‘ధర్మవరం’ వైస్‌ చైర్మన్‌ పదవులకు 14న ఎన్నిక | Election on 14th June for 2 Vice-Chairmen in Dharmavaram Municipality | Sakshi
Sakshi News home page

‘ధర్మవరం’ వైస్‌ చైర్మన్‌ పదవులకు 14న ఎన్నిక

Published Thu, Jun 9 2022 4:43 AM | Last Updated on Thu, Jun 9 2022 4:43 AM

Election on 14th June for 2 Vice-Chairmen in Dharmavaram Municipality - Sakshi

సాక్షి, అమరావతి: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మునిసిపాలిటీలోని రెండు వైస్‌ చైర్మన్‌ పదవులకు ఈ నెల 14వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు.

ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆ రెండు స్థానాలకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని, కౌన్సిలర్లకు ఈ నెల 10లోగా నోటీసులు జారీ చేయాలని జిల్లా అధికారులకు సూచించారు. 14వ తేదీ ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement