ఆకివీడు : జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల్లోని పిల్లల కోసం 183 ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు సర్వశిక్ష అభియాన్ అసిస్టెంట్ పర్యవేక్షణాధికారి ఎ.సర్వేశ్వరరావు తెలిపారు.
జిల్లాలో 183 ప్రత్యేక పాఠశాలలు
Published Wed, Aug 10 2016 8:56 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
ఆకివీడు : జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల్లోని పిల్లల కోసం 183 ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు సర్వశిక్ష అభియాన్ అసిస్టెంట్ పర్యవేక్షణాధికారి ఎ.సర్వేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆకివీడులో విలేకరులతో మాట్లాడుతూ ఆకివీడులో ప్రత్యేక స్కూల్‌ను జిల్లాలోనే ప్రప్రథమంగా ప్రారంభించామన్నారు. స్కూల్ గ్రాంట్, మెయింటినెన్స్ గ్రాంట్ రూ.5 కోట్ల మేర విడుదల చేశామని చెప్పారు. మెయింటినెన్స్ గ్రాంట్‌గా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ మొత్తం రూ.2 కోట్ల 84 లక్షల 50 వేలు కేటాయించామన్నారు. స్కూల్ గ్రాంట్‌గా రూ. 2 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఎంఆర్‌సీ గ్రాంట్‌గా రూ. 25.50 లక్షలు, 263 స్కూల్ కాంప్లెక్స్‌ల ఏర్పాటుకు రూ.71 లక్షలు కేటాయించామన్నారు. ఈనెలాఖరు నుంచి స్కూల్ కాంప్లెక్స్‌లు ఏర్పాటుచేయాలని ఆదేశించామని చెప్పారు. ఎంపీపీ మోడల్ స్కూల్స్ నిర్వాహణకు వర్కు షాపు నిర్వహించినట్టు చెప్పారు.
స్వచ్ఛ విద్యాలయం పురస్కారం
కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతున్న స్వచ్ఛ భారత్‌లో భాగంగా స్వచ్ఛ విద్యాలయాలను అందంగా తీర్చిదిద్దాలని సర్వేశ్వరరావు సూచించారు. జిల్లాలో అన్ని పాఠశాలలు స్వచ్ఛ విద్యాలయాల అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎంఈవో ఏఏవీబీ సత్యానంద్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement