మళ్లీ మార్కెట్లోకి టీవీఎస్ విక్టర్!
చెన్నై : టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ ఏడాది రెండు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తేనున్నది. భారత్‌లో తన మార్కెట్‌ను మరింతగా పటిష్టం చేసుకునే చర్యల్లో భాగంగా టీవీఎస్ విక్టర్ మోటార్‌సైకిల్‌ను మళ్లీ మార్కెట్లోకి తేనున్నది. దీంతో పాటు ఒక ప్రీమియం బైక్‌ను కూడా ఈ ఏడాదిలోనే అందిస్తామని వివరించింది. గత కొన్నేళ్లుగా టీవీఎస్ విక్టర్ మోటార్ బైక్‌ల ఉత్పత్తిని కంపెనీ నిలిపేసింది.
విక్టర్ బైక్‌ను మళ్లీ మార్కెట్లోకి తేవాలనుకుంటున్నామని టీవీఎస్ మోటార్ సీఎండీ వేణు శ్రీనివాసన్ గత ఏడాదే చెప్పారు. ఇక బీఎండబ్ల్యూ మోటరాడ్ భాగస్వామ్యంతో అధిక ఇంజిన్ సామర్థ్యం ఉన్న ప్రీమియం బైక్‌ను ఈ ఏడాది ఈ కంపెనీ అందించనున్నది. 500 సీసీ లోపు ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్‌ల తయారీకి టీవీఎస్.. బీఎండబ్ల్యూ మోటరాడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.