ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల పథకానికి తమ వంతు కృషి అందిస్తామని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజన్, ప్రణాళికలు చాలా బాగున్నాయని ఆయన ప్రశంసించారు. మూడు నెలల్లోనే అద్భుత పనితీరు చూపారని కితాబిచ్చారు.