంది. అయితే ఈ గడువులో కృత్రిమంగా డిమాండును సృష్టించడం ద్వారా షేర్ల ధరలను ప్రభావితం చేసేందుకు అవకాశముంటున్నదని సెబీ పేర్కొంది. దీంతో గడువులో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. తాజా ప్రతిపాదనలపై సెబీ డిసెంబర్ 1వరకూ పబ్లిక్ నుంచి సూచనలు కోరుతోంది. 22 రోజులకు పరిమితం తాజా ప్రతిపాదనల ప్రకారం 2023 ఏప్రిల్ నుంచి బైబ్యాక్ గడువును 66 పనిదినాలకు కుదించనుంది. ఆపై 2024 ఏప్రిల్ నుంచి 22 రోజులకు తగ్గించనుంది. ఈ బాటలో 2025 ఏప్రిల్ నుంచి ఓపెన్ మార్కెట్ విధానానికి స్వస్తి పలకనుంది. స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా బైబ్యాక్‌ను చేపడితే ఇందుకు కేటాయించిన నిధులను 75 శాతం వరకూ వినియోగించవలసి ఉంటుంది. ప్రస్తుతం ఈ పరిమితి 50 శాతంగా ఉంది. అంతేకాకుండా గడువులో సగం రోజులు ముగిసేసరికి కనీసం 40 శాతం సొమ్మును షేర్ల కొనుగోలుకి వెచ్చించవలసి ఉంటుంది. యాక్టివ్‌గా ట్రేడయ్యే షేర్లలోనే బైబ్యాక్‌ను చేపట్టవలసి ఉంటుంది. కంపెనీ నికరంగా రుణరహితమై ఉంటే ఒకే ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లు బైబ్యాక్ చేపట్టేందుకు అనుమతిస్తారు. అయితే ఇందుకు ఆరు నెలల కనీస గడువును పాటించడంతోపాటు టెండర్ మార్గాన్ని ఎంచుకోవలసి ఉంటుంది. ఇక బుక్ బిల్డింగ్ పద్ధతిలో ఓపెన్ మార్కెట్ బైబ్యాక్‌లకు ప్రమోటర్లు, సహచరులు పాల్గొనేందుకు అనుమతించరు. బైబ్యాక్‌పై పన్ను విధింపును కంపెనీకి బదులుగా సంబంధిత వాటాదారులకు బదిలీ చేయవలసిందిగా ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం బైబ్యాక్‌లో పాలుపంచుకోని వాటాదారులపై పన్ను భారం పడుతున్నందున తాజా సవరణలకు సెబీ ప్రతిపాదించింది. -
యూపీఎల్‌లో నాలుగు దిగ్గజాల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆగ్రోకెమికల్ దిగ్గజం యూపీఎల్‌లో నాలుగు అంతర్జాతీయ సంస్థలు మైనారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్నాయి. యూపీఎల్ ప్రకటన ప్రకారం ఇందుకోసం అబు దాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), బ్రూక్‌ఫీల్డ్, కేకేఆర్, టీపీజీ వేర్వేరుగా రూ. 4,040 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అగ్రి–టెక్ ప్లాట్‌ఫాం యూపీఎల్ ఎస్‌ఏఎస్‌లో ఏడీఐఏ, బ్రూక్‌ఫీల్డ్, టీపీజీ 9.09 శాతం వాటాల కోసం 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,580 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తున్నాయి. దీనికోసం యూపీఎల్ ఎస్ఏఎస్ ఈక్విటీ వేల్యుయేషన్‌ను 2.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 17,380 కోట్లు)గా లెక్కకట్టారు. ఇక, 2.25 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. రూ. 18,450 కోట్లు) వేల్యుయేషన్‌తో ’అడ్వాంటా ఎంటర్ప్రైజెస్ – గ్లోబల్ సీడ్స్ ప్లాట్‌ఫాం’లో కేకేఆర్ రూ. 2,460 కోట్లు (300 మిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేస్తోంది. మరోవైపు, గ్లోబల్ క్రాప్ ప్రొటెక్షన్ ప్లాట్‌ఫాంగా వ్యవహరించే యూపీఎల్ కేమ్యాన్లో ఏడీఐఏ, టీపీజీ 22.2 శాతం కొనుగోలు చేస్తున్నాయి. అయితే, ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడి కాలేదు. -
