దేశంలో ఎన్నికల ప్రచారం ఇప్పటికే మొదలైపోయింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ జెండా ఎగురవేయడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తున్నారు. కీలక నేతల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ తరుణంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అన్ని పార్టీలకు సరైన ప్రాధాన్యత ఉండేలా పశ్చిమ బెంగాల్ బ్యూరోక్రసీకి కచ్చితమైన ఆదేశాలు జారీ చేశామని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి హింసాకాండకు తావు లేదని, ఆలా జరిగితే సహించేది లేదని చీప్ ఎలక్షన్ కమిషనర్ ఈ రోజు (మంగళవారం) ప్రకటించారు.
విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, రాష్ట్రంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, హింస రహిత ఎన్నికలను నిర్వహించడమే ఎన్నికల సంఘం లక్ష్యమని.. ఎన్నికల్లో భయానికి, బెదిరింపులకు తావు లేదని, అధికార యంత్రాంగం పక్షపాత ధోరణిని సహించేది లేదని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రాజకీయాల్లోకి అభిజిత్ గంగోపాధ్యాయ.. త్వరలో ఆ పార్టీలోకి
పశ్చిమ బెంగాల్‌లో తగిన సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరిస్తామని, దీంతో తప్పకుండా ఎన్నికలు సజావుగా జరుగుతాయని ఆయన అన్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు వస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలకు చెప్పినట్లు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకుంటే.. ఆ తరువాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రాజీవ్ అన్నారు. కాబట్టి పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా ఉండాలని, జిల్లా స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment