రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలి
కడప స్పోర్ట్స్ :
నగరంలోని మస్తాన్‌వలి వీధిలోని అనీస్ దర్బారీ చెస్ కోచింగ్ సెంటర్‌లో జిల్లాస్థాయి అండర్–17 బాలబాలికల చెస్ ఛాంపియన్‌షిప్ పోటీలు, ఎంపికలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి, కోచ్ అనీస్ దర్బారీ మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 26 నుంచి నెల్లూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలని సూచించారు. అనంతరం విజేతలుగా నిలిచిన ప్రేమ్‌సాయి, వంశీకృష్ణ, బాలికల విభాగంలో యాఫియాలకు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో నందలూరు రైల్వేస్టేషన్ మేనేజర్ కిషోర్‌దాస్ పాల్గొన్నారు.