షేర్ల బైబ్యాక్‌కు యూపీఎల్ సై
న్యూఢిల్లీ: అగ్రోకెమికల్స్ దిగ్గజం యూపీఎల్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)ను చేపట్టనున్నట్లు వెల్లడించింది. ప్రమోటర్లు మినహా వాటాదారుల నుంచి షేర్లను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేసింది. ఓపెన్ మార్కెట్ ద్వారా షేరుకి రూ. 875 ధర మించకుండా కంపెనీ ఈక్విటీలో సుమారు 1.65 శాతం వాటాను బైబ్యాక్ చేయనున్నట్లు తెలియజేసింది. వెరసి గరిష్ట ధర ప్రకారం సుమారు 1,25,71,428 షేర్లను కొనుగోలు చేసే వీలుంది. ఇందుకు రూ. 1,100 కోట్లవరకూ వెచ్చించనుంది. ప్రతిపాదిత బైబ్యాక్‌కు నియంత్రిత సంస్థలు తదితరాల నుంచి అనుమతులు లభించవలసి ఉన్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు 28.24 శాతం వాటా ఉంది. ప్రస్తుత డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ రూ. 1,179 కోట్ల నికర లాభం ఆర్జించిన సంగతి తెలిసిందే. -
బైబ్యాక్‌కు టీసీ‘ఎస్’
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పీడిస్తున్నప్పటికీ దేశీ దిగ్గజాల సాఫ్ట్వేర్ సేవలకు డిమాండ్ కొనసాగుతోంది. కోవిడ్–19 ప్రభావంతో ఇటీవల ఆన్లైన్ సర్వీసులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది. ఇది దేశీ ఐటీ దిగ్గజాలకు కలసి వస్తున్నట్లు సాఫ్ట్వేర్ పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. కొద్ది రోజులుగా వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్‌కు ఐటీ కంపెనీలు మొగ్గు చూపినప్పటికీ ఫ్రెషర్స్ నియామకాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవల డిజిటల్ సేవలు విస్తరిస్తుండటంతో అంతర్జాతీయంగా పలు కంపెనీలు డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కోసం భారీ నిధులను కేటాయిస్తున్నాయి. దీంతో దేశీ కంపెనీలు భారీ కాంట్రాక్టులను కుదుర్చుకుంటున్నాయి. వెరసి ఈ ఏడాది క్యూ3లో ఐటీ దిగ్గజాలు మరోసారి ఆకర్షణీయ పనితీరును ప్రదర్శించాయి. టీసీఎస్ అయితే మరోసారి సొంత ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు తెరతీసింది. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవలకు అగ్రస్థానంలో నిలుస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఈ ఏడాది(2021–22) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహక ఫలితాలు సాధించింది. అంతేకాకుండా రూ. 18,000 కోట్లతో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)ను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 12 శాతంపైగా ఎగసింది. రూ. 9,769 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 8,701 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 16 శాతం వృద్ధితో రూ. 48,885 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 42,015 కోట్ల టర్నోవర్ నమోదైంది. షేరుకి రూ. 4,500 షేరుకి రూ. 4,500 ధర మించకుండా 4 కోట్ల ఈక్విటీ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు టీసీఎస్ వెల్లడించింది. 1.08 శాతం ఈక్విటీకి ఇవి సమానంకాగా.. ఇందుకు రూ. 