నేడు క్రికెట్ సెలక్షన్స్ | cricket selections starts to day | Sakshi
Sakshi News home page

నేడు క్రికెట్ సెలక్షన్స్

May 15 2014 12:10 AM | Updated on Sep 2 2017 7:21 AM

క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ (సీఎఫ్‌హెచ్) ఆధ్వర్యంలో గురువారం అండర్-17 రాష్ట్ర జట్టు కోసం సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నారు.

సాక్షి, హైదరాబాద్: క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ (సీఎఫ్‌హెచ్) ఆధ్వర్యంలో గురువారం అండర్-17 రాష్ట్ర జట్టు కోసం సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఇందిరాపార్క్ ఎదురుగా వున్న ఎన్టీఆర్ స్టేడియంలో ఈ సెలక్షన్స్ జరుగుతాయని సీఎఫ్‌హెచ్ కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని ఏపీ జట్టుకు ఎంపిక చేస్తారు.
 
 ఈ జట్టు ఆలిండియా చౌదరి రణ్‌బీర్ సింగ్ హుడా జాతీయ లీగ్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటుంది. ఈ నెల 23 నుంచి 26 వరకు చండీగఢ్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. ఇందులో పాకిస్థాన్, శ్రీలంక, దుబాయ్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్‌కు చెందిన జట్లు పాల్గొననున్నాయి. 17 ఏళ్ల లోపు వయసున్న క్రికెటర్లు టోర్నీలో ఆడేందుకు అర్హులు. మరిన్ని వివరాలకు కోచ్ రజనీకాంత్‌ను 9966667798, 9966667795 ఫోన్‌నంబర్లలో సంప్రదించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement