TVS Motor Company
-
టీవీఎస్ ఐక్యూబ్‌పై స్విగ్గీ డెలివరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తాజాగా డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా స్విగ్గీ ఫుడ్ డెలివరీ సేవలకు టీవీఎస్ తయారీ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తారు. ఇరు కంపెనీలు స్విగ్గీ డెలివరీ భాగస్వాముల కోసం స్థిరమైన, సమగ్ర పరిష్కారాలను అన్వేషిస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా 2025 నాటికి రోజూ 8,00,000 కిలోమీటర్ల మేర డెలివరీలను చేపట్టాలన్నది స్విగ్గీ లక్ష్యం. -
స్విగ్గీ డెలివరీలు సరికొత్తగా..! ప్రణాళికలు సిద్ధం..!
డెలివరీ విషయంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ సరికొత్త ప్రణాళికలకు సిద్దమైన్నట్లు కన్పిస్తోంది. సంప్రాదాయ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను వాడేందుకు పావులు కదుపుతోంది స్విగ్గీ. టీవీఎస్ మోటార్స్‌తో ఒప్పందం..! డెలివరీ సేవల్లో ఎలక్ట్రిక్ వాహనాలను వాడేందుకుగాను స్విగ్గీ ప్రముఖ దేశీయ టూవీలర్ దిగ్గజం టీవీఎస్ మోటార్స్‌తో జతకట్టింది. టీవీఎస్ ఎలక్ట్రిక్ వాహనాలను ఫుడ్ డెలివరీలతో పాటు ఆన్-డిమాండ్ సేవలు, ఇతర కార్యక్రమాల కోసం వినియోగించేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు కంపెనీలు ఓ ప్రకటనలో తెలిపాయి. దేశవ్యాప్తంగా ప్రతిరోజు 8 లక్షల కిలోమీటర్లు ఎలక్ట్రిక్ వాహనాలు తిరిగేలా ప్రణాళికలను స్విగ్గీ ప్రకటించింది. వీలైనంతా త్వరగా ఎలక్ట్రిక్ వాహనాలతో డెలివరీ సేవలను అందిస్తామని స్విగ్గీ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ మిహిర్ రాజేష్ షా వెల్లడించారు. వివిధ మొబిలిటీ విభాగాల్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచేందుకు ఈ భాగస్వామ్యం ఎంతో ఉపయోగపడుతుందని టీవీఎస్ మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. టీవీఎస్ మోటార్ కంపెనీ తమ వినియోగదారులకు అవసరమైన స్థాయిలో వాహనాలను అందించడంలో ముందుంది. ఈ ఒప్పందం దేశీయ వాహన మార్కెట్లో ఈవీలకు మరింత ఆదరణను పెంచుతుందని ఆశిస్తున్నట్లు టీవీఎస్ మోటార్స్ కంపెనీ ఫ్యూచర్ మొబిలిటీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ మను సక్సెనా చెప్పారు. స్విగ్గీ-టీవీఎస్ మోటార్స్ ఒప్పందంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా ప్రధాన నగరాల్లో స్విగ్గీ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, పూణె, కొచ్చి, కోయంబత్తూరుతో సహా 33 నగరాల్లో అందుబాటులో ఉంది. చదవండి: బిగ్ బాస్కెట్, జియో మార్ట్‌లకు పోటీగా...బిగ్ బజార్ భారీ స్కెచ్..! -
గుడ్ న్యూస్: టీవీఎస్ అపాచీ బైక్ పై భారీ ఆఫర్
మీరు కొత్తగా బైక్ కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ తన అపాచీ ఆర్టీఆర్ 200 4వి బైక్ పై భారీ ఆఫర్ ప్రకటించింది. టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన అపాచీ ఆర్టీఆర్ 200 4విని ఆన్లైన్లో బుక్ చేసుకుంటే రూ.5,000 క్యాష్‌బ్యాక్‌తో అందిస్తుంది. అదేవిధంగా ఈ బైక్‌ను ఫైనాన్స్ స్కీమ్ ద్వారా కొనుగోలు చేస్తే మీకు రూ.10 వేల వరకు తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ 2021 జూన్ 30 వరకు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఈ మోటారుసైకిల్ విభాగంలో రెండు వేరియంట్లు అమ్మకానికి ఉన్నాయి. రైడ్ మోడ్లతో సింగిల్-ఛానల్ ఎబిఎస్ వేరియంట్, డ్రైవింగ్ మోడ్లతో డ్యుయల్-ఛానల్ ఎబిఎస్ వేరియంట్. సింగిల్-ఛానల్ ఎబిఎస్ వేరియంట్ మోటార్ సైకిళ్ ధర ఉంటే,1.29 లక్షలు, డ్యుయల్-ఛానల్ ఎబిఎస్ వేరియంట్ ధర రూ.1.34 లక్షలు(ఎక్స్ షో-రూమ్)గా ఉంది. ఇందులో 8,500 ఆర్పీఎమ్ వద్ద 20.54 హెచ్‌పీ, 7,000 ఆర్పీఎమ్ వద్ద 18.1 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసే 198 సీసీ ఫోర్-వాల్వ్, ఆయిల్-కూల్డ్ సీంగిల్ సీలిండర్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉంది. డ్రైవింగ్ మోడ్‌ను బట్టి పవర్ అవుట్‌పుట్ మారుతుంది. ఈ బైక్ గరిష్ఠ వేగం వచ్చేసీ గంటకు 127 కి.