నీరందించేందుకు చర్యలు
-
అధికారులతో సమీక్ష
వేల్పూర్ :
ఫిబ్రవరి వరకు మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికీ తాగునీరందించేందుకు చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఆదివారం వేల్పూర్‌లోని ఆయన స్వగృహంలో మిషన్ భగీరథ పనుల పురోగతిపై ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బాల్కొండ, కామారెడ్డి సెగ్మెంట్లలో పనుల పురోగతిపై ఆయన అధికారులతో చర్చించారు. జలాల్‌పూర్, ఆర్గుల్‌లో నిర్మిస్తున్న రెండు డబ్ల్యూటీపీలను త్వరగా పూర్తిచేసేందుకు అవసరమైన యా„ý న్ ప్లాన్‌పై సమీక్షించారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి నల్లాల ద్వారా నీరందించేందుకు అవసరమైన 24 ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణాన్ని, 200 కిలోమీటర్ల పైప్‌లైన్ పనులను వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. హెడ్‌వర్క్స్ పనులను పూర్తిచేస్తూనే, సమాంతరంగా ఇంట్రా పనులూ చేపట్టాలన్నారు. ఇందుకోసం ప్రాజెక్టు మేనేజర్‌తో పాటు నలుగురు ఇంజినీర్లను నియమించాలని వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను ఆయన ఆదేశించారు. జలాల్‌పూర్ ఇన్‌టెక్‌వెల్ నుంచి బాల్కొండ గుట్ట, అక్కడి నుంచి మోర్తాడ్‌కు నీటిని సరఫరా చేసేందుకు కొత్త పైప్‌లైన్ వేయాలన్నారు. సెగ్మెంట్‌లో ఉన్న అన్ని విద్యాసంస్థలతో పాటు, స్పైస్‌పార్కుకు కూడా మంచినీటిని సరఫరా చేయాలన్నారు. బాల్కొండ మండలంలో 24 ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు, డబ్ల్యూటీపీ నుంచి గ్రామాలకు సెకండరీ పైపులైన్ పనులు, కమ్మర్‌పల్లి మండలంలో పైప్‌లైన్‌లను డిసెంబరుకల్లా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మోర్తాడ్ మండలంలో సెకండరీ, ఓహెచ్‌ఎస్‌ఆర్ పైప్‌లైన్ పనులు డిసెంబరులో ప్రారంభించి, జనవరికి పూర్తిచేయాలన్నారు. వేల్పూర్ మండలంలో సెకండరీ పైప్‌లైన్‌ను నవంబరులో పూర్తిచేయాలని, 11 అంతర్గత ఓహెచ్‌ఎస్‌ఆర్, 51 కిలోమీటర్ల అంతర్గత పైప్‌లైన్ పనులు నవంబరులో ప్రారంభించి, జనవరిలో పూర్తిచేయాలని ఆదేశించారు. భీమ్‌గల్ మండలంలో సెకండరీ పైప్‌లైన్ డిసెంబరు వరకు, 36 అంతర్గత ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు,101 కిలోమీటర్ల అంతర్గత పైప్‌లైన్ పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. బాల్కొండ మండలంలో రూ. 25 కోట్లు, కమ్మర్‌పల్లి మండలంలో రూ. 20 కోట్లు, వేల్పూర్ మండలంలో రూ. 10 కోట్లతో పనులు చేపట్టినట్లు వెల్లడించారు. నిరంతరం పనులు పర్యవేక్షించేందుకు బాల్కొండకు ప్రత్యేక ఇంట్రా విలేజ్ సబ్‌డివిజన్ ఏర్పాటు చేసినట్లు ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. సమావేశంలో వాటర్‌గ్రిడ్ ఎస్పీ ప్రసాద్‌రెడ్డి, ఓఎస్‌డీ సత్యపాల్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈలు, ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.