జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
Published Thu, Jan 12 2017 12:14 AM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM
ఉంగుటూరు : స్థానిక వివేకానంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రాత్రి జాతీయస్థాయి అండర్–17 బాలబాలికల వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి డీఈవో డి. మధుసూదనరావు అధ్యక్షత వహించగా రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో జాతీయస్థాయిలో వాలీబాల్ పోటీలు నిర్వహణ అభినందనీయమన్నారు. పోటీల నిర్వాహకుడు ఆదిరెడ్డి సత్యనారాయణను డీఈవో అభినందించారు. తొలుత అతిథులు క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతర్జాతీయ పోటీల న్యాయ నిర్ణేత టీవీ అరుణాచలం, పరిశీలకుడు ధర్మేష్‌కుమార్, టెక్నికల్ చైర్మ న్ ఆర్‌ఎస్ సింగ్, జిల్లా ఒలింపిక్స్ అసోసియేష న్ కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, డీవైఈవో విలియం, స్టేట్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అధికారి పి.రవీంద్ర, ఎంఈవో చిడిపి వెంకటరత్నం పాల్గొన్నారు.
Advertisement