మీ. టీవీఎస్ భారతదేశంలో టీవీఎస్ ఎన్టోర్క్ 125 స్కూటర్ కోసం కొత్తగా “నో-కాస్ట్” ఈఎంఐ వ్యవస్థను ప్రవేశపెట్టింది. కస్టమర్ క్రెడిట్ కార్డు ద్వారా ఆన్లైన్ లావాదేవీ చేస్తే మాత్రమే ఆఫర్ చెల్లుతుంది. చదవండి: ఖాతాదారులకు ఎస్బీఐ అలర్ట్! -
బాబోయ్ పెట్రోల్.. భవిష్యత్తు హైపర్ ఛార్జర్లదే
వెబ్‌డెస్క్ : పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. పైకి వెళ్లడమే తప్ప కిందికి రానంట్ను ఫ్యూయల్ ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో పెట్రోలు పోయించాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంటోంది. మరోవైపు అనేక కంపెనీలు ఎలక్ట్రికల్ వెహికల్స్ (ఈవీ)కి అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్లను అందుబాబులోకి తెస్తున్నాయి. ఈవీ ఛార్జింగ్ పాయింట్లు పెట్రోల్ బంకులకు ప్రత్యామ్నయం కానున్నాయా? ఛార్జింగ్ సమస్య పెట్రోమంటతో ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్యులు పెట్రోల్ బండ్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ)కి మారుదామంటే, వాటి ఛార్జింగ్ అంశం సమస్యగా మారింది. ఈవీ వెహికల్స్‌కి ప్రభుత్వం నుంచి పన్ను రాయితీ, ఇతర ప్రోత్సహకాలు లభిస్తున్నా ఛార్జింగ్ అనేదే ప్రధాన సమస్యగా మారింది. ఇప్పుడీ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆటోమొబైల్ సంస్థలే స్వయంగా ముందుకు వస్తున్నాయి. టీవీఎస్ ఎంఓయూ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం సంస్థ టీవీఎస్ కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. ఎంపిక చేసిన నగరాల్లో సొంతంగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం చేసుకుంది ఈ మేరకు 2020 మార్చి నాటికి దేశంలోని 20 నగరాల్లో ఈవీ వెహికల్స్ ఛార్జింగ్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ పేరుతో 2020లోనే ఈవీ వెహికల్ని టీవీఎస్ మార్కెట్లోకి తెచ్చింది. అయితే ఛార్జింగ్ నెట్వర్క్ సమస్య కారణంగా కేవలం ఢిల్లీ, బెంగళూరు నగరాలకే పరిమితమైంది. ఓలా టార్గెట్ లక్ష ఛార్జింగ్ పాయింట్లు క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఓలా సైతం హైపర్ ఛార్జింగ్ స్టేషన్లపై దృష్టి పెట్టింది. భారీ ఎత్తున ఓలా స్కూటర్లను ఈ కంపెనీ తయారు చేస్తోంది. దీంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాబోయే రోజుల్లో 400 నగరాల్లో లక్షలకు పైగా హైపర్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌లను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇళ్లు, పబ్లిక్ ప్లేసేస్‌తో పాటు ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో ఈ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి. తొలి విడతలో వంద నగరాల్లో ఐదు వేల ఛార్జింగ్ పాయింట్లు నిర్మిస్తామని ప్రకటించింది. మరోవైపు ఛార్జింగ్ సమస్య పరిష్కారానికి హీరో సంస్థ ఏకంగా రూ. 10,000 కోట్ల రూపాయలను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ఖర్చు చేస్తోంది. అంతేకాకుండా బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీపై తైవాన్‌కి చెందిన గోగోరో సంస్థతో ఒప్పందం కూడా చేసుకుంది చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు చదవండి:Petrol, diesel prices: పెట్రో బాంబు, రికార్డు ధర -
బైక్ కొనేవారికి భారీ షాక్ ఇచ్చిన కంపెనీలు
న్యూఢిల్లీ: బజాజ్, టీవీఎస్, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనేవారికి భారీ షాక్ ఇచ్చాయి కంపెనీలు. టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్ దేశంలో తమ మోటార్‌సైకిళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. టీవీఎస్ తన ఫ్లాగ్షిప్ బ్రాండ్ అపాచీ ధరలను పెంచగా, బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్ వారి మొత్తం మోటార్‌సైకిల్ శ్రేణి ధరలను పెంచాయి. ఈ కొత్త ధరలు జనవరి 2021 నుంచి తయారు చేయబడిన, విక్రయించే బైక్‌లు, స్కూటర్లపై పెంపు ధరలు వర్తిస్తాయని పేర్కొంది. టీవీఎస్ సంస్థ తన ప్రధాన మోటారుసైకిల్ అపాచీ ఆర్ఆర్ 310 ధరలను రూ.3 వేలకు పెంచింది. ఈ మోటారుసైకిల్ ఇప్పుడు 2.48 లక్షల రూపాయల ధర వద్ద లభిస్తుంది.(చదవండి: బీఎండబ్ల్యూ కొత్త కారు అదిరిందిగా) మరోవైపు, అపాచీ ఆర్టీఆర్ 200 4వీ ధరను రూ.2,000 పెరిగి 1.33 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ముంబై) లభిస్తుంది. అపాచీ ఆర్టీఆర్ 160 4వీ ధర రూ.1,770, ఆర్టీఆర్ 180, ఆర్టీఆర్ 160 ధరలు వరుసగా రూ.1770, రూ.1520 పెరిగాయి. బజాజ్ సంస్థ తన అవెంజర్ క్రూయిజర్ 220 ధరలను 3,521 రూపాయలు పెంచింది, ఇప్పుడు దీని ధర రూ .1.24 లక్షలు. మరోవైపు, డొమినార్ 400, డొమినార్ 250 ధరలను వరుసగా 3,480 మరియు 3,500 రూపాయలు వరకు పెంచారు. పల్సర్ 220ఎఫ్ ధరను రూ.3,500 పెంచడంతో అది రూ.1.25 లక్షలకు చేరుకుంది. ఎన్ఎస్160, ఎన్ఎస్ 200 ధరలను వరుసగా రూ.3,000, రూ.3,500 పెంచినట్లు కంపెనీ ప్రకటించింది. రాయల్ ఎన్ఫీల్డ్ తన ఆర్ఈ క్లాసిక్ 350 ధరలను సుమారు రూ.2,000 పెంచారు. ఈ శ్రేణి ఇప్పుడు రూ.1.63 లక్షలు నుంచి రూ.1.85 లక్షల ధరలలో లభిస్తుంది. బుల్లెట్ సిరీస్ ధరలు కూడా పెరగడంతో అవి ఇప్పుడు రూ.1.27 లక్షల నుంచి 1.43 లక్షల ధరలలో లభిస్తున్నాయి. క్లాసిక్, బుల్లెట్ బైక్స్ వంటి బైక్స్ ధర రూ.2 వేల వరకు పైకి చేరింది. అదే మెటిరో 350 ధర మాత్రం రూ.3 వేలు పెరిగింది. దీంతో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కొనే వారికి ఝలక్ తగిలిందని చెప్పుకోవచ్చు. -
టీవీఎస్ మోటార్ కంపెనీ రెండో డివిడెండ్
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ తన వాటాదారులకు రెండో మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేర్‌కు రూ.1.40 చొప్పున(140 శాతం) రెండో మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. ఈ నెల 18నాటికి తమ షేర్లను హోల్డ్ చేస్తున్న వాటాదారులకు ఈ నెల 20లోపు ఈ డివిడెండ్‌ను చెల్లిస్తామని టీవీఎస్ మోటార్ కంపెనీ తెలిపింది. మొత్తం 47.5 కోట్ల షేర్లకు రూ.80 కోట్లు చెల్లించనున్నామని పేర్కొంది. గత నెలలోనే ఈ కంపెనీ ఒక్కో షేర్‌కు రూ.2.10 డివిడెండ్‌ను ప్రకటించింది. -
కొత్త జూపిటర్.. మైలేజీ సూపర్
సాక్షి, న్యూఢిల్లీ: బీఎస్ -6 బైక్స్ మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థలతో పాటు, తాజాగా టీవీఎస్ మోటార్ కంపెనీ బీఎస్-6 ప్రమాణాలతో కూడిన కొత్త జూపిటర్ క్లాసిక్ ఈటీ-ఎఫ్ఐ మోడల్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఆర్టీ-ఎఫ్ఐ (రేస్ ట్యూన్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్), ఈటీ-ఎఫ్ఐ (ఎకోథ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్) టెక్నాలజీ అనే రెండు వెర్షన్లను డెవలప్ చేసినప్పటికీ, ప్రస్తుతం ఈటీ-ఎఫ్ఐ టెక్నాలజీని పరిచయం చేసింది. ఈ స్కూటర్ ఎక్స్‌షోరూం ధరను రూ. 67,911గా కంపెనీ నిర్ణయించింది. ఏప్రిల్ 1, 2020 నుంచి అమలులోకి రానున్న బీఎస్-6 ప్రమాణాలను అందుకోవడంలో భాగంగా దీన్ని బుధవారం లాంచ్ చేసింది. బీఎస్-6 కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఈటీ-ఎఫ్ఐ టెక్నాలజీ మెరుగైన పనితీరు, అధిక మైలేజీ ఇస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త జూపిటర్ క్లాసిక్ 15 శాతం అధిక మైలేజీని ఇస్తుందని పేర్కొంది. జూపిటర్ క్లాసిక్‌లో 110 సీసీ బీఎస్-6 ఇంజిన్‌తోపాటు ఫ్రంట్ ప్యానెల్లో మొబైల్ కోసం ప్లేస్, యుఎస్బీ ఛార్జర్, టిన్టెడ్ విండ్‌స్ర్కీన్ వంటి ఫీచర్లను జోడించారు. ఇది 7500 ఆర్పీఎం వద్ద 7.9 బీహెచ్పీ శక్తిని, 5500 ఆర్పీఎం వద్ద 8ఎన్ఎం టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ‘ఈటీ-ఎఫ్ఐ టెక్నాలజీని భారత వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేశాం. జూపిటర్ క్లాసిక్ ఈటీ-ఎఫ్ఐ అధిక మైలేజీతో పాటు సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంద’ని టీవీఎస్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అనిరుధ్ హల్దార్ తెలిపారు. -
1 శాతం తగ్గిన టీవీఎస్ మోటార్ లాభం
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో 1 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.216 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.211 కోట్లకు తగ్గిందని టీవీఎస్ మోటార్ కంపెనీ తెలిపింది.మొత్తం ఆదాయం రూ.4,098 కోట్ల నుంచి రూ.4,994 కోట్లకు పెరిగిందని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ కె.ఎన్.రాధాకృష్ణన్ చెప్పారు. ఈ క్యూ2లో ఎగుమతులతో సహా మొత్తం అమ్మకాలు 14 శాతం వృద్ధితో 10.49 లక్షలకు పెరిగాయని వివరించారు. ఒక్కో షేర్‌కు రూ.2.10 డివిడెండ్ (210 శాతం) ఇవ్వనున్నామని తెలిపారు. మొత్తం డివిడెండ్ చెల్లింపులు రూ.120 కోట్లుగా ఉంటాయని పేర్కొన్నారు. 18 శాతం పెరిగిన ఎబిటా ఎబిటా 18 శాతం వృద్ధితో రూ.428 కోట్లకు పెరిగిందని రాధాకృష్ణన్ తెలిపారు. అయితే నిర్వహణ మార్జిన్ 8.6 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉత్పత్తులు, టెక్నాలజీల కోసం రూ.800 కోట్లు మూలధన పెట్టుబడులు పెట్టనున్నామని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం మూలధన పెట్టుబడులు (రూ.450 కోట్లు)తో పోల్చితే ఇది 78 శాతం అధికమని తెలిపారు. బీమా గందరగోళం... మోటార్ సైకిళ్ల అమ్మకాలు 4 శాతం వృద్ధితో 4.20 లక్షలకు, స్కూటర్ల అమ్మకాలు 18 శాతం వృద్ధితో 3.88 లక్షలకు పెరిగాయని రాధాకృష్ణన్ తెలిపారు. మొత్తం ఎగుమతులు 35 శాతం ఎగసి 1.48 లక్షలకు చేరాయని పేర్కొన్నారు. థర్డ్ పార్టీ బీమా ప్రీమియమ్ విషయమై వినియోగదారుల్లో గందరగోళం నెలకొందని తెలిపారు. ఎంట్రీ లెవల్ బైక్‌ల విషయంలో బీమా వ్యయాలు బైక్ ధరల్లో 10 శాతంగా ఉన్నాయని, అందుకే చాలా మంది వినియోగదారులు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారని వివరించారు. దీపావళి పండగ కారణంగా అమ్మకాలు పెరగవచ్చని ఆయన అంచనా వేశారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టీవీఎస్ మోటార్ షేర్ 3.7 శాతం లాభంతో రూ.536 వద్ద ముగిసింది. -
టీవీఎస్ నుంచి స్టార్ సిటీ ప్లస్
న్యూఢిల్లీ: పండుగల సీజన్ నేపథ్యంలో వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ సోమవారం టీవీఎస్ స్టార్ సిటీప్లస్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 52,907 (ఢిల్లీ ఎక్స్‌షోరూం)గా ఉంటుందని వెల్లడించింది. 110 సీసీ సామర్ధ్యం గల ఈ మోటార్‌సైకిల్‌లో.. ముందు, వెనుక చక్రాలను ఏకకాలంలో మరింత సమర్ధమంతంగా ఆపగలిగే సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ (ఎస్బీటీ) ఉందని కంపెనీ తెలిపింది. దీనివల్ల బైక్ స్కిడ్ కాకుండా..వాహనదారుకు మరింత భద్రత ఉంటుందని, ఈ సెగ్మెంట్లో ఇలాంటి టెక్నాలజీ అందిస్తున్న సంస్థ తమదొక్కటేనని వివరించింది. -
టీవీఎస్ మోటార్ లాభం రూ.147 కోట్లు
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ క్వార్టర్లో రూ.147 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో సాధించిన నికర లాభం(రూ.130 కోట్లు)తో పోల్చితే 13 శాతం వృద్ధి సాధించామని టీవీఎస్ మోటార్ తెలిపింది. వివిధ విభాగాల అమ్మకాలు జోరుగా ఉండటంతో ఈ స్థాయిలో నికర లాభం పెరిగిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.3,457 కోట్ల నుంచి రూ.4,171 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నిర్వహణ లాభం 45 శాతం వృద్ధితో రూ.306 కోట్లకు, నిర్వహణ లాభ మార్జిన్ 1.2 శాతం పెరిగి 7.4 శాతానికి చేరాయని తెలిపింది. ఎగుమతులు 52 శాతం అప్... గత క్యూ1లో 7.85 లక్షలుగా ఉన్న మొత్తం టూవీలర్ల అమ్మకాలు ఈ క్యూ1లో 14 శాతం వృద్ధితో 8.93 లక్షలకు పెరిగాయని టీవీఎస్ మోటార్ తెలిపింది. బైక్‌ల అమ్మకాలు 17 శాతం, స్కూటర్ల అమ్మకాలు 12 శాతం పెరిగాయని పేర్కొంది. మొత్తం ఎగుమతులు 52 శాతం వృద్ధి చెందాయని తెలిపింది. ఈ కంపెనీ స్కూటీ, జూపిటర్ బ్రాండ్ల స్కూటర్లను, అపాచీ, స్టార్ బ్రాండ్ మోటార్‌బైక్‌లను విక్రయిస్తోంది. నికర లాభం 13 శాతం పెరగడంతో బీఎస్ఈలో ఈ షేర్ లాభపడింది. ఇంట్రాడేలో 6 శాతం లాభంతో రూ.560కు ఎగసిన ఈ షేర్ చివరకు 4 శాతం లాభంతో రూ.549 వద్ద ముగిసింది. -
టీవీఎస్‌కు డిస్కౌంట్ల భారం
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.127 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.136 కోట్లతో పోలిస్తే 7 శాతం తగ్గిందని టీవీఎస్ మోటార్ కంపెనీ తెలిపింది. బీఎస్–త్రీ వాహన విక్రయాల కోసం డీలర్లకు రూ.57 కోట్ల మేర డిస్కౌంట్లను ఇవ్వడం వల్ల నికర లాభం తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.3,091 కోట్ల నుంచి రూ.3,139 కోట్లకు పెరిగింది. మొటార్ సైకిళ్ల అమ్మకాలు 2.47 లక్షల నుంచి 13 శాతం క్షీణించి 2.15 లక్షలకు తగ్గగా... స్కూటర్ల అమ్మకాలు మాత్రం 1.98 లక్షల నుంచి 2.23 లక్షలకు పెరిగాయి. త్రీ వీలర్ల అమ్మకాలు 21 వేల నుంచి 15 వేలకు పడిపోయాయి. త్వరలో కొత్త మోటార్‌సైకిల్‌ను, కొత్త స్కూటర్‌ను మార్కెట్లోకి తేనున్నామని కంపెనీ తెలియజేసింది. గతేడాది రూ.558 కోట్ల నికర లాభం: ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.489 కోట్లుగా ఉన్న నికర లాభం 2016–17 ఆర్థిక సంవత్సరంలో 14 శాతం వృద్ధితో రూ.558 కోట్లకు పెరిగింది. -
టీవీఎస్ లాభం 30 శాతం అప్
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 30 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2014-16) క్యూ4లో రూ.91 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.118 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. నికర అమ్మకాలు రూ.2,395 కోట్ల నుంచి 16 శాతం వృద్ధితో రూ.2,776 కోట్లకు పెరిగాయని పేర్కొంది. బైక్‌ల విక్రయాలు 2.21 లక్షల నుంచి 12 శాతం వృద్ధితో 2.47 లక్షలకు, స్కూటర్ల అమ్మకాలు1.66 లక్షల నుంచి 1.98 లక్షలకు, త్రీ వీలర్ల అమ్మకాలు 21,445 నుంచి 26,901కు పెరిగాయని తెలిపింది. అమ్మకాలు 13 శాతం అప్... ఇక పూర్తి ఆర్థిక సంవత్సర పరంగా చూస్తే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.328 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 13 శాతం వృద్ధితో రూ.369 కోట్లకు. నికర అమ్మకాలు రూ.10,075 కోట్ల నుంచి 13% వృద్ధితో రూ.11,377 కోట్లకు పెరిగాయని పేర్కొంది. టూ వీలర్ల అమ్మకాలు 24.09 లక్షల నుంచి 7 శాతం వృద్ధితో 25.68 లక్షలకు పెరిగాయని వివరించింది. వీటిల్లో మోటార్ సైకిళ్ల అమ్మకాలు 9.51 లక్షల నుంచి 10.71 లక్షలకు, స్కూటర్ల అమ్మకాలు 7 లక్షల నుంచి 8.13 లక్షలకు, త్రీ వీలర్ల అమ్మకాలు 1.08 లక్షల నుంచి 1.11 లక్షలకు పెరిగాయని పేర్కొంది. కంపెనీ షేర్ మంగళవారం బీఎస్ఈలో 10% నష్టపోయి రూ.288 వద్ద ముగిసింది. -
