సాక్షి, అమరావతి: ప్రకృతి వ్యవసాయాన్ని పోత్సహించేందుకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టాలని కేంద్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు నేచురల్ ఫార్మింగ్‌పై మరిన్ని పరిశోధనలు జరగాలన్నారు. సహజ, పకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం పాల్గొన్నారు.
రైతు సంక్షేమానికి ఏపీ సర్కార్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సీఎం తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని సేవలు రైతుల ముంగిటకే అందిస్తున్నామని వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో 6.30 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. 2.9 లక్షల హెక్టార్లలో ప్రకృతి సాగు జరుగుతోందని చెప్పారు. దీనిని మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నాని సీఎం జగన్ అన్నారు.
ప్రకృతి వ్యవసాయంపై సదస్సులో రైతు భరోసా కేంద్రాలపై ప్రశంసలు కురిపించారు.. నీతి ఆయోగ్ వైస్‌ఛైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్. తాను ప్రత్యక్షంగా ఆర్బీకేలను పరిశీలించానని.. అక్కడ అందిస్తున్న సేవలు నిజంగా అభినందనీయమని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: సీపీఎస్ విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటాం: బొత్స
Comments
Please login to add a commentAdd a comment