టీవీఎస్ మోటార్ లాభం 25 శాతం అప్ | TVS Motor profit up 25 percent | Sakshi
Sakshi News home page

టీవీఎస్ మోటార్ లాభం 25 శాతం అప్

Published Sat, Jul 25 2015 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM

టీవీఎస్ మోటార్ లాభం  25 శాతం అప్

టీవీఎస్ మోటార్ లాభం 25 శాతం అప్

 అమ్మకాల జోరే కారణం

 చెన్నై: టీవీఎస్ మోటార్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి 25 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం  ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు రూ.72 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ.90 కోట్లకు వృద్ధి చెందిందని కంపెనీ తెలిపింది. అమ్మకాలు జోరుగా ఉండడమే నికర లాభం వృద్ధికి కారణమని పేర్కొంది. నికర అమ్మకాలు రూ.2,263 కోట్ల నుంచి రూ.2,591 కోట్లకు పెరిగాయని వివరించింది.

మొత్తం టూ-వీలర్ల అమ్మకాలు 5.59 లక్షల నుంచి 9 శాతం వృద్ధితో 6.08 లక్షలకు పెరిగాయని తెలిపింది. వీటిల్లో మోటార్ సైకిళ్ల అమ్మకాలు 2.28 లక్షల నుంచి 12 శాతం వృద్ధితో 2.55 లక్షలకు, స్కూటర్ల విక్రయాలు 1.52 లక్షల నుంచి 9 శాతం వృద్ధితో 1.65 లక్షలకు పెరిగాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్ బీఎస్‌ఈలో 4.5 శాతం క్షీణించి రూ.251 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement