న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ తన వాటాదారులకు రెండో మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేర్‌కు రూ.1.40 చొప్పున(140 శాతం) రెండో మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. ఈ నెల 18నాటికి తమ షేర్లను హోల్డ్ చేస్తున్న వాటాదారులకు ఈ నెల 20లోపు ఈ డివిడెండ్‌ను చెల్లిస్తామని టీవీఎస్ మోటార్ కంపెనీ తెలిపింది. మొత్తం 47.5 కోట్ల షేర్లకు రూ.80 కోట్లు చెల్లించనున్నామని పేర్కొంది. గత నెలలోనే ఈ కంపెనీ ఒక్కో షేర్‌కు రూ.2.10 డివిడెండ్‌ను ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment