
సాక్షి, విశాఖపట్నం : విశాఖ పరిపాలనా రాజధానిగా ఆమోదముద్ర పడిన నేపధ్యంలో పోలీస్ శాఖ ఆవశ్యకత, మౌలిక సదుపాయాల కల్పనపై తమ కమిటీ పరిశీలన చేయనున్నట్లు విశాఖ పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ మీనా అన్నారు. ఆరుగురు అధికారుల ప్రత్యేక బృందంతో కమిటీని నియమించినట్లు తెలిపారు. ఇప్పటికే ఒకసారి సమావేశమైన ఈ బృందం మరో మూడుసార్లు సమావేశమయ్యి తుది నివేదికను 15 రోజుల్లో డీజీపీకి అందిస్తామని సీపీ అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక ప్రణాళికలను అందజేశామన్నారు. దీంతో పాటు క్రైం, విఐపిల సెక్యూరిటీ తదితర అంశాలపై కమిటీ పూర్తిగా పరిశీలన జరుపుతుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment