UNGUTUR
-
టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ
కృష్ణా : ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణ నెలకొంది. తేలప్రోలు గ్రామ సర్పంచ్ భర్త రామకృష్ణ తన కారులో వస్తూ ముందు వెళ్తున్న వైఎస్సార్సీపీ గ్రామ నాయకుడి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ విషయంలో ఇద్దరూ గొడవపడ్డారు. విషయం తెలుసుకున్నటీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీ నేతపై దాడికి దిగారు. గొడవ పెద్దది కావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. విషయం తెలిసి ఉంగుటూరు పోలీస్ స్టేషన్ వద్దకు వైసీపీ, టీడీపీ నాయకులు , కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. తమపై దౌర్జన్యం చేశారంటూ వైఎస్సార్సీపీ నేతలు చేసిన ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు. పోలీసుల అదుపులో వున్న వైఎస్సార్సీపీ నేత శ్రీనివాసరెడ్డిని వైఎస్సార్సీపీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు పరామర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తేలప్రోలులో 144 సెక్షన్‌ను విధించారు. అరెస్ట్ చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్యలను గన్నవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
ఉంగుటూరు : స్థానిక వివేకానంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రాత్రి జాతీయస్థాయి అండర్–17 బాలబాలికల వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి డీఈవో డి. మధుసూదనరావు అధ్యక్షత వహించగా రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో జాతీయస్థాయిలో వాలీబాల్ పోటీలు నిర్వహణ అభినందనీయమన్నారు. పోటీల నిర్వాహకుడు ఆదిరెడ్డి సత్యనారాయణను డీఈవో అభినందించారు. తొలుత అతిథులు క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతర్జాతీయ పోటీల న్యాయ నిర్ణేత టీవీ అరుణాచలం, పరిశీలకుడు ధర్మేష్‌కుమార్, టెక్నికల్ చైర్మ న్ ఆర్ఎస్ సింగ్, జిల్లా ఒలింపిక్స్ అసోసియేష న్ కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, డీవైఈవో విలియం, స్టేట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అధికారి పి.రవీంద్ర, ఎంఈవో చిడిపి వెంకటరత్నం పాల్గొన్నారు. -
యూనివర్సిటీ క్రికెట్ జట్టు ఎంపిక
నారాయణపురం (ఉంగుటూరు) : స్థానిక చింతలపాటి బాపిరాజు స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించిన బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు మంగళవారం సాయంత్రం ముగిశాయి. ఈ పోటీల్లో అత్యంత ప్రతిభ చూపిన వారిని ఆదికవి నన్నయ యూనివర్సిటీ బాలుర క్రికెట్ జట్టుకు ఎంపిక చేసినట్టు జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ ప్రకటించారు. జట్టుకు ఎంపికైంది వీరే.. ఎన్.వినయ్. బి.సాయి కృష్ణకాంత్, వి.వెంకటేశ్వరారవు(వేగవరం), ఎస్కే సమీర్, ఎస్బీ రోహన్ లక్ష్మణ్(రాజమహేంద్రవరం, ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్,) వీఈఎస్ అఖిల్ వర్మ (డీఎన్ ఆర్, భీమవరం), టి.గోపి( పెనుగొండ), జి.నరేష్(జంగారెడ్డిగూడెం), ఎన్ .విద్యా సాగర్(కొత్తపేట), ఎల్.శ్రీనివాసరావు( గోపన్నపాలెం), ఎఎస్‌ఎస్ ప్రసాద్(అమలాపురం) కె.రోహిత్ కుమార్(కాకినాడ), ఆర్.సత్యనారాయణ( రాజమహేంద్రవరం), వి.జయరాజు(అనపర్తి), టి.నాగసాయి ప్రసాద్( నర్సాపురం), డి.శ్రీను(తుని), స్టాండ్ బైలుగా ఎస్కే జాఫర్(కాకినాడ), ఏడీఎస్స్ సంతోష్(రాజమహేంద్రవరం), ఎ.కిరణ్‌కుమార్( తణుకు), ఎల్.ధనుంజయ(రాజ మహేంద్రవరం)ఎంపిక చేసినట్టు సెలక్షన్ కమిటీ తరపున ఎస్కే సలీమ్ భాషా, బి.బాపిరెడ్డి తెలిపారు. ఈనెల 28న తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించనున్న అంతర యూనిర్సిటీల క్రికెట్ పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందని చెప్పారు. కార్యక్రమంలో పీడీ లతానియేలు పాల్గొన్నారు. -
జిల్లాలో గడపగడపకూ వైఎస్సార్ భేష్
ఉంగుటూరు : జిల్లాలో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయని, ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తమ ఇబ్బందులను ఎకరువు పెడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు. బుధవారం ఉంగుటూరు నియోజకవర్గం పెదనిండ్రకొలనులో వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆళ్ల నాని మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయటానికి జిల్లాలోని అన్ని మండలాల్లో మండల కాంగ్రెస్ కమిటీ సమావేశాలను నిర్వహించి, కార్యకర్తలకు మనోధైర్యంతో పాటు నూతనోత్సహం తీసుకువస్తామన్నారు. వినాయకచవితి వెళ్లిన తరువాత జిల్లాలో 48 మండలాల్లో సమావేశాలు నిర్వహిస్తామని, తేదీలను త్వరలో ఖరారు చేస్తామన్నారు. టీడీపీ రెండేళ్ల ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు విసుగు చెందుతున్నారన్నారు. టీడీపీ పాలనలో పచ్చచొక్కాల వారికే సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. పేదల కష్టాలు తెలుసుకోవటం కోసమే ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన మోసాలను, పేదలకు అందాల్సిన పథకాలు అందటంలేదని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబును నమ్మినందుకు తమకు తగిన గుణపాఠం చెప్పారని పేదలు ఆవేదన చెందుతున్నారని నాని చెప్పారు. వాసుబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో అన్నివర్గాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని, రేషన్ సరుకులను 9 నుంచి 2కు కుదించి పేదలకు అన్యాయం చేసిందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మాజేటి సురేష్, మండల పార్టీ కన్వీనర్లు మరడ మంగరావు (ఉంగుటూరు), సంకు సత్యకుమార్ (నిడమర్రు), ఎంపీటీసీ సభ్యులు కోడూరి రాంబాబు, గొట్టుముక్కల విశ్వనాథరాజు, వాసా రాజు, కె.త్రిమూర్తులు, తమ్ముం శ్రీను, పుప్పాల గోపి, అంబళ్ల రామకష్ణ, గంపా అప్పలస్వామి, గొర్లె శ్రీను, మత్స శ్రీను, కోటి బాలు, రాము తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఉంగుటూరులో ఆళ్ల నానికి మరడ మంగరావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. -
ఏజెంట్లను బెదిరించిన వల్లభనేని వంశీ
గన్నవరం : గన్నవరం టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ బెదిరింపులకు పాల్పడ్డారు. ఉంగుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను బెదిరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లుగా వ్యవహరించవద్దని, బెదిరింపులతో పాటు ప్రలోభాలకు గురి చేసేందుకు యత్నించారు. అయితే అందుకు వైఎస్ఆర్ సీపీ ఏజెంట్లు లొంగలేదు. మరోవైపు ఉంగుటూరు మండలం ఆత్కూరులో టీడీపీ ప్రలోభాలకు పాల్పడింది. ఓటర్లకు డబ్బులు పంచుతున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే గుడివాడ 34వ వార్డులోని టీడీపీ నేత ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. -
రాజకీయాలకు వట్టి వసంత్ గుడ్‌బై
మాజీమంత్రి వట్టి వసంతకుమార్ క్రియాశీల రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. ఇక మీదట తాను రాజకీయాల్లో పాల్గొనబోనని ఆయన స్పష్టం చేశారు. 2009 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన గన్ని లక్ష్మీకాంతంపై 6459 ఓట్ల మెజారిటీతో నెగ్గిన వసంత కుమార్.. అప్పుడు చెప్పినట్లు గానే తాను ఇప్పుడు రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విభజన దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టును ఇప్పటికైనా త్వరితగతిన పూర్తి చేయాలని వట్టి వసంత్ డిమాండ్ చేశారు. వట్టి వెంకటరంగ పార్థసారథి కుమారుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన వసంతకుమార్, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే బాగా ఎదిగారు. ఆయన మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన జరిగిన తీరుపట్ల కలత చెంది.. పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ఉంగుటూరులో ఆయన ప్రకటించారు.