quits politics
-
రాజకీయాలకు మెట్రోమ్యాన్ గుడ్‌బై
సాక్షి, మలప్పురం: కేరళ అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి, ఓటమిపాలైన మెట్రోమ్యాన్ ఈ. శ్రీధరన్ క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ‘సహజంగా నేనెప్పుడూ రాజకీయ నాయకుడిని కాను. ఉండాలనుకోలేదు. నాకిప్పుడు 90ఏళ్లు. అందుకే క్రియాశీల రాజకీయాల్లో కొనసాగాలనుకోవడం లేదు. ప్రస్తుతం మూడు ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను ’అని శ్రీధరన్ గురువారం పొన్నానిలో మీడియాతో అన్నారు. ఈ పరిణామంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ స్పందించారు. క్రియాశీల రాజకీయాల్లో లేకున్నా శ్రీధరన్ సేవలను పార్టీ ఇతర అంశాలకు సంబంధించి ఉపయోగించుకుంటుందని చెప్పారు. శ్రీధరన్ ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. బీజేపీ తరఫున కేరళ సీఎం అభ్యర్థిగా పాలక్కడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శ్రీధరన్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. చదవండి: కొన్ని రోజులు కలిసుంటే సహజీవనం కాదు! -
బీజేపీకి భారీ షాక్: రాజకీయాలకు ఎంపీ గుడ్ బై
కలకత్తా: ఇటీవల కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పోస్టు కోల్పోయిన కేంద్ర మాజీ మంత్రి బాబూల్ సుప్రియో అలిగారు. తనకు మళ్లీ మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఇక రాజకీయాల నుంచే వైదొలుగుతున్నట్లు ఆయన శనివారం సంచలన ప్రకటన చేశారు. దీంతోపాటు లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని సోషల్ మీడియా వేదికగా బాబుల్ సుప్రియో తెలిపారు. ఈ పరిణామం పశ్చిమ బెంగాల్‌తో పాటు ఢిల్లీలోని బీజేపీ అధిష్టానానికి పెద్ద షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాబుల్ సుప్రియో ప్రముఖ గాయకుడు. బీజేపీలో 2014 నుంచి కొనసాగుతున్నాడు. ‘అల్విదా’ అంటూ ప్రారంభించి తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు సుదీర్ఘ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘అల్విదా.. నేను తృణమూల్, కాంగ్రెస్, సీపీఎం.. ఇలా ఏ పార్టీలోకి చేరడం లేదు. ఆ పార్టీల్లోకి రావాలని నన్ను ఎవరూ పిలవలేదు. నేను ఒకే టీం ప్లేయర్‌ను. ఎప్పటికీ ఒకే పార్టీ (బీజేపీ)లో ఉంటా. నా వల్ల కొంతమంది సంతోషపడగా.. మరికొందరు బాధపడ్డారు. సుదీర్ఘ చర్చల అనంతరం నేను ఒక నిర్ణయం తీసుకున్నా. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా. రాజకీయాల్లో ఉండి సామాజిక సేవ చేయడం అసాధ్యం. నన్ను తప్పుగా అనుకోకండి’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. వీటిలతో మరికొన్ని విషయాలను ఆ ప్రకటనలో ప్రస్తావించారు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో అస్సనోల్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎంపీగా గెలిచారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలి మంత్రివర్గంలో బాబుల్ సుప్రియో చేరారు. పట్టణ అభివృద్ధి సహాయ మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో మళ్లీ అస్సనోల్ నుంచి గెలుపొంది కేంద్రమంత్రిగా నియమితులయ్యారు. అయితే ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బాబుల్ సుప్రియోకు చోటు దక్కలేదు. అందుకు కారణం లేకపోలేదు. తాజాగా జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బాబుల్ సుప్రియోను బీజేపీ బరిలో దింపింది. అనూహ్యంగా సుప్రియో తృణమూల్ కాంగ్రెస్ చేతిలో పరాజయం పొందాడు. దీంతోపాటు రాష్ట్రంలో బీజేపీ ఆశించిన ఫలితాలు పొందలేదు. ఇది దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధినాయకత్వం కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయనను తొలగించింది. ఈ క్రమంలోనే ఆయన మనస్తాపానికి గురయ్యారు. బీజేపీకి రాజీనామా చేసి తృణమూల్‌లో చేరుతారని వార్తలు వినిపించగా అనూహ్యంగా ఆయన రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం. -
ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్న మాజీ సీఎం
సిమ్లా: దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడు.. ఆరు సార్లు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని.. కాకపోతే పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటానని 86 ఏళ్ల వీరభద్ర సింగ్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వీరభద్ర సింగ్ పని చేశారు. 2017లో అధికారం నుంచి దిగిపోయిన అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు. తన సొంత నియోజకవర్గం అర్కీలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఇకపై ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తా. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పని చేస్తా’’ అని వీరభద్ర సింగ్ తన నియోజకవర్గానికి చెందిన వారితో చెప్పారు. వీరభద్ర సింగ్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నాడు. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన వారిలో ఆయన ఒకరు. ఆయనపై బీజేపీ ప్రభుత్వం పలు కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం వాటి విచారణ కొనసాగుతోంది. అయితే వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్యం నేపథ్యంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం దేశంలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడుగా వీరభద్ర సింగ్ ఉన్నారు. 2012 నుంచి 2017 వరకు హిమాచల్ ప్రదేశ్ సీఎంగా వ్యహరించారు. 1983 నుంచి 1990, 1993 నుంచి 98, 2003-07కాలంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1962, 67, 71, 80, 2007లో లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ రాష్ట్రానికి తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయ గవర్నర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
రాజకీయాలకు వట్టి వసంత్ గుడ్‌బై
మాజీమంత్రి వట్టి వసంతకుమార్ క్రియాశీల రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. ఇక మీదట తాను రాజకీయాల్లో పాల్గొనబోనని ఆయన స్పష్టం చేశారు. 2009 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన గన్ని లక్ష్మీకాంతంపై 6459 ఓట్ల మెజారిటీతో నెగ్గిన వసంత కుమార్.. అప్పుడు చెప్పినట్లు గానే తాను ఇప్పుడు రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విభజన దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టును ఇప్పటికైనా త్వరితగతిన పూర్తి చేయాలని వట్టి వసంత్ డిమాండ్ చేశారు. వట్టి వెంకటరంగ పార్థసారథి కుమారుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన వసంతకుమార్, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే బాగా ఎదిగారు. ఆయన మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన జరిగిన తీరుపట్ల కలత చెంది.. పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ఉంగుటూరులో ఆయన ప్రకటించారు.