న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం నేషనల్ ఐకాన్‌గాగా టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నియమితులయ్యారు. ఓటింగ్‌పై అవగాహన పెంచే క్రమంలో ప్రచారకర్తగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రానున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడం లక్ష్యంగా ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించేందుకు సచిన్ సిద్ధమయ్యారు.
తప్పనిసరిగా ఓటేయాలి!
ఈ మేరకు కీలక బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సచిన్ టెండూల్కర్.. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఓటర్లు బాధ్యతతో తప్పనిసరిగా ఓటేయాలి’’ అంటూ తన కర్తవ్యాన్ని మొదలుపెట్టారు. ఇక కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. సచిన్ టెండూల్కర్ కొత్త ఇన్నింగ్స్ సక్సెస్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
వంద సెంచరీల వీరుడు
క్రికెట్ గాడ్‌గా పేరొందిన సచిన్ టెండుల్కర్‌కు ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్లాది మనసుల్లో స్థానం సంపాదించిన ఈ లెజెండరీ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు సాధించారు.
ఎన్నెన్నో అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్న సచిన్.. ఎంపీగానూ పనిచేశారు. ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా ఎన్నికల సంఘం తాజాగా నేషనల్ ఐకాన్‌గా నియమించింది.
సచిన్ క్రేజ్‌ను ఉపయోగించి ఓటింగ్‌పై అవగాహన పెంచేందుకు సిద్ధమైంది. గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సహా మహిళా బాక్సర్ మేరీ కోమ్ ప్రచారకర్తలుగా పనిచేశారు. అదే విధంగా బాలీవుడ్ మిస్టర పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ సహా పంకజ్ త్రిపాఠి కూడా ఈ బాధ్యతలు నిర్వర్తించారు.
చదవండి: Heath Streak: హీత్ స్ట్రీక్ బతికే ఉన్నాడు.. నీకసలు బుద్ధుందా? ఫ్యాన్స్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment