Star City Plus
-
టీవీఎస్ నుంచి స్టార్ సిటీ ప్లస్
న్యూఢిల్లీ: పండుగల సీజన్ నేపథ్యంలో వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ సోమవారం టీవీఎస్ స్టార్ సిటీప్లస్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 52,907 (ఢిల్లీ ఎక్స్‌షోరూం)గా ఉంటుందని వెల్లడించింది. 110 సీసీ సామర్ధ్యం గల ఈ మోటార్‌సైకిల్‌లో.. ముందు, వెనుక చక్రాలను ఏకకాలంలో మరింత సమర్ధమంతంగా ఆపగలిగే సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ (ఎస్బీటీ) ఉందని కంపెనీ తెలిపింది. దీనివల్ల బైక్ స్కిడ్ కాకుండా..వాహనదారుకు మరింత భద్రత ఉంటుందని, ఈ సెగ్మెంట్లో ఇలాంటి టెక్నాలజీ అందిస్తున్న సంస్థ తమదొక్కటేనని వివరించింది. -
హైదరాబాద్.. షాన్‌దార్ సిటీ
లవ్ ఆల్.. గుత్తా జ్వాల ఎంతో ఇష్టంగా తన చేతిపై వేసుకున్న టాటూ! అందరినీ ప్రేమించాలని చెప్పే ఆమెను వ్యతిరేకించేవాళ్లు కూడా చాలా మంది. అయితేనేం నేను.. నా ఇష్టం అని బిందాస్‌గా బతికేయడం జ్వాల నైజం. నడక నేర్చినప్పటి నుంచి స్టార్ క్రీడాకారిణిగా ఎదిగినప్పటి వరకు ఆమె ప్రతి మలుపునకూ హైదరాబాద్ సాక్షి. అందుకే నగరంతో జ్వాలకు ఓ ప్రత్యేక అనుబంధం. ప్రపంచంలో ఏ మూల తిరిగినా భాగ్యనగరిలో ఉండే ఆనందం ఎక్కడా దొరకదని అంటున్న జ్వాల మహానగరం గురించి ఏం చెప్పిందంటే... సిటీని చుట్టేసేదాన్ని... నాన్న మొదటి నుంచి ఆటలను ప్రోత్సహించారు. అందుకోసమే కేంద్రీయ విద్యాలయ(కేవీ)లో చేర్పించారు. అయితే వేర్వేరు కారణాలతో బొల్లారం, పికెట్, గోల్కొండ కేవీలలోనూ చదివాను. అప్పట్లో నాన్నతో కలసి హైదరాబాద్ మొత్తం చుట్టేసేదాన్ని. ఇంటి నుంచి స్కూల్ దూరంగా ఉండటం వల్ల స్కూటర్‌పైనే ప్రయాణించేదాన్ని. బేగంపేట నుంచి గోల్కొండ, ఆర్టిలరీ సెంటర్ నుంచి ఆదర్శ్‌నగర్, ఆ తర్వాత బంజారాహిల్స్.. ఇలా నగరంలో చాలా ఇళ్లు మారాం. ‘భాగ్య’నగరమే.. స్టార్ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకోవడంలో హైదరాబాద్ పాత్ర ఎంతైనా ఉంది. ఇక్కడే రాకెట్ పట్టి టెన్నిస్‌లో ఓనమాలు నేర్చుకున్నా. హైదరాబాద్ ఎంతగా విస్తరించినా.. మన నగరానికి ఆత్మలాంటి సంస్కృతి మాత్రం మారలేదు. దేశంలో ఎక్కడా లేని ప్రత్యేకతలు మన సిటీకే ఉన్నాయి. ఫుడ్ హ్యాబిట్స్ మొదలుకొని సందర్శకులకు ఇచ్చే ఆతిథ్యం వరకు చక్కటి కల్చర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇటీవల ఉబెర్ కప్ సందర్భంగా ఎక్కువ రోజులు ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది. చాలా ఇబ్బంది పడ్డా. ఎప్పుడు హైదరాబాద్ వెళ్దామా అని ఆలోచించేదాన్ని. టోర్నీల కోసం పర్యటనలే తప్ప నిజానికి నాకు ప్రయాణాలంటే పరమ చిరాకు. మన సిటీలో ఉన్నప్పుడే ఎంతో హాయిగా అనిపిస్తుంది. హార్ట్ కప్ కాఫీ హైదరాబాద్ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఫిట్నెస్ జాగ్రత్తలో భాగంగా ఎంత ఇష్టం ఉన్నా బిర్యానీని మాత్రం తక్కువగా తింటా. నగరంలో ఓవర్ ద మూన్, ఎన్ గ్రిల్ వంటి చోట్లకు బాగా వెళ్లేదాన్ని. ప్రస్తుతం నా ఫేవరేట్ స్పాట్ మాదాపూర్‌లోని ‘హార్ట్ కప్ కాఫీ’ సిటీ సిక్.. మహా నగరంలో ఇబ్బందులు కొన్ని తప్పవు. అయితే నా వైపు నుంచి ఒక్కటే ఫిర్యాదు.. ట్రాఫిక్ గురించే. గతంతో పోలిస్తే ఇదొక్కటే ఇబ్బంది పెట్టే మార్పు. వర్షాకాలంలో రోడ్లు సమస్యగా అనిపిస్తాయి. కానీ, ఇతర నగరాలతో పోలిస్తే మనం ఎంతో మెరుగు. విదేశాల్లో మెరిసిపోయే సిటీస్ ఉన్నా ఎందుకో ఏ మాత్రం నచ్చవు. టోర్నీ కోసం విదేశాలకు వెళితే నేను ఎయిర్పోర్ట్, స్టేడియం.. హోటల్‌కే పరిమితం. గాజులంటే మోజు.. హైదరాబాద్‌లో నేను తిరగని ప్రదేశం లేదు. చిన్నప్పుడే పాతబస్తీ అంతా చుట్టేశా. అక్కడ చాలా మంది ఫ్రెండ్స ఉన్నారు. సాంప్రదాయ దుస్తుల కోసం ఇక్కడే షాపింగ్ చేస్తా. నాకు గాజులంటే చాలా చాలా ఇష్టం. నా దగ్గర ప్రపంచంలోని అన్ని రంగుల, లెక్కపెట్టలేనన్ని రకాల గాజుల సెట్లు ఉన్నాయి. పెద్ద ఎత్తున చీరల కలెక్షన్కూడా ఉంది. ఫ్రెండ్స్‌తో కలసి ప్రేమికుడు సినిమా.. నాకైతే హైదరాబాద్‌లో సినిమాలే పెద్ద వినోదం. రామకృష్ణ, మహేశ్వరి-పరమేశ్వరి, ఆనంద్, సుదర్శన్, శాంతి.. ఇలా అన్ని థియేటర్లలోనూ సినిమాలు చూశాను. అమీర్‌పేట సత్యంలో ఫ్రెండ్సతో కలసి ప్రేమికుడు సినిమా చూస్తూ ఎంజాయ్ చేయడం మరపురాని జ్ఞాపకం. అన్నట్లు సికింద్రాబాద్ కేవీ స్కూల్‌కు దగ్గర్లోనే లాంబా థియేటర్ ఉన్నా ఆ ఛాయలకు పోలేదు లెండి (నవ్వుతూ). హైదరాబాద్ బ్రాండ్ తగ్గదు కొత్త రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యం ఉండాలనేదే నా కోరిక. బ్రాండ్ హైదరాబాద్ విలువ ఎప్పటికీ తగ్గదు. సిటీ చరిష్మాను ఎవరూ తగ్గించలేరు. టు బి ఫ్రాంక్.. ది బెస్ట్ సిటీలో నేనుంటున్నానని ఆనందంగా, గర్వంగా చెప్పగలను. -
ఏడాదిలో మరో 3 టీవీఎస్ వాహనాలు !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి మరో 3 టీవీఎస్ వాహనాలు విపణిలోకి రానున్నాయి. 2 నెలల్లో దేశీయ మార్కెట్లోకి ‘జెస్ట్ స్కూటీ’ను విడుదల చేయనున్నట్లు టీవీఎస్ మోటార్ కంపెనీ (సేల్స్) వైస్ ప్రెసిడెంట్ జె.ఎస్. శ్రీనివాసన్ చెప్పారు. మంగళవారమిక్కడ ‘స్టార్ సిటీ ప్లస్’ను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఏమన్నారంటే... ఏపీలో నెలకు లక్ష వాహనాలు..: నెలకు దేశ వ్యాప్తంగా 14 లక్షల ద్విచక్ర వాహనాలు అమ్ముడవుతుండగా.. ఇందులో టీవీఎస్ మోటార్ కంపెనీ వాటా 30 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా గతేడాది నెలకు 1.48 లక్షల టీవీఎస్ వాహనాలను విక్రయించగా.. ఈ ఏడాది 1.85 లక్షల బైకులను విక్రయిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో 17% మార్కెట్ వాటాతో నెలకు లక్ష వరకు టీవీఎస్ ద్విచక్ర వాహనాలు అమ్ముడవుతున్నాయి. 120 సీసీ లోపు ఉన్న టీవీఎస్ వాహనాలు నెలకు 35 వేలు అమ్ముడవుతుండగా.. 2 నెలల్లో వీటి సంఖ్యను 45 వేల యూనిట్లకు చేర్చుతాం. అంటే రెండు నెలల్లో 10 వేల స్టార్‌సిటీ ప్లస్ బైకులను విక్రయిండమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నమాట. 16% వృద్ధికి వాహన పరిశ్రమ..: దేశవ్యాప్తంగా ఏటా వాహనాల పరిశ్రమ 8% వృద్ధిని కనబరుస్తోంది. అటు కేంద్రంలో, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాల రాక తో ఈ ఏడాది చివరి వరకు రెట్టింపు వృద్ధిని సాధిస్తుందని ఆశిస్తున్నాం. అంటే 16% వృద్ధికి చేరుకుంటుంది. ‘స్టార్ సిటీ ప్లస్’ గురించి క్లుప్తంగా.. ఆల్ న్యూ స్టార్‌సిటీ ప్లస్ వాహనాలు నలుపు, నీలం, స్కార్లెట్ 3 రంగుల్లో లభ్యమవుతున్నాయి. 110 సీసీ అడ్వాన్స్ ఏకోత్రస్ట్ ఇంజిన్‌ను అమర్చాం. మైలేజీ.. లీటరుకు 86 కి.మీ. దీని ధర రూ.42 వేల నుంచి ప్రారంభమవుతుంది. -
టీవీఎస్.. స్టార్‌సిటీ ప్లస్
చెన్నై: ఆటోమొబైల్ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ తాజాగా స్టార్ సిటీ ప్లస్ ద్విచక్ర వాహనాన్ని ప్రవేశపెట్టింది. ఇది స్టార్ సిటీకి అప్‌గ్రేడెడ్ వేరియంట్. దీని ధర రూ. 44,000 (ఢిల్లీ ఎక్స్‌షోరూం ధర). 110 సీసీ ఇంజిన్ సామర్ధ్యం ఉండే స్టార్ సిటీ ప్లస్.. లీటరుకు 86 కిలోమీటర్ల మైలేజి ఇవ్వగలదని కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్ తెలిపారు. ఈ ఏడాది ప్రవేశపెట్టదల్చుకున్న వాహనాల్లో ఇది మొదటిదని, మరో నాలుగు నెలల్లో అప్‌గ్రేడెడ్ ఇంజిన్‌తో విక్టర్‌ను వాహనాన్ని రీలాంచ్ చేస్తామని ఆయన వివరించారు. ఇకపై ప్రతి త్రైమాసికంలోనూ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు, వచ్చే నెల స్కూటీ జెస్ట్‌ను ఆవిష్కరించనున్నట్లు వేణు వివరించారు. ప్రస్తుతం ఎంట్రీ లెవెల్లో స్టార్ సిటీ, స్పోర్ట్.. 125 సీసీ విభాగంలో ఫీనిక్స్, అటు పైన హై ఎండ్‌లో అపాచీ ఆర్టీఆర్ బైక్‌లను టీవీఎస్ విక్రయిస్తోంది. అలాగే జూపిటర్, వెగో, స్కూటీ స్ట్రీక్, స్కూటీ పెప్ప్లస్ పేరిట స్కూటరెట్లను.. టీవీఎస్ ఎక్స్ఎల్ సూపర్, ఎక్స్ఎల్ హెవీ డ్యూటీ పేరిట మోపెడ్లను, టీవీఎస్ కింగ్ పేరుతో ఆటో రిక్షాలను విక్రయిస్తోంది. ప్రస్తుతమున్న స్టార్ సిటీ మోడల్‌ను దశలవారీగా నిలిపివేస్తామని టీవీఎస్ మోటార్ ప్రెసిడెంట్ కేఎన్ రాధాకృష్ణన్ తెలిపారు. బీఎండబ్ల్యూ మోటోర్యాడ్ బైక్... జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం బీఎం డబ్ల్యూ.. మోటార్‌సైకిల్ విభాగం మోటోర్యాడ్తో ఒప్పందంలో భాగంగా తొలి వాహనాన్ని రూపొందిస్తున్నామని వేణు వివరించారు. ఇది వచ్చే ఏడాది ద్వితీ యార్థం నాటికి సిద్ధం కాగలదని ఆయన పేర్కొన్నారు. గతేడాది ఏప్రిల్‌లో ఇందుకు సంబంధించి ఇరు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీని ప్రకారం టీవీఎస్ రూ. 142 కోట్లు ఇన్వెస్ట్ చే స్తుండగా, మోటార్‌సైకిళ్ల అభివృద్ధి.. టెస్టింగ్ ఖర్చులను బీఎండబ్ల్యూ భరిస్తుంది.