ఈ ఏడాదే మార్కెట్లోకి టీవీఎస్ ‘అకూల 310’
♦ 2016-17లో 12 శాతం వృద్ధి లక్ష్యం ♦ కంపెనీ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగంలో ఉన్న టీవీఎస్ మోటార్ కం పెనీ స్పోర్ట్స్ బైక్‌ల విభాగంలో వేగం పెంచింది. ఇటీవలే అపాచీ ఆర్టీఆర్ 200 మోడల్‌ను ఆవిష్కరించిన ఈ సంస్థ అకూల 310 పేరుతో మరో స్పోర్ట్స్ బైక్‌ను తేబోతోంది. బీఎండబ్ల్యు గ్రూప్ కంపెనీ అయిన బీఎండబ్ల్యూ మోటారాడ్తో కలసి టీవీఎస్ దీనిని అభివృద్ధి చేసింది. ఈ ఏడాది చివరికల్లా భారతీయ రోడ్లపై అకూల దూసుకెళ్లనుందని టీవీఎస్ మోటార్ సేల్స్, సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ జేఎస్ శ్రీనివాసన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. హైదరాబాద్ మార్కెట్లో కొత్త టీవీఎస్ విక్టర్‌ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విక్టర్ బైక్‌లు నెలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 1,500, దేశవ్యాప్తంగా 15 వేల యూనిట్ల అమ్మకాలను లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు. పరిశ్రమ కంటే రెండింతలు.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహన పరిశ్రమ వృద్ధి రేటు 6 శాతం ఉండొచ్చని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. ఇదే జరిగితే టీవీఎస్ 12 శాతం వృద్ధి నమోదు ఖాయమని అన్నారు. విక్టర్, ఎక్స్ఎల్ 100 మోడళ్లు కంపెనీ వృద్ధిని నడిపిస్తాయని చెప్పారు. భారత స్కూటర్ల మార్కెట్లో 15 శాతం, మోటార్ సైకిళ్ల విపణిలో 14 శాతం వాటాను టీవీఎస్ కైవసం చేసుకుంది. విక్టర్ రాకతో ఎగ్జిక్యూటివ్ క్లాస్ మోటార్‌బైక్స్ విభాగంలో కంపెనీ వాటా 2 శాతం అధికమవుతుందని ఆయన పేర్కొన్నారు. 2002 నుంచి విజయవంతంగా ఈ బైక్ అమ్ముడవుతోందని వివరించారు. ఎక్స్ఎల్ 100 మోపెడ్స్ నెలకు దేశవ్యాప్తంగా 64,000 యూనిట్లు విక్రయమవుతున్నాయి. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో విక్టర్ ధర వేరియంట్‌నుబట్టి రూ.51,900 నుంచి ప్రారంభం. -
తెలుగు రాష్ట్రాల్లో టీవీఎస్ ఎక్స్ఎల్ 100
మోపెడ్ ధర రూ.30,074 చెన్నై: టీవీఎస్ మోటార్ కంపెనీ ఫోర్ స్ట్రోక్ టీవీఎస్ ఎక్స్ఎల్ 100 మోపెడ్‌ను తెలుగు రాష్ట్రాల్లో గురువారం విడుదల చేసింది. ఈ మోపెడ్ ధర రూ.30,074(ఎక్స్ షోరూమ్, ఆంధ్రప్రదేశ్) అని టీవీఎస్ మోటార్ కంపెనీ తెలిపింది. 99.7 సీసీ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్‌తో రూపొందించిన ఈ మోపెడ్ 4.2 పీఎస్ పవర్‌ను ఇస్తుందని, 67 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని టీవీఎస్ మోటార్ వైస్-ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ సర్వీస్) జె.ఎస్. శ్రీనివాసన్ చెప్పారు. ఈ మోపెడ్ ఆకుపచ్చ, నలుపు, ఎరుపు, నీలం, గ్రే-ఐదు రంగుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని తమ డీలర్ల వద్ద లభ్యమవుతుందని పేర్కొన్నారు. వినియోగదారుల అభిరుచులకనుగుణంగా అత్యున్నత నాణ్యత గల వాహనాలను అందిస్తున్నామని వివరించారు. టీవీఎస్ ఎక్స్ఎల్ సూపర్ హెవీ డ్యూటీ మోడల్‌ను కూడా విక్రయిస్తున్నామని తెలిపారు. -
టీవీఎస్ మోటార్ స్పీడ్...
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ నికర లాభం(స్టాండ్ఎలోన్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 23 శాతం వృద్ధి సాధించింది. గత క్యూ2లో రూ.95 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.116 కోట్లకు పెరిగిందని టీవీఎస్ మోటార్ కంపెనీ తెలిపింది. నికర అమ్మకాలు రూ.2,667 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.2,881 కోట్లకు పెరిగాయని పేర్కొంది. మొత్తం వాహన విక్రయాలు 6,76,139 నుంచి 0.3 శాతం వృద్ధితో 6,78,718కు పెరిగాయని, అయితే మొత్తం ద్విచక్ర వాహన విక్రయాలు మాత్రం 6.48 లక్షల నుంచి 0.3 శాతం క్షీణతతో 6.46 లక్షలకు తగ్గాయని తెలిపింది. స్కూటర్ల అమ్మకాలు 1.9 లక్షల నుంచి 12 శాతం వృద్దితో 2.18 లక్షలకు పెరగ్గా, మోటార్ సైకిళ్ల విక్రయాలు స్వల్ప వృద్ధితో 2.55 లక్షలకు చేరాయని వివరించింది. ఎగుమతులు 1.03 లక్షల నుంచి 23 శాతం వృద్ధితో 1.27 లక్షలకు చేరాయని పేర్కొంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలానికి నికర లాభం (స్టాండ్ఎలోన్) రూ.167 కోట్ల నుంచి 24 శాతం వృద్ధితో రూ.207 కోట్లకు చేరిందని, మొత్తం ఆదాయం రూ.4,960 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.5,489 కోట్లకు పెరిగిందని వివరించింది. మొత్తం టూవీలర్ల విక్రయాలు 12,60,252 నుంచి 4 శాతం వృద్ధితో 13,16,751కు పెరిగాయని పేర్కొంది. పండుగల సీజన్ శుభారంభాన్ని ఇచ్చిందని, ఈ పండుగల సీజన్లో మంచి అమ్మకాలు సాధిస్తామన్న ఆశాభావాన్ని కంపెనీ వ్యక్తం చేసింది. కాగా ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టీవీఎస్ మోటార్ కంపెనీ షేర్ 13 శాతం వృద్ధితో రూ.276 వద్ద ముగిసింది. -
టీవీఎస్ మోటార్ లాభం 25 శాతం అప్
అమ్మకాల జోరే కారణం చెన్నై: టీవీఎస్ మోటార్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి 25 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు రూ.72 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ.90 కోట్లకు వృద్ధి చెందిందని కంపెనీ తెలిపింది. అమ్మకాలు జోరుగా ఉండడమే నికర లాభం వృద్ధికి కారణమని పేర్కొంది. నికర అమ్మకాలు రూ.2,263 కోట్ల నుంచి రూ.2,591 కోట్లకు పెరిగాయని వివరించింది. మొత్తం టూ-వీలర్ల అమ్మకాలు 5.59 లక్షల నుంచి 9 శాతం వృద్ధితో 6.08 లక్షలకు పెరిగాయని తెలిపింది. వీటిల్లో మోటార్ సైకిళ్ల అమ్మకాలు 2.28 లక్షల నుంచి 12 శాతం వృద్ధితో 2.55 లక్షలకు, స్కూటర్ల విక్రయాలు 1.52 లక్షల నుంచి 9 శాతం వృద్ధితో 1.65 లక్షలకు పెరిగాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్ బీఎస్ఈలో 4.5 శాతం క్షీణించి రూ.251 వద్ద ముగిసింది. -
టీవీఎస్ ఎక్సెల్ సూపర్ మోపెడ్ అమ్మకాలు @ కోటి
చెన్నై: టీవీఎస్ మోటార్ సంస్థ ఎక్సెల్ సూపర్ మోడల్లో స్పెషల్ ఎడిషన్‌ను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. 1980లో మార్కెట్లోకి తెచ్చిన ఎక్సెల్ సూపర్ మోపెడ్ కోటి అమ్మకాల మైలురాయిని సాధించిన సందర్భంగా ఈ స్పెషల్ ఎడిషన్‌ను అందిస్తున్నామని టీవీఎస్ మోటార్ ప్రెసిడెంట్, సీఈఓ కె.ఎన్.రాధాకృష్ణన్ చెప్పారు. అప్పటి చైర్మన్ దివంగత టి.ఎస్.శ్రీనివాసన్, ఇప్పటి చైర్మన్ వేణు శ్రీనివాసన్‌ల ఆలోచనల ఫలితంగా ఎక్సెల్ సూపర్ మోడల్ మోపెడ్ ఆవిర్భవించిందని వివరించారు. కుటుంబానికి విశ్వసనీయమైన టూ వీలర్‌ను చౌక ధరలో అందించాలన్న స్వప్నం ఈ మోపెడ్‌తో సాకారమైందని ఆయన పేర్కొన్నారు. -
టీవీఎస్ ఫీనిక్స్‌లో కొత్త వేరియంట్
ధర రూ. 51,999 -67 కి.మీ.మైలేజీ చెన్నై: టీవీఎస్ మోటార్ కంపెనీ 125 సీసీ ఫీనిక్స్ మోడల్లో కొత్త వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర రూ. 51,990 (ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ)అని టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ కె.ఎన్. రాధాకృష్ణన్ చెప్పారు. 67 కిమీ. మైలేజీనిస్తుందని వివరించారు. ఈకో థ్రస్ట్ ఇంజన్‌తో రూపొందించిన ఈ బైక్‌లో ప్రీమియం 3డీ లోగో, పూర్తి స్థాయి డిజిటల్ స్పీడోమీటర్, బ్యాటరీ తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు అప్రమత్తం చేసే లో బ్యాటరీ ఇండికేటర్ వంటి ఫీచర్లున్నాయి. పార్కింగ్‌లో బైక్ ఎక్కడుందో సులువుగా తెలుసుకునే వెహికల్ లొకేషన్ అసిస్ట్ వంటి ఫీచర్ కూడా ఉందని వివరించారు. ఆరు రంగుల్లో ఈ బైక్ లభ్యమవుతుందని పేర్కొన్నారు. టీవీఎస్ ఫీనిక్స్ను మొదటగా 2012, సెప్టెంబర్‌లో విడుదల చేశామని, వినూత్నమైన ఫీచర్లతో ఇప్పుడు తాజా వేరియంట్‌ను అందిస్తున్నామని పేర్కొన్నారు. -
మళ్లీ మార్కెట్లోకి టీవీఎస్ విక్టర్!
చెన్నై : టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ ఏడాది రెండు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తేనున్నది. భారత్‌లో తన మార్కెట్‌ను మరింతగా పటిష్టం చేసుకునే చర్యల్లో భాగంగా టీవీఎస్ విక్టర్ మోటార్‌సైకిల్‌ను మళ్లీ మార్కెట్లోకి తేనున్నది. దీంతో పాటు ఒక ప్రీమియం బైక్‌ను కూడా ఈ ఏడాదిలోనే అందిస్తామని వివరించింది. గత కొన్నేళ్లుగా టీవీఎస్ విక్టర్ మోటార్ బైక్‌ల ఉత్పత్తిని కంపెనీ నిలిపేసింది. విక్టర్ బైక్‌ను మళ్లీ మార్కెట్లోకి తేవాలనుకుంటున్నామని టీవీఎస్ మోటార్ సీఎండీ వేణు శ్రీనివాసన్ గత ఏడాదే చెప్పారు. ఇక బీఎండబ్ల్యూ మోటరాడ్ భాగస్వామ్యంతో అధిక ఇంజిన్ సామర్థ్యం ఉన్న ప్రీమియం బైక్‌ను ఈ ఏడాది ఈ కంపెనీ అందించనున్నది. 500 సీసీ లోపు ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్‌ల తయారీకి టీవీఎస్.. బీఎండబ్ల్యూ మోటరాడ్తో ఒప్పందం కుదుర్చుకుంది. -
ఏడాదిలో మరో 3 టీవీఎస్ వాహనాలు !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి మరో 3 టీవీఎస్ వాహనాలు విపణిలోకి రానున్నాయి. 2 నెలల్లో దేశీయ మార్కెట్లోకి ‘జెస్ట్ స్కూటీ’ను విడుదల చేయనున్నట్లు టీవీఎస్ మోటార్ కంపెనీ (సేల్స్) వైస్ ప్రెసిడెంట్ జె.ఎస్. శ్రీనివాసన్ చెప్పారు. మంగళవారమిక్కడ ‘స్టార్ సిటీ ప్లస్’ను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఏమన్నారంటే... ఏపీలో నెలకు లక్ష వాహనాలు..: నెలకు దేశ వ్యాప్తంగా 14 లక్షల ద్విచక్ర వాహనాలు అమ్ముడవుతుండగా.. ఇందులో టీవీఎస్ మోటార్ కంపెనీ వాటా 30 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా గతేడాది నెలకు 1.48 లక్షల టీవీఎస్ వాహనాలను విక్రయించగా.. ఈ ఏడాది 1.85 లక్షల బైకులను విక్రయిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో 17% మార్కెట్ వాటాతో నెలకు లక్ష వరకు టీవీఎస్ ద్విచక్ర వాహనాలు అమ్ముడవుతున్నాయి. 120 సీసీ లోపు ఉన్న టీవీఎస్ వాహనాలు నెలకు 35 వేలు అమ్ముడవుతుండగా.. 2 నెలల్లో వీటి సంఖ్యను 45 వేల యూనిట్లకు చేర్చుతాం. అంటే రెండు నెలల్లో 10 వేల స్టార్‌సిటీ ప్లస్ బైకులను విక్రయిండమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నమాట. 16% వృద్ధికి వాహన పరిశ్రమ..: దేశవ్యాప్తంగా ఏటా వాహనాల పరిశ్రమ 8% వృద్ధిని కనబరుస్తోంది. అటు కేంద్రంలో, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాల రాక తో ఈ ఏడాది చివరి వరకు రెట్టింపు వృద్ధిని సాధిస్తుందని ఆశిస్తున్నాం. అంటే 16% వృద్ధికి చేరుకుంటుంది. ‘స్టార్ సిటీ ప్లస్’ గురించి క్లుప్తంగా.. ఆల్ న్యూ స్టార్‌సిటీ ప్లస్ వాహనాలు నలుపు, నీలం, స్కార్లెట్ 3 రంగుల్లో లభ్యమవుతున్నాయి. 110 సీసీ అడ్వాన్స్ ఏకోత్రస్ట్ ఇంజిన్‌ను అమర్చాం. మైలేజీ.. లీటరుకు 86 కి.మీ. దీని ధర రూ.42 వేల నుంచి ప్రారంభమవుతుంది.