18,000 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. కాగా.. గత కేలండర్ ఏడాది(2021)లో కంపెనీ కీలకమైన 25 బిలియన్ డాలర్ల ఆదాయ మైలురాయిని అందుకున్నట్లు సీవోవో ఎన్.గణపతి సుబ్రమణ్యం తెలియజేశారు. నైపుణ్యాలపై వెచ్చిస్తున్న పెట్టుబడులతో సరఫరాల సవాళ్లలోనూ పటిష్ట పురోగతిని సాధించగలిగినట్లు కంపెనీ సీఎఫ్‌వో సమీర్ సేక్సారియా పేర్కొన్నారు. 2021–22 తొలి అర్ధభాగంలో తీసుకున్న 43,000 మంది ఫ్రెషర్స్ కాకుండా తాజా త్రైమాసికంలో 34,000 మందిని ఎంపిక చేసినట్లు సీహెచ్ఆర్వో మిలింద్ లక్కడ్ వెల్లడించారు. ఇతర హైలైట్స్ ► వాటాదారులకు షేరుకి రూ. 7 చొప్పున మధ్యంతర డివిడెండ్. ఇందుకు రికార్డ్ డేట్ ఫిబ్రవరి 7. ► క్యూ3లో నికరంగా 28,238 మందికి ఉపాధిని కల్పించింది. ► డిసెంబర్‌కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 5,56,986కు చేరింది. ► ఉద్యోగ వలసల రేటు 15.3%గా నమోదైంది. ► డిసెంబర్‌కల్లా నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 59,920 కోట్లుగా నమోదు. ► కంపెనీలో ప్రస్తుతం ప్రమోటర్ల వాటా 72.19%. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వచ్చాయి. షేరు 1.5% నీరసించి రూ. 3,857 వద్ద ముగిసింది. కస్టమర్ల బిజినెస్ ట్రాన్స్ఫార్మేషన్ అవసరాలకు అనుగుణమైన సర్వీసులు అందించడంలో కంపెనీకున్న సామర్థ్యాలను తాజా ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. ఎండ్టుఎండ్ నైపుణ్యాలు, సవాళ్ల పరిష్కారంలో కంపెనీ చూపుతున్న చొరవ తదితర అంశాలు క్లయింట్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితాలలో వృద్ధి కొనసాగడమే ఇందుకు నిదర్శనం. – రాజేష్ గోపీనాథన్, సీఈవో, ఎండీ, టీసీఎస్. -
ఇన్ఫీ లాభం రూ. 5,076 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ గతేడాది చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 17.5 శాతం పెరిగి రూ. 5,076 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 4,321 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 13 శాతంపైగా ఎగసి రూ. 26,311 కోట్లకు చేరింది. గత క్యూ4లో రూ. 23,267 కోట్ల టర్నోవర్ సాధించింది. డాలర్ల రూపేణా ఆదాయం 13 శాతం వృద్ధితో 361.3 కోట్ల డాలర్లుగా నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 15 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాది(2020–21)లో ఇన్ఫోసిస్ నికర లాభం 16.6 శాతం పురోగమించి రూ. 19,351 కోట్లకు చేరింది. ఇక మొత్తం ఆదాయం దాదాపు 11 శాతం పుంజుకుని రూ. 1,00,472 కోట్లను తాకింది. కాగా.. ఇప్పటికే చెల్లించిన రూ. 12తో కలిపి గతేడాదికి 54 శాతం అధికంగా రూ. 27 డివిడెండ్‌ను చెల్లించినట్లయ్యింది. బైబ్యాక్‌కు రెడీ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలుకి ఇన్ఫోసిస్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో షేరుకీ రూ. 1,750 ధర మించకుండా 5.25 కోట్లకుపైగా షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు వెల్లడించింది. 1.23 శాతం వాటాకు సమానమైన వీటి కొనుగోలుకి రూ. 9,200 కోట్ల వరకూ వెచ్చించనుంది. ఫలితాలపై అంచనాల నేపథ్యంలో మంగళవారం ఇన్ఫోసిస్ షేరు ఎన్ఎస్ఈలో 1.6% క్షీణించి రూ. 1,403 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే బైబ్యాక్‌కు 25 శాతం ప్రీమియంను ప్రకటించడం గమనార్హం! ఇన్ఫీ అంతక్రితం 2019 ఆగస్ట్‌లో 11.05 కోట్ల ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేసింది. ఇందుకు రూ. 8,260 కోట్లు వెచ్చించింది. 2017 డిసెంబర్లో తొలిసారి షేరుకి రూ. 1,150 ధరలో బైబ్యాక్‌ను చేపట్టింది. తద్వారా 11.3 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. గైడెన్స్ భేష్..: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆదాయం 12–14 శాతం స్థాయిలో బలపడే వీలున్నట్లు ఇన్ఫోసిస్ తాజాగా అంచనా వేసింది. ఇది స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఇచ్చిన గైడెన్స్‌కాగా.. డివిడెండ్(రూ. 6,400 కోట్లు), బైబ్యాక్‌తో కలిపి వాటాదారులకు రూ. 15,600 కోట్లను తిరిగి చెల్లించనున్నట్లు తెలియజేసింది. తద్వారా వాటాదారులకు క్యాష్‌ఫ్లోలలో 85 శాతం వరకూ చెల్లించే విధానాలను పాటిస్తున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ వివరించారు. ఆర్డర్ బుక్ రికార్డు 2020–21లో భారీ డీల్స్ ఆర్డర్ల విలువ 57 శాతం జంప్‌చేసి 14.1 బిలియన్ డాలర్లను తాకినట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. వీటిలో 66 శాతం డీల్స్‌ను కొత్తగా కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. డిసెంబర్లో కొత్త రికార్డును నెలకొల్పుతూ దైమ్లర్ ఏజీ నుంచి 3.2 బిలియన్ డాలర్ల(అంచనా) ఆర్డర్‌ను పొందింది. గతేడాది ఆగస్ట్‌లో వ్యాన్‌గార్డ్ నుంచి సంపాదించిన 1.5 బిలియన్ డాలర్ల కాంట్రాక్టుతో పోలిస్తే ఇది రెట్టింపు విలువకావడం విశేషం! క్యూ4లో సైతం 2.1 బిలియన్ డాలర్ల కాంట్రాక్టులు కుదుర్చుకుంది. 25,000 మంది ఫ్రెషర్స్‌కు చాన్స్ గతేడాదిలో 36,500 మందిని ఇన్ఫోసిస్ కొత్తగా నియమించు కుంది. వీరిలో క్యాంపస్ నియామకాల ద్వారా 21,000 మందికి ఉపాధి కల్పించినట్లు సీవోవో యూబీ ప్రవీణ్ రావు పేర్కొన్నారు. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25,000 మంది ఫ్రెషర్స్‌ను ఎంపిక చేసుకోనున్నట్లు తెలియజేశారు. వీరిలో 1,000 మందిని విదేశీ క్యాంపస్‌ల ద్వారా నియమించుకోనున్నట్లు వివరించారు. క్యూ3లో 10.1 శాతంగా నమోదైన ఉద్యోగ వలస రేటు క్యూ4లో 15.2 శాతానికి ఎగసింది. మార్చికల్లా కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 2,59,619కు చేరింది. రూ. లక్ష కోట్లకు.. గతేడాది ఆదాయంలో రూ. లక్ష కోట్ల మైలురాయిని అధిగమించాం. క్లయింట్లకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. కోబాల్ట్ టీఎం తదితర నైపుణ్యాల ద్వారా డిజిటల్ పోర్ట్‌ఫోలియోను పెంచుకుంటున్నాం. ఉద్యోగులకు అధికారాలు ఇవ్వడం ద్వారా గ్లోబల్ స్థాయిలో క్లయింట్లను ఆకట్టుకుంటున్నాం. భాగస్వామి ఎంపికలో క్లయింట్ల నుంచి ప్రాధాన్యతను సాధిస్తున్నాం. – ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ -
ఎన్ఐఐటీ రూ.237 కోట్ల షేర్ల బైబ్యాక్
న్యూఢిల్లీ: ఎన్ఐఐటీ లిమిటెడ్ కంపెనీ రూ.237 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు ఆ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం లభించింది. ఈ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా మొత్తం 98.75 లక్షల ఈక్విటీ షేర్లను ఒక్కోటి రూ.240 ధరకు రూ.237 కోట్లకు మించకుండా కంపెనీ కొనుగోలు చేయనున్నది. టెండర్ ఆఫర్ మార్గంలో షేర్లను బైబ్యాక్ చేస్తామని, ఈ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉందని కంపెనీ తెలిపింది. గురువారం బీఎస్ఈలో ఎన్ఐఐటీ లిమిటెడ్ షేర్ రూ.200 వద్ద ముగిసింది. ఇటీవలే టీసీఎస్, విప్రో కంపెనీలు కూడా షేర్ల బైబ్యాక్ ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 18న మొదలై వచ్చే నెల 1న ముగిసే టీసీఎస్ కంపెనీ షేర్ల బైబ్యాక్ విలువ రూ.16,000 కోట్లు, ఇక రూ.9,550 కోట్ల విప్రో కంపెనీ షేర్ల బైబ్యాక్ ఈ నెల 29న మొదలై జనవరి 11న ముగుస్తుంది. -
మెట్రోతో డీల్- ఈక్విటీ బైబ్యాక్- విప్రో స్పీడ్
ముంబై, సాక్షి: జర్మన్ హోల్‌సేల్ దిగ్గజం మెట్రో ఏజీతో 70 కోట్ల డాలర్ల(సుమారు రూ. 5,150 కోట్లు) డీల్ కుదుర్చుకున్నట్లు ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఐదేళ్లపాటు అమల్లో ఉండే ఈ కాంట్రాక్టును తదుపరి దశలో నాలుగేళ్లకు పొడిగించుకునేందుకు వీలున్నట్లు తెలియజేసింది. తద్వారా 100 కోట్ల డాలర్లకు డీల్ విలువ చేరే వీలున్నట్లు అంచనా వేసింది. డీల్‌లో భాగంగా మెట్రో ఏజీ జర్మనీ, మెట్రో సిస్టమ్స్ రుమేనియాకుగల ఐటీ యూనిట్లను విప్రో చేజిక్కించుకోనుంది. భాగస్వామ్యంలో భాగంగా జర్మనీ, రుమేనియాలలోగల 1,300 మంది ఉద్యోగులు విప్రోకు బదిలీకానున్నారు. వెరసి విప్రో వీరికి డిజిటల్ టెక్నాలజీస్, కొత్త అవకాశాపై అవగాహన, ఇంజినీరింగ్ నైపుణ్యం తదితరాలను అందించనుంది. (వచ్చే వారం నుంచీ మనకూ వ్యాక్సిన్! ) బైబ్యాక్ 29న ఐటీ సర్వీసుల దిగ్గజం విప్రో ఈ నెల 29 నుంచీ ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను ప్రారంభించనుంది. 2021 జనవరి 11 వరకూ కొనసాగనున్న బైబ్యాక్‌లో భాగంగా 23.75 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. షేరుకి రూ. 400 ధర మించకుండా చేపట్టనున్న బైబ్యాక్ కోసం రూ. 9,500 కోట్ల వరకూ వెచ్చించనుంది. మరోపక్క ఐటీ సేవల దేశీ దిగ్గజం టీసీఎస్ సైతం ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను ప్రారంభించిన విషయం విదితమే. జనవరి 1వరకూ కొనసాగనున్న బైబ్యాక్‌లో భాగంగా టీసీఎస్ రూ. 3,000 ధర మించకుండా షేర్లను కొనుగోలు చేయనుంది. కాగా.. విప్రో ఇంతక్రితం 2019లోనూ షేరుకి రూ. 325 ధర మించకుండా 32.31 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసింది. ఇందుకు రూ. 10,500 కోట్లను వెచ్చించడం గమనార్హం! షేరు జూమ్ జర్మన్ దిగ్గజం మెట్రో ఏజీతో భారీ డీల్, ఈక్విటీ షేర్ల బైబ్యాక్ నేపథ్యంలో విప్రో లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 5.5 శాతం జంప్‌చేసింది. రూ. 384ను అధిగమించింది. వెరసి చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. (నాతో డీల్‌కు కుక్ నో చెప్పారు: మస్క్) -
30 నుంచి నాల్కో బైబ్యాక్ ఆఫర్...
