ఏడాదిలో మరో 3 టీవీఎస్ వాహనాలు ! | TVS launches new bike | Sakshi
Sakshi News home page

ఏడాదిలో మరో 3 టీవీఎస్ వాహనాలు !

Published Wed, May 28 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM

ఏడాదిలో మరో 3 టీవీఎస్ వాహనాలు !

ఏడాదిలో మరో 3 టీవీఎస్ వాహనాలు !

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి మరో 3 టీవీఎస్ వాహనాలు విపణిలోకి రానున్నాయి. 2 నెలల్లో దేశీయ మార్కెట్లోకి ‘జెస్ట్ స్కూటీ’ను విడుదల చేయనున్నట్లు టీవీఎస్ మోటార్ కంపెనీ (సేల్స్) వైస్ ప్రెసిడెంట్ జె.ఎస్. శ్రీనివాసన్ చెప్పారు.

మంగళవారమిక్కడ ‘స్టార్ సిటీ ప్లస్’ను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఏమన్నారంటే...
 ఏపీలో నెలకు లక్ష వాహనాలు..: నెలకు దేశ వ్యాప్తంగా 14 లక్షల ద్విచక్ర వాహనాలు అమ్ముడవుతుండగా.. ఇందులో టీవీఎస్ మోటార్ కంపెనీ వాటా 30 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా గతేడాది నెలకు 1.48 లక్షల టీవీఎస్ వాహనాలను విక్రయించగా.. ఈ ఏడాది 1.85 లక్షల బైకులను విక్రయిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో 17% మార్కెట్ వాటాతో నెలకు లక్ష వరకు టీవీఎస్ ద్విచక్ర వాహనాలు అమ్ముడవుతున్నాయి. 120 సీసీ లోపు ఉన్న టీవీఎస్ వాహనాలు నెలకు 35 వేలు అమ్ముడవుతుండగా.. 2 నెలల్లో వీటి సంఖ్యను 45 వేల యూనిట్లకు చేర్చుతాం. అంటే రెండు నెలల్లో 10 వేల స్టార్‌సిటీ ప్లస్ బైకులను విక్రయిండమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నమాట.

 16% వృద్ధికి వాహన పరిశ్రమ..: దేశవ్యాప్తంగా ఏటా వాహనాల పరిశ్రమ 8% వృద్ధిని కనబరుస్తోంది. అటు కేంద్రంలో, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాల రాక తో ఈ ఏడాది చివరి వరకు రెట్టింపు వృద్ధిని సాధిస్తుందని ఆశిస్తున్నాం. అంటే 16% వృద్ధికి చేరుకుంటుంది.

 ‘స్టార్ సిటీ ప్లస్’ గురించి క్లుప్తంగా..
 ఆల్ న్యూ స్టార్‌సిటీ ప్లస్ వాహనాలు నలుపు, నీలం, స్కార్లెట్ 3 రంగుల్లో లభ్యమవుతున్నాయి. 110 సీసీ అడ్వాన్స్ ఏకోత్రస్ట్ ఇంజిన్‌ను అమర్చాం. మైలేజీ.. లీటరుకు 86 కి.మీ. దీని ధర రూ.42 వేల నుంచి ప్రారంభమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement