
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తాజాగా డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా స్విగ్గీ ఫుడ్ డెలివరీ సేవలకు టీవీఎస్ తయారీ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తారు.
ఇరు కంపెనీలు స్విగ్గీ డెలివరీ భాగస్వాముల కోసం స్థిరమైన, సమగ్ర పరిష్కారాలను అన్వేషిస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా 2025 నాటికి రోజూ 8,00,000 కిలోమీటర్ల మేర డెలివరీలను చేపట్టాలన్నది స్విగ్గీ లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment