అన్ని రంగాల్లోకీ రాజకీయ అవినీతి | political corruption in all sectors | Sakshi
Sakshi News home page

అన్ని రంగాల్లోకీ రాజకీయ అవినీతి

Published Mon, Mar 14 2016 2:18 AM | Last Updated on Thu, Jul 18 2019 2:17 PM

అన్ని రంగాల అవినీతికి రాజకీయ అవినీతి మూలకారణంగా నిలుస్తోందని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) సంస్థలు అభిప్రాయపడ్డాయి.

ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్
 
 సాక్షి, హైదరాబాద్: అన్ని రంగాల అవినీతికి రాజకీయ అవినీతి మూలకారణంగా నిలుస్తోందని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఈ సంస్థల ఆధ్వర్యం లో ‘ఎన్నికలు-రాజకీయ సంస్కరణలు’ అనే అంశంపై హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జరిగిన 12వ వార్షిక జాతీయ సదస్సు ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఏడీఆర్, న్యూ సంస్థల అధిపతి, రిటైర్డ్ మేజర్ జనరల్ అనిల్ వర్మ మాట్లాడుతూ.. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లాగే పంచాయతీ ఎన్నికల్లో కూడా మద్యం ఏరులై పారుతోందని, డబ్బును విచ్చలవిడిగా పంచుతున్నారని పేర్కొన్నారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి క్షేత్రస్థాయి నుంచి తీవ్ర కృషి చేశారని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను కూడా వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచాలని జార్ఖండ్ ఎలక్షన్ వాచ్ కోఆర్డినేటర్ సుధీర్ పాల్ అన్నారు. క్షేత్రస్థాయిలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బిహార్ ఎన్నికల వాచ్ ప్రతినిధి రాజీవ్‌కుమార్ సూచించారు. సత్యాగ్రహ డాట్‌కామ్ వ్యవస్థాపకుడు సంజయ్‌దుబే మాట్లాడుతూ.. 2014 సాధారణ ఎన్నికల్లో సోషల్ మీడియా స్పష్టమైన ప్రభావం చూపిందని, వ్యక్తులు, పత్రికల ఆలోచన ధోరణిని కూడా ప్రభావితం చేస్తోందని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement