కొత్త జూపిటర్‌.. మైలేజీ సూపర్‌ | TVS Motor launches new BS-VI TVS Jupiter | Sakshi
Sakshi News home page

‘జ్యాదా కా ఫాయిదా' కొత్త టీవీఎస్‌ స్కూటర్‌

Published Wed, Nov 27 2019 8:18 PM | Last Updated on Wed, Nov 27 2019 8:48 PM

TVS Motor launches new BS-VI TVS Jupiter - Sakshi

సాక్షి,  న్యూఢిల్లీ:  బీఎస్‌ -6  బైక్స్‌  మార్కెట్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థలతో పాటు, తాజాగా టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ బీఎస్-6 ప్రమాణాలతో కూడిన కొత్త జూపిటర్‌ క్లాసిక్‌ ఈటీ-ఎఫ్‌ఐ మోడల్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఆర్‌టీ-ఎఫ్‌ఐ (రేస్ ట్యూన్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్), ఈటీ-ఎఫ్‌ఐ (ఎకోథ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్) టెక్నాలజీ అనే రెండు వెర్షన్లను డెవలప్‌ చేసినప్పటికీ, ప్రస్తుతం  ఈటీ-ఎఫ్‌ఐ టెక్నాలజీని పరిచయం చేసింది. ఈ స్కూటర్‌ ఎక్స్‌షోరూం ధరను రూ. 67,911గా కంపెనీ నిర్ణయించింది. ఏప్రిల్‌ 1, 2020 నుంచి అమలులోకి రానున్న బీఎస్‌-6 ప్రమాణాలను అందుకోవడంలో భాగంగా దీన్ని బుధవారం లాంచ్‌ చేసింది. 

బీఎస్‌-6 కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఈటీ-ఎఫ్‌ఐ టెక్నాలజీ మెరుగైన పనితీరు, అధిక మైలేజీ ఇస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త జూపిటర్‌ క్లాసిక్‌ 15 శాతం అధిక మైలేజీని ఇస్తుందని పేర్కొంది. జూపిటర్ క్లాసిక్‌లో 110 సీసీ బీఎస్‌-6 ఇంజిన్‌తోపాటు ఫ్రంట్ ప్యానెల్‌లో మొబైల్‌  కోసం ప్లేస్‌, యుఎస్‌బీ ఛార్జర్‌, టిన్‌టెడ్‌ విండ్‌స్ర్కీన్‌ వంటి ఫీచర్లను జోడించారు. ఇది 7500 ఆర్‌పీఎం వద్ద 7.9 బీహెచ్‌పీ శక్తిని, 5500 ఆర్‌పీఎం వద్ద 8ఎన్‌ఎం టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ‘ఈటీ-ఎఫ్‌ఐ టెక్నాలజీని భారత వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేశాం. జూపిటర్ క్లాసిక్‌ ఈటీ-ఎఫ్‌ఐ అధిక మైలేజీతో పాటు సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంద’ని టీవీఎస్ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్ అనిరుధ్‌ హల్దార్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement