![Vemireddy Prabhakar Reddy as the Vice Chairman of Rajya Sabha - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/2/vemireddy.jpg.webp?itok=xcYRSG8T)
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ వైస్ చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపికయ్యారు. నలుగురు మహిళలు సహా మొత్తం 8 మంది సభ్యులతో కూడిన వైస్ చైర్మన్ల ప్యానెల్‌ను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ పునరి్నయామకం చేశారు.
ప్యానెల్‌లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు రమీలాబెన్ బేచర్ భాయ్ బారా, సీమా ద్వివేది, డాక్టర్ అమీ యాజి్ఞక్, మౌసమ్ నూర్, కనకమేడల రవీంద్ర కుమార్, ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా, లెఫ్టినెంట్ జనరల్ డీపీ వత్స్ (రిటైర్డ్) ఉన్నారు. చైర్మన్ ధన్‌ఖడ్ గైర్హాజరైన సందర్భాల్లో వీరు సభను నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment