UNDER-17
-
World Wrestling:32 ఏళ్ల తర్వాత...
రోమ్ (ఇటలీ): సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది. ప్రపంచ రెజ్లింగ్ అండర్–17 చాంపియన్‌షిప్‌లో గ్రీకో రోమన్ విభాగంలో భారత్‌కు 32 ఏళ్ల తర్వాత స్వర్ణ పతకం లభించింది. మంగళవారం జరిగిన 55 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో భారత యువ రెజ్లర్ సూరజ్ విజేతగా అవతరించాడు. ఫైనల్లో సూరజ్ 11–0తో ఫరైమ్ ముస్తఫయెవ్ (అజర్బైజాన్)పై విజయం సాధించాడు. తద్వారా 1990లో పప్పూ యాదవ్ తర్వాత ప్రపంచ అండర్–17 చాంపియన్‌షిప్‌లో గ్రీకో రోమన్ విభాగంలో పసిడి పతకం నెగ్గిన భారత రెజ్లర్‌గా సూరజ్ గుర్తింపు పొందాడు. -
ఫ్రీడం కప్ ఫుట్‌బాల్ టోర్నీ విజేత 'సఫా'
హైదరాబాద్: ఈ నెల 14, 15 తేదీల్లో స్టేడియం ఆఫ్ హోప్ వేదికగా 'సర్వింగ్ త్రూ స్పోర్ట్స్' సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఫ్రీడం కప్-2021 అండర్-17 ఫుట్‌బాల్ టోర్నీలో షబ్బీర్ అలీ ఫుట్‌బాల్ అకాడమీ(సఫా) విజేతగా ఆవిర్భవించింది. ఈ సెవెన్ ఎ సైడ్ లీగ్ కమ్ నాకౌట్ టోర్నీలో మొత్తం 14 జట్టు పాల్గొనగా.. సఫా, సఫా-బి జట్లు ఫైనల్‌కు చేరాయి. ఫైనల్లో సఫా జట్టు సఫా-బి జట్టుపై 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించి, ఆడిన తొలి అండర్-17 టోర్నీలోనే విజేతగా ఆవిర్భవించింది. సఫా తరఫున ఇమ్రాన్, ఖాదర్ గోల్స్ సాధించగా.. ఇమ్రాన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అంతకుముందు సఫా జట్టు పెట్రా స్పోర్ట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకోగా, అనంతరం యునైటెడ్ ఎఫ్‌సీ(2-0), ఎల్ఎస్ఏ రీపర్స్(3-1) జట్లపై విజయం సాధంచి సెమీస్‌కు అర్హత సాధించింది. కీలకమైన సెమీస్‌లో సఫా జట్టు రేవన్స్ ఎఫ్‌సీపై 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. కాగా, టోర్నీ విజేతగా ఆవిర్భవించిన సఫా జట్టుకు సర్వింగ్ త్రూ స్పోర్ట్స్ సంస్థ అధినేత, ముఖ్య అతిధి శ్రీకాంత్ డేవిడ్ విన్నింగ్ ట్రోఫీని బహుకరించారు. జట్టులో ఆటగాళ్లందరికీ వ్యక్తిగత మెడల్స్ బహుకరించి వారిని అభినందించారు. విన్నింగ్ ట్రోఫీని జట్టు కెప్టెన్ ఖాదర్ అందుకున్నాడు. కాగా, ఈ విషయాన్ని సఫా జట్టు ప్రధాన కోచ్ షబ్బీర్ అలీ ప్రెస్ నోట్ ద్వారా మీడియాకు వెల్లడించారు. -
తెలంగాణకు రెండు పతకాలు
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో అండర్ –17 బాలుర వెయిట్‌లిఫ్టింగ్‌లో 73 కేజీల విభాగం లో తెలంగాణ వెయిట్‌లిఫ్టర్ ధనావత్ గణేశ్ రజత పతకం గెలిచాడు. అతను మొత్తం 245 కేజీల బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. అండర్–17 బాలుర ఖో–ఖోలో తెలంగాణ జట్టుకు కాంస్యం లభిం చింది. అండర్–17 బాలికల వెయిట్‌లిఫ్టింగ్ 64 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ షేక్ మహబూబా చాంద్ కాంస్య పతకం గెలిచింది. డాక్టర్ వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ (కడప)కు చెందిన మహబూబా మొత్తం 144 కేజీలు బరువెత్తింది. -
హోరాహోరీగా జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు
నారాయణపురం (ఉంగుటూరు) : స్థానిక వివేకానంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయస్థాయి అండర్–17 బాలికల, బాలుర వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. అంతర్జాతీయ న్యాయ నిర్ణేత టీవీ అరుణాచలం, పరిశీలకుడు ధర్మేష్‌కుమార్ పోటీలను పర్యవేక్షించారు. ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, క్రీడా నిర్వాహక కార్యదర్శి ఎ.సాయి పాల్గొన్నారు. -
జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
ఉంగుటూరు : స్థానిక వివేకానంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రాత్రి జాతీయస్థాయి అండర్–17 బాలబాలికల వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి డీఈవో డి. మధుసూదనరావు అధ్యక్షత వహించగా రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో జాతీయస్థాయిలో వాలీబాల్ పోటీలు నిర్వహణ అభినందనీయమన్నారు. పోటీల నిర్వాహకుడు ఆదిరెడ్డి సత్యనారాయణను డీఈవో అభినందించారు. తొలుత అతిథులు క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతర్జాతీయ పోటీల న్యాయ నిర్ణేత టీవీ అరుణాచలం, పరిశీలకుడు ధర్మేష్‌కుమార్, టెక్నికల్ చైర్మ న్ ఆర్ఎస్ సింగ్, జిల్లా ఒలింపిక్స్ అసోసియేష న్ కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, డీవైఈవో విలియం, స్టేట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అధికారి పి.రవీంద్ర, ఎంఈవో చిడిపి వెంకటరత్నం పాల్గొన్నారు. -
అండర్–17 కబడ్డీ జట్ల ఎంపిక
చిరుమామిళ్ళ (నాదెండ్ల): కబడ్డీ అండర్–17 బాలుర, బాలికల జిల్లా జట్ల వివరాలను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి ఎం గణేష్ సోమవారం ప్రకటించారు. నాదెండ్ల మండలం చిరుమామిళ్ళలోని నడికట్టు రామిరెడ్డి జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన ఎంపిక పోటీలకు 40 స్కూళ్ల నుంచి సుమారు 500 మంది క్రీడాకారులు, ముఖ్యఅతిథిగా నడికట్టు రామిరెడ్డి హాజరయ్యారు. బాలుర జట్టులో.. వై.నజీర్మీరసా, ఎన్.పవన్‌కుమార్ (చిలకలూరిపేట), సాయికుమార్ (గుళ్ళాపల్లి), ఇ.హరిబాబు(మాదల), జి.వెంకట శివనాగేశ్వరరావు (కుంకలగుంట), జి.సతీష్ (పిల్లుట్ల), జి.సైదులు మస్తాన్ (వి రెడ్డిపాలెం), ఎం.సుబ్బారావు (వెల్లటూరు), ఎస్.శ్రీనివాసరెడ్డి (కావూరు), భానుప్రసాద్ (చందోలు), ఎం.మేరిబాబు (తుమృకోట), బి.మణికంఠ (ఇంకొల్లు), స్టాండ్‌బైగా శ్రీనివాసరెడ్డి(చిరుమామిళ్ళ), పి.కరీం (చిలకలూరిపేట) ఎంపికయ్యారు. బాలికల జట్టులో.. డి.కవిత, ఎ.మహిత, సీహెచ్ ధనశ్రీ, ఎం.నిరోష, పి.వరలక్ష్మి, యు.భార్గవి (కావూరు), వి.సంధ్యారాణి (కుంకలగుంట), ఎ.అనిత (చిలకలూరిపేట), ఎ.రాజకుమారి (వల్లిపాలెం), ఎస్yì .ముబీనా (పెదకొండపాడు), ఐ.లావణ్య (రాజోలు), బి.దివ్య (ధూళిపూడి) ఎంపికయ్యారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలి
కడప స్పోర్ట్స్ : నగరంలోని మస్తాన్‌వలి వీధిలోని అనీస్ దర్బారీ చెస్ కోచింగ్ సెంటర్లో జిల్లాస్థాయి అండర్–17 బాలబాలికల చెస్ ఛాంపియన్షిప్ పోటీలు, ఎంపికలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి, కోచ్ అనీస్ దర్బారీ మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 26 నుంచి నెల్లూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలని సూచించారు. అనంతరం విజేతలుగా నిలిచిన ప్రేమ్‌సాయి, వంశీకృష్ణ, బాలికల విభాగంలో యాఫియాలకు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో నందలూరు రైల్వేస్టేషన్ మేనేజర్ కిషోర్‌దాస్ పాల్గొన్నారు. -
నేడు క్రికెట్ సెలక్షన్స్
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ (సీఎఫ్‌హెచ్) ఆధ్వర్యంలో గురువారం అండర్-17 రాష్ట్ర జట్టు కోసం సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఇందిరాపార్క్ ఎదురుగా వున్న ఎన్టీఆర్ స్టేడియంలో ఈ సెలక్షన్స్ జరుగుతాయని సీఎఫ్‌హెచ్ కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని ఏపీ జట్టుకు ఎంపిక చేస్తారు. ఈ జట్టు ఆలిండియా చౌదరి రణ్‌బీర్ సింగ్ హుడా జాతీయ లీగ్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటుంది. ఈ నెల 23 నుంచి 26 వరకు చండీగఢ్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. ఇందులో పాకిస్థాన్, శ్రీలంక, దుబాయ్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్‌కు చెందిన జట్లు పాల్గొననున్నాయి. 17 ఏళ్ల లోపు వయసున్న క్రికెటర్లు టోర్నీలో ఆడేందుకు అర్హులు. మరిన్ని వివరాలకు కోచ్ రజనీకాంత్‌ను 9966667798, 9966667795 ఫోన్‌నంబర్లలో సంప్రదించవచ్చు.