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాల్కో షేర్ల బైబ్యాక్ ఈ నెల 30న ప్రారంభం కానుంది. సెస్టెంబర్ 14తో ముగుస్తుంది. ఇందులో భాగంగా రూ.2,835 కోట్ల విలువైన సుమారు 64.43 కోట్ల షేర్లను (22.15 శాతం వాటాకు సమానం) కొనుగోలు చేయనుంది. ఒక్కో షేరుకు రూ.44 చొప్పున చెల్లించనుండగా... ఇందుకుగాను రిజర్వ్ నిధులను వినియోగించనుంది. ఎస్బీఐ కేపిటల్ మార్కెట్స్‌కు బైబ్యాక్ కార్యక్రమ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ఆఫర్ లెటర్‌ను నాల్కో స్టాక్ ఎక్స్ఛేంజ్లకు అందజేసింది. మూలధనం తగ్గించడం ద్వారా దీర్ఘకాలంలో వాటాదారుల విలువ పెరుగనున్నట్టు కంపెనీ తెలిపింది. -
ఈ నెల 18 నుంచి డాక్టర్ రెడ్డీస్ షేర్ల బైబ్యాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) ఏప్రిల్ 18 నుంచి షేర్ల బైబ్యాక్ చేపట్టనున్నట్లు మంగళవారం తెలిపింది. గరిష్టంగా షేరు ఒక్కింటికి రూ. 3,500 వెచ్చించనున్నట్లు వివరించింది. ఇది స్టాక్ ఎక్స్చేంజీల్లో మంగళవారం నాటి కంపెనీ షేరు ప్రారంభ ధర రూ. 3,079తో పోలిస్తే 14 శాతం అధికం. షేర్ల బైబ్యాక్ కోసం డీఆర్ఎల్ గరిష్టంగా రూ. 1,569 కోట్లు కేటాయించింది. కంపెనీ మొత్తం మూలధనంలో 25 శాతం షేర్లకు మించకుండా ఈ బైబ్యాక్ జరుపుతుంది. మిగులు నిధులను సమర్ధంగా వినియోగించుకునే లక్ష్యంలో భాగంగా బైబ్యాక్ చేపట్టాల్సి వచ్చినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. తాజా బైబ్యాక్‌తో షేర్ల సంఖ్య తగ్గుతుందని, ఫలితంగా షేరు ఒక్కింటిపై రాబడి (ఈపీఎస్) పెరుగుతుందని పేర్కొన్నాయి. గణాంకాల ప్రకారం గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి డీఆర్ఎల్ చేతిలో సుమారు రూ. 2,500 కోట్ల మిగులు నిధులు ఉన్నాయి. కాగా, షేర్ల బైబ్యాక్ వార్తలతో మంగళవారం బీఎస్ఈలో డీఆర్ఎల్ షేరు ధర 1.79 శాతం పెరిగి రూ. 3,082.80 వద్ద క్లోజయ్యింది.