రాజకీయాలకు వట్టి వసంత్ గుడ్బై
మాజీమంత్రి వట్టి వసంతకుమార్ క్రియాశీల రాజకీయాలకు గుడ్బై చెప్పారు. ఇక మీదట తాను రాజకీయాల్లో పాల్గొనబోనని ఆయన స్పష్టం చేశారు. 2009 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన గన్ని లక్ష్మీకాంతంపై 6459 ఓట్ల మెజారిటీతో నెగ్గిన వసంత కుమార్.. అప్పుడు చెప్పినట్లు గానే తాను ఇప్పుడు రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విభజన దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టును ఇప్పటికైనా త్వరితగతిన పూర్తి చేయాలని వట్టి వసంత్ డిమాండ్ చేశారు.
వట్టి వెంకటరంగ పార్థసారథి కుమారుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన వసంతకుమార్, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే బాగా ఎదిగారు. ఆయన మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన జరిగిన తీరుపట్ల కలత చెంది.. పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ఉంగుటూరులో ఆయన ప్రకటించారు.